Home
News

coWIN Data Leak కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారి డేటా లీక్‌..? టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం..!!

భారతీయుల వ్యక్తిగత డేటా లీకేజీపై ఓ సంచలన రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రజలతో పాటు ప్రముఖుల వ్యక్తిగత సమాచారం కూడా లీకైందని రిపోర్ట్‌ వెల్లడించింది. కరోనా టీకా వేసుకొనే సమయంలో భారతీయులంతా ప్రభుత్వం తీసుకొచ్చిన వెబ్‌సైట్‌ coWINలో తమ వివరాలు నమోదు చేశారు. ఆధార్‌, పాన్‌ వివరాలు టెలిగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చాయని ఫోర్త్‌ న్యూస్‌ నివేదిక వెల్లడించింది.

ఫోర్త్‌ న్యూస్‌ నివేదిక ప్రకారం.. కొవిన్‌ యాప్‌లో నమోదైన ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయగానే. కరోనా వ్యాక్సినేషన్‌ సమయంలో సమర్పించిన గుర్తింపు కార్డులు, వారి పుట్టిన సంవత్సరం, తొలి డోసు వ్యాక్సినేషన్‌ కేంద్రం సహా మరిన్ని వివరాలను టెలిగ్రామ్‌ బోట్‌ వెల్లడిస్తోందని తెలిపింది.

corona vaccination data leak

కరోనా వ్యాక్సిన్‌ పోర్టల్‌లో నమోదైన వారి వ్యక్తిగత సమాచారం లీక్‌ అయిందని కొన్ని కథనాలు ప్రచురించాయి. దీంతో టెలిగ్రామ్‌ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. వ్యక్తిగత సమాచారం లీక్‌ కాకుండా చూసింది. డేటా లీకేజీపై అధికారులు కూడా స్పందించారు. ఈ ఘటనపై ఆడిట్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. coWIN యాప్‌ డేటా లీకేజీ జరిగిందన్న వార్తలను ప్రభుత్వ అధికారులు తిరస్కరించారు. అయితే అనధికారిక యాక్సెస్‌లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

డేటా లీకేజీ బాధితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ కూడా ఉన్నారని ఓ కథనం వెలువడింది. రాజేష్‌ భూషణ్‌ ఫోన్‌ నంబర్‌ను నమోదుచేయగానే.. అతని ఆధార్‌ నంబర్‌ చివరి నాలుగు అంకెలు మరియు పుట్టిన తేదీ వివరాలు సహా అతని భార్య ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యే రితూ ఖందూరి సమాచారం కూడా వెల్లడైందని పేర్కొంది.

corona vaccination data leak

కొవిన్‌ హై పవర్‌ ప్యానల్‌ ఛైర్మన్‌ రామ్‌ సేవక్‌ శర్మ, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ సమాచారం కూడా లీక్‌ అయినట్లు సమాచారం. 2021లోనే కొవిన్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురైందని వార్తలు వచ్చాయి. సుమారు 15 కోట్ల మంది డేటా విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనకులు ఆ వార్తలను ఖండించారు.

అయితే తాజా టెలిగ్రామ్‌ లీకేజీలో ఫోన్‌ నంబర్‌ను నమోదుచేయగానే.. ఆధార్‌ లేదా పాస్‌పోర్ట్‌ నంబర్‌ మరియు తొలి కరోనా వ్యాక్సిన్‌ డోస్‌ తీసుకున్న కేంద్రం వివరాలు, పుట్టిన తేదీ సమాచారాన్ని యాక్సెస్‌ చేయవచ్చని ఫోర్త్‌ న్యూస్‌ తెలిపింది. సాధారణంగా ఫోన్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయకుండా.. కొవిన్‌ యాప్‌లోకి లాగిన్‌ కావడం కుదరదు.

కొవిన్‌ పోర్టల్‌ డేటా లీకేజీపై తృణమూల్ కాంగ్రెస్‌ నేత సాకేత్‌ గోఖలే ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఫోన్‌ నంబర్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ సంఖ్య సహా కుటుంబ సభ్యుల వివరాలు లీక్‌ అయ్యాయని ట్వీట్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ ఓబ్రెయిన్‌, కాంగ్రెస్‌ నేతలు పి చిదంబరం, కేసీ వేణుగోపాల్‌, జర్నలిస్టులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, బర్ఖాదత్‌ సహా మరెంత మందో వివరాలు లీక్‌ అయ్యాయంటూ వారికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌లను సాకేత్‌ గోఖలే ట్వీట్‌ చేశారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
CoWIN Data leaked in telegram app including high profile persons sensitive information
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X