కామ్‌గా ఉండండి... కౌంట్ డౌన్ మొదలైంది!

Posted By: Staff

కామ్‌గా ఉండండి... కౌంట్ డౌన్ మొదలైంది!

 

నోకియా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన 41పిక్సల్ మెగా కెమెరా స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 808 ప్యూర్ వ్యూ’ గత కొద్ది వారాల నుంచి మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ హ్యాండ్‌సెట్ ఆవిష్కరణ అదేవిధంగా ధరకు సంబంధించి అనధికారికంగా వెలుగులోకి వస్తున్న వివరాలను నోకియా వర్గాలు ఖండిస్తూవస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా పరిచయమైన ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. అయితే, నోకియా వర్గాలు ఈ ఫోన్ ఫ్రీ-లాంచ్‌కు సంబంధించి ‘కౌంట్ డౌన్’ గడియారాన్ని ఆవిష్కరించటం జరిగింది. దీనికి సంబంధించి ప్రీ-ఆర్డర్ పేజీని నెలకొల్పిన నోకియా యూజర్ మొబైల్ నంబర్‌తో పాటు ఈ-మెయిల్ చిరునామాను తీసుకుంటుంది.

పలు నివేదికలు నోకియా ప్యూర్ వ్యూ 808 ధరను రూ.29,999గా ప్రకటించాయి. ఈ రూమర్ పై స్సందించిన నోకియా అధికార ప్రతినిధి ఒకరు ‘ధరకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆ సమాచారం ఖచ్చితమైనది కాదని, ఖచ్చితంగా డమ్మిదని’ స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ బుయ్ ద ప్రైస్.కామ్ వారు ముందస్తు బుకింగ్‌లో భాగంగా రూ.32,000లకు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అంశం పై స్పందించిన నోకియా వర్గాలు తమకు ఆ రిటైలర్ కు ఏ విధమైన ఒప్పందం జరగలేదని, ఈ డీల్‌ను వినియోగదారులు నమ్మవద్దని హెచ్చరించినట్లు సమాచారం. కౌంట్ డౌన్ గడియారం ప్రకారం మరికొద్ది రోజుల్లో ‘నోకియా 808 ప్యూర్ వ్యూ’ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నోకియా 808 ప్యూర్ వ్యూ ప్రధాన ఫీచర్లు:

4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),

1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

జీపీఎస్ సపోర్ట్,

బ్లూటూత్,

41 మెగాపిక్సల్ కెమెరా,

1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,

32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,

1400mAh లియాన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot