వర్షానికి మీ స్మార్ట్‌ఫోన్ ఆరోగ్యం దెబ్బతిందా..?

వివిధ రుగ్మతలకు గురైన ఫోన్‌ను సాధారాణ స్థితికి చేర్చేందుకు పలువురు సూచించిన వంటింటి క్రేజీ పరిష్కార మార్గాలను మీ ముందుంచుతున్నాం.
ప్రమాదవశాత్తూ మీ ఫోన్ నీటిలో తడిచిందా. ఇంతటితో ఫోన్ పని అయిపోయిందని నిరుత్సాహపడొద్దు. చమ్మతాకిడికి లోనైన మొబైల్ ఫోన్‌ను యధావిది స్థాయికి తెచ్చేందుకు ఈ సూచనలను అమలు చేయండి.... నీటి తాకిడికి లోనైన మీ డివైజ్ పనితీరు ఎలా ఉందో తొలత చెక్ చేసుకోండి. ఈ సందర్భంలో బటన్‌లను ఎక్కువగా ప్రెస్ చేయవద్దు. కీప్యాడ్ పై అధిక ఒత్తిడి తీసుకురావటం వల్ల చమ్మలోనికి ప్రవేశించే ఆస్కారం ఉంది.
తరువాతి చర్యగా ఫోన్ నుంచి బ్యాటరీని వేరు చేయండి. ఇలా చేయటం వల్ల షార్ట్ సర్య్యూట్ బెడద తప్పుతుంది. తదుపరి చర్యగా కీప్యాడ్ ప్యానెల్‌ను వేరు చేయండి. ఫోన్‌లోని సిమ్ కార్డ్స్ అలాగే మెమరీ కార్డ్‌లను వేరుచేయండి. పొడి టవల్ తీసుకుని చమ్మతాకిడికి లోనైన ప్రదేశాన్ని డ్రై చేయండి. తడిబారిన ప్రదేశం వెచ్చబడిన అనంతరం ఫోన్‌ను 24 గంటల పాటు బిగుతైన ఎయిర్ కంటైనర్‌లో ఉంచండి. ఫోన్ పూర్తిగా ఆరినట్లు అనిపిస్తే బ్యాటరీని జతచేసి స్విచ్ ఆన్ చేయండి. మీ ఫోన్ ఖచ్చితంగా పనిచేస్తుంది.
సముద్రపు నీటిలో తడిచిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఐసోప్రొపైల్ అనే మద్యాన్ని ఉపయోగించి 24 గంటల పాటు మర్దన చేయటం ద్వారా ఫోన్ సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. (గమనిక: చికిత్స సమయంలో ఫోన్‌ను పూర్తిగా ఆఫ్ చేయాల్సి ఉంటుంది).
సీడీ ఇంకా డీవీడీలను క్లీన్ చేసేందుకు టూత్ పేస్ట్‌ను ఉపయోగించవచ్చన్న విషయం మనకు తెలిసిందే. అయితే స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పై ఏర్పడ్డ గీతలను మటుమాయం చేయటంలోనూ టూత్పేస్ట్ దోహదపడుతుందట. టూత్‌పేస్ట్‌ను గీతలు ఏర్పడిన ఫోన్ స్ర్కీన్ పై అప్లై చేసి మెత్తటి కాటన్ గుడ్డతో శభ్రం చేయాల్సి ఉంటుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








