Covid-19 వాక్సిన్ బుక్ చేస్తున్నారా?? వీటిలో బుక్ చేసారో అంతే సంగతులు...

|

భారతదేశం అంతటా కోవిడ్-19 వాక్సిన్ ఆన్‌లైన్ పద్ధతి ద్వారా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ ప్రక్రియను దృష్టిలో ఉంచుకొని కొంత మంది మోసపూరితమైన స్కామర్లు పౌరులను మోసగించడానికి కొత్త కొత్త మార్గాలను వెతుకుతున్నారు. వాక్సిన్ డ్రైవ్ మొత్తంగా ఆన్‌లైన్ లో డిజిటల్ పద్దతిలో జరుగుతుంది కాబట్టి మీరు ఆరోగ్యా సేతు యాప్ లేదా కోవిన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలి.

Covid-19 Vaccine Online Booking?? You Should Not Use These Fake Websites and Apps

వ్యాక్సిన్ సరఫరా కొద్దిగా ఆలస్యం అవడంతో పాటుగా డిమాండ్ మరింత పెరిగింది. ఈ కొరతను సద్వినియోగం చేసుకొని ఆన్‌లైన్ బ్యాంకింగ్ లాగిన్ వంటి వివరాలు మరియు ఇతర వ్యక్తిగత వివరాలను దొంగిలించాలనే ఉద్దేశ్యంతో స్కామర్లు పౌరులను మోసగించి నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ యాప్ లలో నమోదు చేయమని ఆకర్షిస్తున్నారు. మీరు ఇప్పటికి కోవిడ్ వ్యాక్సిన్ ను పొందకుండా ఉంటే కనుక దానిని నమోదు చేయడం కోసం పొరపాటున కూడా కింద తెలిపే తొమ్మిది యాప్ లను ఉపయోగించకూడదు. వీటిలో మీ యొక్క వివరాలను నమోదు చేస్తే కనుక మీ యొక్క వివరాలు దొంగలించబడతాయి. ఆ 9 యాప్ ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Covid-19 Vaccine Online Booking?? You Should Not Use These Fake Websites and Apps

కోవిడ్-19 వాక్సిన్ బుకింగ్ నకిలీ వెబ్‌సైట్ & యాప్ ల వివరాలు

*** "Vaci__Regis.apk" ఇది SMS ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ యాప్

*** "Covid-19.apk" ఈ మాల్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్‌లను లక్ష్యంగా చేసుకునే నకిలీ వ్యాక్సిన్ యాప్. దీనిని ఇన్‌స్టాల్ చేసే కనుక వినియోగదారుల వ్యక్తిగత డేటాను సేకరింస్తుంది.

*** "Https://selfregistration.sit.co-vin.in" లింక్‌తో లభించే వెబ్ యాప్ మరియు వెబ్‌సైట్ పూర్తిగా నకిలీ యాప్.

Covid-19 Vaccine Online Booking?? You Should Not Use These Fake Websites and Apps

*** "Https://app.preprod.co-vin.in/login" URL ఈ యాప్ ను ఎట్టిపరిస్థితులలోను డౌన్‌లోడ్ చేయవద్దు.

*** "Https://selfregistration.preprod.co-vin.in" అనేది నకిలీ వ్యాక్సిన్ యాప్.

*** "MyVaccin_v2.apk" అనేది పూర్తిగా నకిలీ వ్యాక్సిన్ బుకింగ్ యాప్.

*** "Cov-Regis.apk"

*** "Vccin-Apply.apk" ఈ నకిలీ కోవిడ్ వ్యాక్సిన్ యాప్ అధికంగా SMS ద్వారా వ్యాప్తి చెందుతోంది.

***"http://tiny.cc/COVID-VACCINE" వంటి URL మీద ఎటువంటి పరిస్థితులలోను క్లిక్ చేయవద్దు.

Best Mobiles in India

English summary
Covid-19 Vaccine Online Booking?? You Should Not Use These Fake Websites and Apps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X