CoWIN పోర్టల్ యూసర్స్ డేటా సేఫ్!! హ్యాక్ అవ్వలేదు... కేంద్రం ప్రకటన

|

భారతదేశంలో కరోనా యొక్క వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేయడానికి భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ హ్యాక్ చేయబడినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ హ్యాకింగ్‌లో భాగంగా దేశం మొత్తం మీద 150 మిలియన్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ డేటా మొత్తాన్ని అమ్మకానికి ఉంచినట్లు కూడా ఈ నివేదికలు పేర్కొన్నాయి. పౌరులను భయభ్రాంతులకు గురిచేసే ఈ లీక్ నివేదికలు వైరల్ కావడంతో వెంటనే భారత ప్రభుత్వం స్పందించి ఈ వాదనను కొట్టిపారేశారు. ఈ వార్తలు మూర్తిగా నకిలీవి అని తెలిపింది. అంతేకాకుండా కోవిన్ పోర్టల్ లో వినియోగదారులు నమోదు చేసుకున్న సమాచారం మొత్తం సురక్షితంగా ఉంది అని కూడా తెలిపారు.

కోవిన్ పోర్టల్ హ్యాక్

కోవిన్ పోర్టల్ హ్యాక్

కోవిన్ పోర్టల్ హ్యాక్ చేయబడిందనే నివేదికలను ఖండిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు టీకా అడ్మినిస్ట్రేషన్ (EGVAC) యొక్క ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ "కోవిన్ పోర్టల్ లో టీకా కోసం నమోదు చేసుకున్న డేటా సురక్షితంగా ఉంది. ఇది సురక్షితమైన డిజిటల్ వాతావరణంలో స్టోర్ చేయబడి" ఉంది అని అన్నారు.

 

రెండు చైనా app లతో రూ.150 కోట్లు దోచేశారు..! ఇలాంటి వాటి బారిన పడకండి ..జాగ్రత్త.రెండు చైనా app లతో రూ.150 కోట్లు దోచేశారు..! ఇలాంటి వాటి బారిన పడకండి ..జాగ్రత్త.

కోవిన్ హాక్ వాదనలను కేంద్రం ఖండించింది

కోవిన్ హాక్ వాదనలను కేంద్రం ఖండించింది

ఈ విషయంపై భారత ప్రభుత్వం వ్యాఖ్యానిస్తూ "కోవిన్ ప్లాట్‌ఫాం హ్యాక్ చేయబడిందని ఆధారాలు లేని మీడియా నివేదికలు ఎక్కువగా ప్రచారం అయ్యాయి. ఈ నివేదికలు అన్ని కూడా నకిలీవి అని కేంద్ర ప్రభుత్వం వీటిని ఖండించింది. "

EGVAC
 

EGVAC చైర్మన్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ పౌరులకు సంబందించిన కోవిన్ డేటాను వ్యవస్థ వెలుపల ఏ సంస్థతోనూ పంచుకోలేదని తెలిపారు. "కోవిన్ వ్యవస్థను హ్యాకింగ్ చేశారనే ఆరోపణలపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల వైపు మా దృష్టి పెట్టబడింది. కోవిన్ కనెక్షన్లో టీకా యొక్క మొత్తం డేటాను సురక్షితమైన డిజిటల్ వాతావరణంలో స్టోర్ చేస్తుందని" కూడా శర్మ చెప్పారు.

 COVID-19 స్లాట్‌

కోవిన్ పోర్టల్ దేశవ్యాప్తంగా COVID-19 స్లాట్‌లను తనిఖీ చేయడానికి మరియు బుక్ చేసుకోవడానికి భారతీయులకు సహాయపడుతుంది. పుకారు పుట్టుకొచ్చినట్లు కాకుండా వినియోగదారులకు కోవిన్ యాప్ అందుబాటులో లేదు. కేవలం పోర్టల్ మాత్రమే అందుబాటులో ఉంది. మొదట కోవిన్‌లో స్లాట్ బుక్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. అప్పుడు మాత్రమే వారు సంబంధిత కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్ళాలి. ప్రస్తుతం ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు EGVAC ఈ విషయాన్ని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ MietY దర్యాప్తు చేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
CoWIN Vaccine Register Users Details are Safe!! Central Government Revealed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X