CoWIN పోర్టల్ లో కొత్తగా భద్రతా కోడ్‌!! ఎలా పనిచేస్తుందో తెలుసా?

|

కరోనా యొక్క తీవ్రతను ఎదురుకోవడం కోసం ప్రభుత్వం టీకాలను విడుదల చేసిన విషయం అందరికి తెలిసినదే. అయితే టీకా యొక్క స్లాట్‌లను బుక్ చేసుకోవటానికి ప్రతి ఒక్కరు భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్ళవలసి ఉంటుంది. టీకా స్లాట్ బుకింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా చేయడానికి ఈ కోవిన్ వెబ్‌సైట్‌ ఈ రోజు నుండి నాలుగు అంకెల సురక్షిత కోడ్‌ను అందుకున్నది. ఈ నాలుగు-అంకెల భద్రతా కోడ్ అనేది తప్పుగా నకిలీ టీకా ధృవీకరణ పత్రాలను తగ్గించడంతో పాటుగా వినియోగదారులను తప్పుదారి పట్టించాలని చూస్తున్న స్కామర్లు మరియు మోసగాళ్ళను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది.

భద్రతా కోడ్

టీకా కేంద్రాల్లో అధికారులకు నాలుగు అంకెల భద్రతా కోడ్ ను సరఫరా చేసిన తర్వాత మాత్రమే టీకా సర్టిఫికేట్ ను పొందడానికి వీలును కల్పిస్తుంది అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. టీకా సర్టిఫికెట్ల ఉత్పత్తిలో లోపాలను తగ్గించడం కోసం ఈ భద్రతా కోడ్‌ను ప్రవేశపెట్టినట్లు సమాచారం. వ్యక్తిగత ఆర్థిక లాభాల కోసం టీకా డ్రైవ్‌ను దుర్వినియోగం చేయాలని చూస్తున్న మోసగాళ్ళను దూరంగా ఉంచడంలో ఈ నాలుగు అంకెల భద్రతా కోడ్ ఉపయోగపడుతుంది.

కోవిన్ పోర్టల్‌ నాలుగు అంకెల భద్రతా కోడ్

కోవిన్ పోర్టల్‌ నాలుగు అంకెల భద్రతా కోడ్

కోవిన్ యొక్క కొత్త నాలుగు అంకెల భద్రతా కోడ్ ఎలా పనిచేస్తుంది? అన్న విషయానికి వస్తే టీకా స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి కోవిన్‌ వెబ్‌సైట్‌కు వెళ్లే వ్యక్తులు టీకా కోసం స్లాట్ ధృవీకరించబడిన తర్వాత వారు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌లో ఈ కోడ్‌ను అందుకుంటారు. టీకా స్లాట్ నిర్ధారించబడిన తర్వాత నాలుగు అంకెల భద్రతా కోడ్ ఉత్పత్తి చేయబడి టెక్స్ట్ మెసేజ్ ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది. అయితే మీరు ఈ కోడ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలి. అలాగే దీనిని ఎవరితోనూ భాగస్వామ్యం చేయరాదు. టీకా రోజున మొత్తం టీకా ప్రక్రియను యాక్సిస్ చేయడానికి టీకా కేంద్రంలో కోడ్‌ను ఉపయోగించవలసి ఉంటుంది.

నాలుగు అంకెల భద్రతా కోడ్ తరువాత టీకా ప్రక్రియ పనిచేసే విధానం

నాలుగు అంకెల భద్రతా కోడ్ తరువాత టీకా ప్రక్రియ పనిచేసే విధానం

-కోవిన్ పోర్టల్‌కు వెళ్ళండి

-మీ యొక్క పూర్తి వివరాలను అందించండి. అలాగే SMS ద్వారా OTP ని పొందడం కోసం మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. లేదా మీరు ఇప్పటికే నమోదు చేసుకుంటే అవసరమైన ఆధారాలతో సైన్ ఇన్ చేయండి.

-తరువాత మీ యొక్క నివాస రాష్ట్రం మరియు జిల్లాను ఎంచుకోండి. లేదా సమీప టీకా కేంద్రం యొక్క పిన్ కోడ్ మీకు తెలిస్తే కనుక దానిని నమోదు చేయవచ్చు.

-మీరు ఇప్పుడు దగ్గరలో ఉన్న అన్ని టీకా కేంద్రాలు మరియు వాటిలో లభించే స్లాట్‌లను చూడగలుగుతారు.

-తరువాత గ్రీన్ స్లాట్‌పై క్లిక్ చేసి టైమ్ స్లాట్‌ను ఎంచుకుని బుకింగ్‌ను నిర్ధారించండి.

- తరువాత మీ ఫోన్ కు SMS ద్వారా నాలుగు అంకెల భద్రతా కోడ్‌ను జారీ చేస్తారు.

- టీకా రోజున మీ బుకింగ్‌ను ధృవీకరించడానికి మీరు భద్రతా కోడ్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

-మీరు టీకాలను వేసుకున్న తర్వాత కోవిన్ పోర్టల్‌లో లాగిన్ అయి మీ టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
CoWIN Portal Four-Digit Security Code Working Process

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X