మీరు మైక్రోసాప్ట్ ఇండియా మెంబరా.. ఐతే జాగ్రత్త

Posted By: Super

 మీరు మైక్రోసాప్ట్ ఇండియా మెంబరా.. ఐతే జాగ్రత్త

 

ఈవిల్ షాడో గ్రూప్ అనబడే చైనా హాకర్స్ గ్రూప్ ఫిబ్రవరి 12వ తారీఖున మైక్రోసాప్ట్ భారతదేశం స్టోర్స్‌ని హ్యాక్ చేశామని ప్రకటించిన విషయం తెలిసిందే. హ్యాకర్లు మైక్రోసాప్ట్ భారతదేశం స్టోర్స్‌ని హ్యాక్ చేసిన సందర్బంలో కొంత మంది యూజర్స్‌కు చెందిన క్రెడిట్ కార్డు సమాచారాన్ని కూడా దొంగిలించడం జరిగిందని వార్తలు యూజర్స్‌ని  దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

దీనిని దృష్టిలో పెట్టుకోని దీంతో మైక్రోసాప్ట్ భారతదేశం ఇండియాలో  ఉన్న అందరి కస్టమర్స్‌ని అలర్ట్ చేయడమే కాకుండా.. వారి యొక్క క్రెడిట్ కార్డుల సమాచారాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని యూజర్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. దీనితో పాటు మైక్రోసాప్ట్‌లో పని చేస్తున్న ఐటి మెంబర్స్‌కి ఏదైనా సందర్బంలో అనధికార ట్రాన్షాక్షన్స్ జరిగితే వెంటనే తెలియజేయాల్సిందిగా కోరింది.

ఇలా చేయడానికి గల కారణం హ్యాకర్స్ యూజర్స్‌కి చెందిన పూర్తి సమాచారంతో పాటు యూజర్ నేమ్, పాస్ వర్డ్స్‌ని కూడా దొంగిలించామని ఈవిల్ షాడో గ్రూప్ తెలుపడమే. దీంతో మైక్రోసాప్ట్ ఇండియా వినియోగదారులకు వారియొక్క యూజర్ నేమ్స్, పాస్ వర్డ్స్‌‌ని మార్పు చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రస్తుతం మైక్రోసాప్ట్ ఇండియా స్టోర్ ఆఫ్ లైన్‌లో ఉంది.

మీరు మైక్రోసాప్ట్ స్టోర్ ఇండియాలో సభ్యులై ఉండి.. మీయొక్క క్రెడిట్ కార్డు సమాచారం దొంగిలించబడిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మైక్రోసాప్ట్ ఇండియా వారు అందించిన హెల్ప్ లైన్ నెంబర్ 1-800-102-1100 కు కాల్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot