ఛార్జింగ్ సమయంలో పేలిన ఫోన్, కంపెనీ సీఈఓ మృతి

|

ఈ మధ్య ఫోన్ పేళుళ్లు గుండల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ ఫోన్ పేలుతుందో తెలియడం లేదు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌ పేలడంతో ఓ కంపెనీ సీఈఓ మృత్యువాత పడ్డారు. మలేషియాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మలేషియా పత్రికల కథనం ప్రకారం.. క్రాడిల​ ఫండ్‌ కంపెనీకి నజ్రీన్‌ హసన్‌(45) సీఈఓ. ఆయన వద్ద బ్లాక్‌బెర్రీ, హువాయ్‌ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయితే ఇంటివద్ద తన గదిలో ఛార్జింగ్‌ పెట్టిన ఫోన్లలో ఒకటి అకస్మాత్తుగా పేలిపోవడంతో నజ్రీన్‌ మృతిచెందాడని ఆయన బంధువు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

 

అత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలుఅత్యంత తక్కువ ధరలో లభిస్తున్న టాప్ టెన్ 32 ఇంచ్ స్మార్ట్‌టీవీలు

ఫోన్‌ పేలడంతో

ఫోన్‌ పేలడంతో

ఫోన్‌ పేలడంతో దాని భాగాలు మెడ వెనుక భాగం, తలలోనూ గట్టిగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై సీఈఓ మృతిచెందారు.

రెండు ఫోన్లలో ఏ ఫోన్‌ పేలిందో

రెండు ఫోన్లలో ఏ ఫోన్‌ పేలిందో

అయితే అతని దగ్గర ఉన్న రెండు ఫోన్లలో ఏ ఫోన్‌ పేలిందో కచ్చితమైన సమాచారం తమవద్ద లేదని పోలీసులు తెలిపారు.

రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల

రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల

ఫోన్‌ పేలిన తర్వాత రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల ఊపిరాడక కొంత సమయానికే నజ్రీన్‌ హసన్‌ చనిపోయారని చెప్పారు.

అందరు భావిస్తున్నట్లు..
 

అందరు భావిస్తున్నట్లు..

అందరు భావిస్తున్నట్లు అగ్నిప్రమాదం వల్ల ఆయన మరణించలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

క్రాడిల్‌ ఫండ్‌

క్రాడిల్‌ ఫండ్‌

క్రాడిల్‌ ఫండ్‌ అనేది మలేషియాకు చెందిన సంస్థ. వ్యాపారరంగంలోకి అడుగుపెట్టే నూతన సంస్థలకు ఆర్థికంగా సహకారం అందిస్తుంది.

గత 15 ఏళ్లుగా

గత 15 ఏళ్లుగా

గత 15 ఏళ్లుగా నజ్రీన్‌ హసన్‌ క్రాడిల్‌ ఫండ్‌లో సేవలందిస్తూ ఎంతో మంది కొత్త వ్యాపారవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. వ్యాపారవేత్త నజ్రీన్‌కు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.

Best Mobiles in India

English summary
Cradle Fund CEO Dies After Phone Explodes While Charging At Home More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X