లంచం తీసుకున్న చైనా టెలికమ్ ఉద్యోగికి ఉరిశిక్ష

Posted By: Super

లంచం తీసుకున్న చైనా టెలికమ్ ఉద్యోగికి ఉరిశిక్ష

చైనా మొబైల్ మాజీ ఛైర్మన్ $2.6 మిలియన్ లంచం తీసుకునందుకు గాను అక్కడి ప్రభుత్వం అతని ఉరిశిక్షని పెనాల్టీగా విధించిందని ఓ ప్రముఖ చైనా పత్రిక వెల్లడించింది. వివరాల్లోకి వెళితే ఆ వ్యక్తి లి హువా. ఈయన గతంలో స్టేట్ మొబైల్ ఆపరేటర్ సైచాన్ అనే సంస్దకు చైర్మన్, జనరల్ మేనేజర్‌ పదవిని నిర్వహించేవారు. ఈ సందర్బంలో లి హువా తన యొక్క పదవిని అడ్డుగా పెట్టుకొని కొంత ఫండ్స్ మొత్తాన్ని అధికార దుర్వినియోగంతో పాటు, లంచం తీసుకోవడం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

దాంతో లి హువాకి రెండు సంవత్సరాలు పదవీ కాలం ఉండగానే అతను లంచం తీసుకున్నందుకు, అధికార దుర్వినియోగం చేసినందుకు గాను అతనికి ఉరిశిక్షను అక్కడి ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి కారణం రాబోయే కాలంలో ఇలాంటి పనులు వేరే వారు చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రపంచం మొత్తం మీద మొబైల్ ఇండస్ట్రీలో అతి పెద్ద మొబైల్ ఆపరేటర్ అయిన చైనా మొబైల్ ఇటీవల తన అర్ద సంవత్సరానికి వచ్చిన లాభాలను $9.6bnగా వెల్లడించింది. ప్రపంచం వ్యాప్తంగా చైనా మొబైల్ యూజర్స్ 929 మిలియన్ మంది ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot