Home
News

కన్న కూతుర్ని కడ తేర్చడానికి వచ్చిన తండ్రి...సీసీటీవీలో రికార్డు అయిన వీడియో

ప్రణయ్‌ హత్యోదంతం మరువక ముందే నగరంలో అలాంటిదే మరో దాడి జరగడం చర్చనీయాంశమైంది.పెళ్లి దుస్తులు తీసుకుందాం రమ్మని చెప్పిన కూతుర్నే కడతేర్చడానికి చూసాడు ఒక కసాయి తండ్రి.

ప్రణయ్‌ హత్యోదంతం మరువక ముందే నగరంలో అలాంటిదే మరో దాడి జరగడం చర్చనీయాంశమైంది.అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు తన మాట కాదని కులాంతర పెళ్లి చేసుకోవడంతో ఆవేశం తట్టుకోలేక కడతేర్చడానికి చూసాడు ఒక కసాయి తండ్రి .పెళ్లి దుస్తులు తీసుకుందాం రమ్మని పిపిలిపించి హైదరాబాద్ లోని మిర్యాల గూడ దగ్గర మిట్ట మధ్యాహ్నం.వందల మంది వచ్చిపోతున్నా సమయంలో తన వద్ద తెచ్చుకున్న కత్తితో తన కూతుర్ని చంపడానికి ప్రయత్నించాడు.

ఈ ఉదంతమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యి ఉంది.

బోరబండలో నివాసం ఉండే మనోహరాచారి....

బోరబండలో నివాసం ఉండే మనోహరాచారి....

బోరబండలో నివాసం ఉండే మనోహరాచారి, ఎస్సార్‌నగర్‌లో ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నాడు.తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు మాధవి, అల్లుడి సందీప్‌లని చంపాలన్న లక్ష్యంతో మనోహరాచారి కొన్ని రోజులు ముందుగానే పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. ముందుగానే కత్తిని కొనుగోలు చేసి తన బ్యాగులో దాచిన ఆయన బుధవారం ఉదయం షాపుకు వెళ్లి ఇంట్లో పని ఉందని యజమానికి చెప్పి బయటకు వచ్చాడు.

ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ సమీపంలోని...

ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ సమీపంలోని...

పెళ్లి బట్టలు కొందామని, ఎర్రగడ్డలోని గోకుల్‌ థియేటర్‌ సమీపంలోని దుకాణాల్లో చౌకగా ఉండటంతో పాటు, నాణ్యతగా కూడా ఉంటాయని తన కూతురు, అల్లుడికి చెప్పి, అక్కడికి రావాలని సూచించాడు. వారి కంటే ముందుగానే ఎర్రగడ్డ పరిసరాల్లోకి వచ్చి వారి కోసం ఎదురు చూసాడు. మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తాను చెప్పిన ప్రదేశానికి కూతురు , అల్లుడు వచ్చి ఫోన్‌ చేయటంతో అక్కడికి చేరుకున్న చారి బండి దిగుతూనే దాడికి తెగబడ్డాడు.

హ్యుండై కారు షోరూంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు....

హ్యుండై కారు షోరూంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు....

అక్కడ హ్యుండై కారు షోరూంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు దాడిని ఆపే ప్రయత్నం చేసినా అదేమీ పట్టించుకోకుండా కత్తిని తిప్పుతూ హెచ్చరికలు చేశాడు. రహదారిపై వచ్చిపోయే వారు తమ వైపు రాకుండా చూసుకుంటూ కూతురు , అల్లుడిపై కత్తితో దాడి చేసిన వైనం ప్రత్యక్ష సాక్షుల్ని తీవ్ర భయోందళనలకు గురి చేసింది.

ఉన్మాద తీవ్రతకు.....

ఉన్మాద తీవ్రతకు.....

ఓ యువకుడు వెనక నుండి వచ్చి వీపుపై తన్నినా కూడా ఆయన తన ప్రయత్నాలను విరమించుకోకపోవటం ఆయనలోని ఉన్మాద తీవ్రతకు అద్దం పట్టిందని ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఆటో డ్రైవర్‌ రవీందర్‌ చెప్పారు.

దాడి అనంతరం కొన్ని నిమిషాల పాటు.....

దాడి అనంతరం కొన్ని నిమిషాల పాటు.....

దాడి అనంతరం కొన్ని నిమిషాల పాటు మాధవి రోడ్డుపైనే పడిఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసింది. దాడిలో ఆమె ఎడమచేతికి తీవ్ర గాయమై , చేతిపై కండ, చర్మం పూర్తిగా తొలగిపోవడంతో రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి .

Best Mobiles in India

English summary
Couple attacked in Hyderabad over inter-caste marriage.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X