1000 రోజులలో విండోస్ ఎక్స్‌పి చనిపోతుందా...?

Posted By: Staff

1000 రోజులలో విండోస్ ఎక్స్‌పి చనిపోతుందా...?

శాన్‌ప్రాన్సికో:‌ ప్రపంచం మొత్తం మెచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎక్స్‌పి. అలాంటి విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్‌కి కౌంట్ డౌన్ మొదలైంది. కౌంట్ డౌన్ అంటే ఏమిటని అనుకుంటున్నారా.. ప్రపంచం మొత్తం బాగా పాపులర్ అయిన విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్‌ని మూడు సంవత్సరాల తర్వాత ఆపివేయనున్నారని సమాచారం. విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించి అన్ని రకాల సపోర్ట్‌ని త్వరలోనే ఆపివేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీనికి కారణం విండోస్ ఎక్స్‌పి పాత వర్సన్ కావడమే కాకుండా కొత్తగా విడుదల చేసినటువంటి విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సేల్స్ పెంచుకోవడానికి తెలియజేశారు.

విండోస్ ఎక్స్‌పి ఇప్పటివరకు కొన్ని మిలియన్ యాజర్ల కంప్యూటర్లలలో చాలా హుందాగా రన్ అవ్వడం జరిగింది. ఈ సందర్బంలో మైక్రోసాప్ట్ సీనియర్ కమ్యూనటీ మేనేజర్ స్టీఫెన్ రోస్ మాట్లాడుతూ విండోస్ ఎక్స్‌పి‌ని ఆపివేయడానికి రెండు కారణాలు వెల్లడించారు. ఒకటి విండోస్ ఎక్స్‌పికి సంబంధించి మరే ఇతర సపోర్ట్ లభించకపోవడం. రెండవది విండోస్ ఎక్స్‌పి కంటే కూడా బెటర్, గుడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో ఉందని అన్నారు. ఇక విండోస్ ఎక్స్‌పిని 2014 చివరి కల్లా పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరైతే యూజర్స్ విండోస్ ఎక్స్‌పి ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారో వారికి 2014 తర్వాత దానికి సంబంధించి ఎటువంటి సపోర్ట్ లభించదని అన్నారు. ఒకవేళ యూజర్స్ ఏమైనా సపోర్ట్ గనుక కావాలంటే వారు తప్పనిసరిగా విండోస్ 7కి అప్ గ్రేడ్ అవ్వాల్సిందేనని ఆయన తెలయజేశారు.

ఇది ఇలా ఉండగా మైక్రోసాప్ట్ 2012లో మరో క్రొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని విడుదల చేయాడానికి ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల జరిగినటువంటి D9 కాన్పరెన్స్‌లో విండోస్ 8కి సంబంధించిన ప్రోటోటైపుని డెమోగా కంప్యూటర్‌లో చూపించిన విషయం తెలిసిందే. ఇక విండోస్ 8లో ఉన్న కొత్త ఫీచర్ ఏమిటంటే టచ్ ఇంటర్‌ఫేస్‌తో యూజర్స్‌ని ఇట్టే ఆకట్టుకుంటుందని తెలియజేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting