ఇప్పుడు జీబ్లీ స్టైల్ AI చిత్రాలు సృష్టించాలనుకుంటున్నారా..? ఉచితంగానే ఇలా క్రియేట్ చేసుకోండి!
Create Studio Ghibli style AI images: ఇంటర్నెట్‌లో ఇప్పుడు స్టూడియో జీబ్లీ (Ghibli) స్టైల్ AI ఇమేజ్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ యానిమేటర్ హయావో మియాజాకి స్ఫూర్తితో, కలల ప్రపంచంలా, చేత్తో గీసినట్లుండే ఈ చిత్రాలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఊహ లోకాలు, విచిత్రమైన పాత్రలు, భావాలు పలికే కళ్లతో ఇవి జీబ్లీ సినిమాలను తలపిస్తున్నాయి.
మీరు కూడా ఓపెన్ఏఐ వారి చాట్‌జీపీటీ 4oతో, ఫ్రీ అకౌంట్‌తోనే ఇలాంటివి సృష్టించవచ్చు. ఉచితంగా జీబ్లీ స్టైల్ AI ఇమేజెస్ సృష్టించడం ఎలా? మొదట్లో పెయిడ్ యూజర్లకే ఈ అవకాశం ఉన్నా, ఇప్పుడు ఫ్రీ యూజర్లు కూడా కొన్ని పరిమితులతో దీన్ని వాడుకోవచ్చు. అదెలాగో చూడండి.

* జీబ్లీ స్టైల్ లో ఇమేజెస్ క్రియేట్ చేయండిలా
స్టెప్ 1: chat.openai.com ఓపెన్ చేసి, మీ Google ID తో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఓపెన్ఏఐ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లాగిన్ అయ్యాక, "New Chat" (కొత్త చాట్) ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఎలాంటి బొమ్మ కావాలో వివరంగా టైప్ చేయండి. ఉదాహరణకు, "సూర్యాస్తమయం వేళ జీబ్లీ స్టైల్ గ్రామం."
స్టెప్ 2: "ఎంటర్" నొక్కండి. చాట్‌జీపీటీ మీరిచ్చిన వివరాలతో చిత్రాలు క్షణాల్లో సృష్టిస్తుంది. ఇమేజ్ కనిపించాక, దానిపై క్లిక్ చేసి "Save image as..." (చిత్రాన్ని ఇలా సేవ్ చేయి...) ఆప్షన్‌తో మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి. మంచి చిత్రాలు రావాలంటే, మూడ్, సెట్టింగ్, వివరాలు స్పష్టంగా చెప్పాలి.
కొన్ని ఉదాహరణలు : "ఒక అమ్మాయి పెద్ద పిల్లిపై మాయా అడవిలో వెళ్తున్నట్లు, స్టూడియో జీబ్లీ స్టైల్‌లో." "పొగగొట్టం నుండి పొగ వస్తున్న అందమైన పల్లెటూరి ఇల్లు, చెర్రీ చెట్లతో, గిబ్లి వెచ్చని రంగుల్లో." "కలల లాంటి నక్షత్రాల ఆకాశంలో కాగితపు విమానంపై ఎగురుతున్న అబ్బాయి, జీబ్లీ యానిమేషన్ స్టైల్‌లో."
* ఈ ఫీచర్ ఎవరు వాడవచ్చు?
చాట్‌జీపీటీ 4o ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఫ్రీ, పెయిడ్ యూజర్లు ఇద్దరూ వాడవచ్చు. కానీ, ఫ్రీ అకౌంట్ వాడేవారికి ప్రస్తుతం రోజుకు 3 బొమ్మలు గీసే అవకాశం మాత్రమే ఉంది. పెయిడ్ యూజర్లు (Plus, Pro, Team) అపరిమితంగా వాడుకోవచ్చు.
* ఎందుకింత ప్రజల ఆదరణ దక్కుతోంది
చాలా సింపుల్‌గా, క్రియేటివ్‌గా ఉండటమే జీబ్లీ స్టైల్ AI ఆర్ట్ వైరల్ అవడానికి కారణం. కేవలం టెక్స్ట్ ఇస్తే చాలు, అద్భుతమైన ఫాంటసీ చిత్రాలు రెడీ అయిపోతాయి. అందుకే ఆర్టిస్టులకు, అభిమానులకు ఇది సరదాగా, సులభంగా అందుబాటులో ఉన్న టూల్ అయ్యింది.
* జీబ్లీ కాపీ రైట్ కన్ఫ్యూజన్..
'స్పిరిటెడ్ అవే' లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన జపాన్ యానిమేషన్ స్టూడియో జీబ్లీ ఫ్యాన్స్ ఈ వారం ఫుల్ ఖుషీ అయ్యారు. ఇంటర్నెట్ మీమ్స్‌ను, వాళ్ల సొంత ఫోటోలను కూడా జీబ్లీ స్టైల్ ఆర్ట్‌గా మార్చే ఫీచర్‌ను చాట్‌జీపీటీ తీసుకురావడమే దీనికి కారణం.
ఈ AI, స్టూడియో వ్యవస్థాపకుడు హయావో మియాజాకి స్ఫూర్తితో, కలలాంటి, చేత్తో గీసినట్లుండే బొమ్మలను సృష్టిస్తోంది. అయితే, ఈ ట్రెండ్ కొన్ని నైతిక ప్రశ్నలనూ లేవనెత్తింది. కాపీరైట్ ఉన్న బొమ్మల నుంచి AI నేర్చుకుని కొత్తవి సృష్టించడం, దీనివల్ల ఆర్టిస్టుల ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతుందేమోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు.
84 ఏళ్ల మియాజాకి, తన సంప్రదాయ, చేతితో గీసే యానిమేషన్, మాయాజాల కథనాలకు ప్రసిద్ధి. ఆయన యానిమేషన్‌లో AI వాడకాన్ని విమర్శిస్తూ, దాని సృజనాత్మకతపై అనుమానాలు వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








