ల్యాప్‌టాప్ తొడల పై పెట్టుకుంటే.. వీర్య కణాలు మటాష్!

Posted By: Super

ల్యాప్‌టాప్ తొడల పై పెట్టుకుంటే.. వీర్య కణాలు మటాష్!

 

లండన్: లండన్ వైద్యులు తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటన ల్యాప్‌టాప్ వినియోగదారులను మరింత అప్రమత్తం చేస్తోంది. ల్యాపీని అస్తమానం తొడల పై పెట్టుకుని వినియోగించటం వల్ల వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందట. బ్రిటన్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణని  వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే......... హ్యాంప్‌షైర్‌కు చెందిన స్కాట్ రిడ్(30), ల్యూరా దంపతులు సంతానం కోసం ఆర్నెళ్ల పాటు విఫలయత్నం చేశారు. ఫలితం లేకపోవటంతో వైద్యులను ఆశ్రయించారు. తమ సంతాన సౌఫల్యతకు  ల్యాప్‌టాప్ అవరోధంగా మారిందని వైద్యులు తేల్చటంతో వారు బిత్తరపోయారు. రిడ్ వినియోగించే ల్యాప్‌టాప్ నుంచి ఉత్ఫత్తైన వేడే ఆయన వీర్య కణాలను నాశనం చేసిందని వైద్య బృందం పరిశోధనల ద్వారా కనుగొంది.

వైద్యులు సూచనల మేరకు ల్యాపీని టేబుల్ పైన పెట్టి వాడటం ప్రారంభించిన మూడు నెలలకే రిడ్ భార్య ల్యూరా గర్భం దాల్చారని ‘డెయిలీ మెయిల్’ పేర్కొంది.  స్కాట్ రిడ్‌లో సంతాన సౌఫల్యతకు అవసరమైన వీర్య కణాలు ఉత్పత్తి జరుగుతున్నప్పటికి అవి ల్యాప్‌టాప్ వేడికి ప్రభావితమయ్యేవని వైద్యులు గుర్తించారు.  స్కాట్ రోజు కొన్ని గంటల పాటు ల్యాప్‌టాప్ వాడుతున్నారని, ఇదే అతని వీర్యకణాల పై ప్రభావం చూపిందని  వైద్యులు చెప్పారు. అందుకే ల్యాప్‌టాప్‌ను తొడలమీద కాకుండా టేబుల్ పై  పెట్టి ఉపయోగించాలని వారు హెచ్చరిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot