Home
News

క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తున్నారా... ఈ తరహా కాల్స్‌, SMS ల పట్ల అప్రమత్తంగా ఉండండి..!

క్రెడిట్‌ కార్డును సక్రమంగా వినియోగిస్తే అనేక లాభాలుంటాయి. కొనుగోలు సమయంలో డిస్కౌంట్‌లు, ఆఫర్లు, రివార్డు పాయింట్లు పొందవచ్చు. అయితే అప్రమత్తంగా వ్యవహరించాలి. అయితే క్రెడిట్ కార్డుల (Credit Card Scam) వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రివార్డు పాయింట్లు సహా ఇతర ఆఫర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు వల వేసే అవకాశం ఉంది.

క్రెడిట్‌ కార్డు నేరాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని యాక్సిస్‌ బ్యాంకు ఇటీవల ఓ నోట్‌ను విడుదల చేసింది. క్రెడిట్‌ కార్డు వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సైబర్‌ నేరగాళ్లు ఎటువంటి మార్గాల్లో నేరాలకు పాల్పడతారో గుర్తించేలా కొన్ని సూచనలు చేసింది.

credit card scam

ఈ తరహా కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలి :
బ్యాంకు లేదా ఇతర సంబంధిత విభాగాల పేరుతో వచ్చే కాల్స్‌ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ తరహా కాల్స్‌ ద్వారా వినియోగదారులను మభ్యపెట్టి పిన్‌ లేదా OTP లను వెల్లడించేలా తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తారు.

అనుమానిత లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు :
సరైన ధ్రువీకరణ లేదని ఈమెయిల్‌ లేదా బ్యాంక్ లేదా టెలికాం సంస్థల నుంచి వచ్చే SMS లలోని లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దు. వినియోగదారుల బ్యాంకింగ్‌ సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ఈ తరహా మెయిల్‌లు వస్తుంటాయి.

నకిలీ టోల్‌ ఫ్రీ నంబర్లు, లేదా నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్ల ద్వారా క్రెడిట్‌ కార్డు వినియోగదారులను మోసగించే అవకాశం ఉంది. ఫలితంగా అధికారిక వెబ్‌సైట్‌లు, సోషల్‌మీడియా పేజీల్లోని వివరాల ఆధారంగా మాత్రమే క్రెడిట్‌ కార్డు సంబంధిత లావాదేవీలపై సిబ్బందితో సంప్రదింపులు జరపాలి.

దీంతోపాటు ముఖ్యంగా రిమోట్‌ అప్లికేషన్‌ ద్వారా ఎవరినీ అనుమతించకపోవడం ఉత్తమం. ఈ రిమోట్‌ యాక్సెస్‌ ద్వారా మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్లు అనేక పద్ధతుల్లో నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. అందువల్ల క్రెడిట్‌ కార్డు వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వెల్లడించకూడదు.

బ్యాంకింగ్‌ వివరాల కోసం ఎవరు ఫోన్‌ చేసినా ప్రతిస్పందించే ముందు ఆలోచన చేయాల్సి ఉంది. అపరిచిత వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ పిన్‌, CVV వంటి సున్నితమైన సమాచారం వెల్లడించకూడదు. రివార్డు పాయింట్లకు సంబంధించిన ఎటువంటి కాల్స్‌ వచ్చినా అధికారిక వెబ్‌సైట్‌ లేదా బ్యాంక్ టోల్‌ఫ్రి నంబర్‌ ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేయాలి.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆందోళన చెందకుండా సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చెయ్యాలి. సైబర్ క్రైం టోల్ ఫ్రీ నంబర్‌ 1930 కు సమాచారం అందించాలి. సమీపంలోని సైబర్ క్రైం పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు అందించాలి. లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చెయ్యాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
credit card scam users needs to be alert with cyber fraud call and sms
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X