Home
News

COVID-19 టీకా హెల్ప్‌లైన్ నంబర్: ఫోన్ కాల్‌తో COVID-19 టీకా స్లాట్‌ను బుక్ చేసుకోవడం ఎలా?

ఇండియాలో కరోనా కేసులను తగ్గించడం కోసం కొన్ని వారాల క్రితం 18-44 మధ్య వయస్సు గలవారికి COVID-19 టీకా స్లాట్ ను బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకువచ్చింది. కోవిన్ పోర్టల్‌లో ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ మరియు COVID-19 టీకా కోసం నియామకం ప్రారంభించబడినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు తమ పేర్లను పోర్టల్‌లో నమోదు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. పౌరులకు ఉపశమనం కలిగించడానికి ఫోన్ కాల్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్‌ను బుకింగ్ / రిజిస్ట్రేషన్ చేయటానికి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా హెల్ప్‌లైన్‌ను ప్రకటించింది.

కోవిడ్ -19 వ్యాక్సిన్

ప్రజలు ఇప్పుడు కోవిడ్ -19 వ్యాక్సిన్ స్లాట్‌ను ‘1075' హెల్ప్‌లైన్ నంబర్‌తో బుక్ చేసుకోగలుగుతారు అని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) చీఫ్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న చాలా మందికి బుకింగ్ స్లాట్‌ల కోసం ఆన్‌లైన్ యాక్సెస్ విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉన్న అన్ని సాధారణ సేవా కేంద్రాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో టీకా కోసం స్లాట్‌లను నమోదు చేసుకోవచ్చు అని అన్నారు. ఇది వివిఐపి అయినా, సాధారణ పౌరుడైనా ప్రతి ఒక్కరికి టీకా గురించి ఒకే డేటాను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఫోన్ కాల్‌లో COVID-19 టీకా స్లాట్‌ను బుక్ చేసుకోనే విధానం

ఫోన్ కాల్‌లో COVID-19 టీకా స్లాట్‌ను బుక్ చేసుకోనే విధానం

** మీ ఫోన్‌లో ‘1075' హెల్ప్‌లైన్ నంబర్ డయల్ చేసి COVID-19 టీకా స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు.

** కాల్ చేసిన తర్వాత కోవిన్ గురించి వివరాలు తెలుసుకోవాలా లేదా COVID-19 టీకా స్లాట్‌ను బుక్ చేసుకోవాలా అని మిమ్మల్ని అడుగుతారు. టీకా కోసం స్లాట్‌ను నమోదు చేయడానికి / బుక్ చేయడానికి ‘2' నొక్కండి.

** దీని తరువాత మీ కాల్ కస్టమర్ ప్రతినిధికి బదిలీ చేయబడుతుంది.

** ఫోన్ చేసే ముందు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, పెన్షన్ పాస్‌బుక్, ఎన్‌పిఆర్ స్మార్ట్ కార్డ్, లేదా ఓటరు ఐడి వంటి మీ పత్రాలను చేతిలో ఉంచుకోవాలి. తరువాత అపాయింట్‌మెంట్ నమోదు / బుక్ చేసుకోవడానికి ప్రతినిధి చెప్పిన విధానాన్ని అనుసరించండి.

ఇది ప్రస్తావించదగినది మేము టీకా కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కస్టమర్ ప్రతినిధి హెల్ప్‌లైన్ నంబర్ ప్రస్తుతానికి టీకా కోసం రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

COWIN పోర్టల్

COWIN పోర్టల్ మరియు కొత్తగా ప్రకటించిన హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు మీరు ఆరోగ్య సేతు యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. అదనంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ వారం టీకా కోవిన్ సైట్‌ను థర్డ్ పార్టీ యాప్‌లతో అనుసంధానించడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం యాప్ డెవలపర్‌లను వారి స్వంత ప్లాట్‌ఫామ్‌లలో కోవిన్ API ని చేర్చడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది మరియు ప్రతి ఒక్కరూ నేరుగా టీకా స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
COVID-19 Vaccine Helpline Number: How to Book a COVID-19 Vaccine Slot Through Phone Call?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X