Home
News

AI టెక్నాలజీతో ముఖాలను ఎలా తయారుచేస్తున్నారో చూడండి

సాంకేతిక విజ్ఞానం ఎన్నో అద్బు‌తాల‌ను సృష్టిస్తూ అత్యంత వేగంగా పురోగమిస్తోంది. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీ అద్బు‌తాల‌ను సృష్టిస్తూ వుంటే.... పాత టెక్నాలజీ కనుమరుగవుతోంది. రానున్న ఐదేళ్ల తర్వాత స్మార్ట్‌ఫ

సాంకేతిక విజ్ఞానం ఎన్నో అద్బు‌తాల‌ను సృష్టిస్తూ అత్యంత వేగంగా పురోగమిస్తోంది. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీ అద్బు‌తాల‌ను సృష్టిస్తూ వుంటే.... పాత టెక్నాలజీ కనుమరుగవుతోంది. రానున్న ఐదేళ్ల తర్వాత స్మార్ట్‌ఫోన్లు అనేవి కంటికి కనపడవని ఓ అధ్యయనం చెబుతోంది. అయితే వాటి స్థానాన్ని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేథస్సు) టెక్నాలజీ ఆక్రమిస్తుందట.

AI టెక్నాలజీతో ముఖాలను ఎలా తయారుచేస్తున్నారో చూడండి

అయితే దీనితో ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ అనేక నష్టాలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఓ వెబ్‌సైట్ మనుషుల ముఖాలని చిత్ర విచిత్రంగా మారుస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే...

వెబ్‌సైట్

వెబ్‌సైట్

thispersondoesnotexist.com అనే వెబ్‌సైట్ అనేక రకాలైన బుజ్ ని క్రియేట్ చేస్తోంది. ఈ సంస్థ ఉద్యోగులు AI & machine learning (ML) ద్వారా మనుషుల ముఖ చిత్రాలను తయారు చేస్తున్నారు.

 

ఎవరో తెలియదు

ఎవరో తెలియదు

కాగా ఈ వెబ్‌సైట్ తయారు చేసే ముఖాలు ఎవరివో కూడా తెలియదు. కాని వందల కొద్ది ముఖాలను వైబ్ సైట్లో ఉంచింది. ఈ ముఖాలను చూస్తే అచ్చంగా మనిషి ముఖమేలాగానే ఉంటోంది. అది యానిమేషన్ అన ఎవరూ గుర్తు పట్టడం లేదు. మీరు ఈ సైటు సందర్శించిన ప్రతి సారి మీకు ఓ కొత్త ముఖం కనిపిస్తుంది. అలాగే రీఫ్రెష్ చేసిన ప్రతిసారి ఇలా కొత్త ముఖాలు దర్శనమిస్తాయి.

ఇతర జంతువులు కూడా..

ఇతర జంతువులు కూడా..

కాగా ఈ కంపెనీ ఉద్యోగులు AI & machine learning (ML) ద్వారా మనుషులను పోలిన ముఖాలనే కాకుండా కుక్కలు, పిల్లులు,ఎలుకలు,కార్లు, బెడ్ రూంలను కూడా తయారు చేస్తున్నారు.అయితే ఇది చాలా ఫన్నీగా అనిపించిన దీని వెనుక అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఈ ముఖాలతో వారు ఏమైనా చేయగలరని తద్వారా ఈ ముఖాలు కలిగిన వారు ఎవరైా ఉంటే వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

 

టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది

టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది

కాగా thispersondoesnotexist.com మాత్రం టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చెప్పేందుకే మేము వీటిని ప్రవేశపెట్టామని చెబుతోంది. AI & machine learning (ML) ద్వారా కొత్త కొతతగా టెక్నాలజీని ఎలా ముందుకు తీసుకెళ్లేదానిపైనే కసరత్తు చేస్తున్నమని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Creepy! This website creates human faces of people who don't exist
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X