సాంటా క్లాస్ యాప్ అన్నీ ఆ మెసేజ్‌లే పంపిస్తోంది
సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. దీనికి ఆనందపడాలో లేక బాధపడాలో తెలియడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా అనేక రకాలైన సంఘటనలు జరుగుతున్నాయి. డేటా హ్యాకింగ్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ వరకు అన్ని రకాల అరాచకాలకు ఇది వేదికవుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. ఇక యాప్స్ అయితే మరీ దారునంగా తయారయ్యాయి. చిన్న పిల్లలకు అసభ్యకర సందేశాలను పంపిస్తూ వారు ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎనిమిదేళ్ల పాపకు ఎదురైంది.

వివరాల్లోకెళితే... క్రిస్మస్ పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను ఉద్దేశించి రూపొందించిన సాంటా క్లాస్ అనే మొబైల్ యాప్ అసభ్యకర సందేశాలను పంపిస్తోంది. పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను సర్‌ప్రైజ్ చేయడానికి తల్లిదండ్రులకు ఓ సాధనంగా ఉండేందుకు రూపొందించిన ఈ యాప్ వారికి లేని తలనొప్పిని తెచ్చిపెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తోంది.

ఈ యాప్ బారిన పడి తీవ్ర మానసిక వేదన
నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబం ఈ యాప్ బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ యాప్‌లో తన కూతురికి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని చూసి అవాక్కైంది. అష్లే అడామ్స్ 8 ఏళ్ల కూతురు ఎంతో కుతూహలంగా ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారా ఈ సాంటా యాప్‌లోకి వెళ్లింది. ‘హాయ్' అని టైప్ చేసింది. అయితే ఆ మెసేజ్‌కు బదులుగా వచ్చిన సందేశాన్ని చూసి నిర్ఘాంతపోయింది.

నువ్వేం డ్రెస్ వేసుకున్నావ్
హాయ్ మెసేజ్ సాంటా ఫీచర్స్ ‘నువ్వేం డ్రెస్ వేసుకున్నావ్' అనే జుగుప్సాకరమైన సందేశాన్ని పంపించింది. ఈ సందేశం చూసి తాను షాక్ గురయ్యానని ఆ చిన్నారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆ మొబైల్ తీసుకొని పలు ప్రశ్నలతో యాప్ పరీక్షించిన అష్లే యాప్ తీరుపై పోలీసులతో పాటు ఆపిల్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆపిల్ కంపెనీ థర్డ్‌పార్టీ యాప్ అయిన సాంటాపై ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియరాలేదు.
ఇదిలా ఉంటే ఆ మధ్య అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఇలానే బూతులు తిడుతోందని అమెజాన్‌కు ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. 29 ఏళ్ల మైఖేల్ స్లడే ఎప్పటిలాగే ఇంటికొచ్చి అలెక్సాని ఆన్ చేసి ఏదైనా మంచి సంగీతం వినిపించమని అడిగాడు. అయితే అది సంగీతం వినిపించడానికి బదులు బూతులు తిట్టడం మొదలెట్టింది. ఎప్పుడడిగినా పాటలు వినిపించే ఈ వర్చువల్ అసిస్టెంట్... ఉన్నట్టుండి బూతులందుకోవడంతో మైఖేల్ షాక్ తిన్నాడు. ఏం జరిగిందో తెలియక కంగారు పడ్డాడు.

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రద్దు
అయితే అంతకు ముందురోజే మైఖేల్ తన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం రద్దు చేసుకున్నాడు. దాని విషయమై కస్టమర్ కేర్‌కు చెందిన వ్యక్తితో మాట్లాడాడు. సభ్యత్వం రద్దు చేసుకున్నప్పటి నుంచి అలెక్సా ఇలా వింతగా ప్రవర్తించడంతో దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉందేమోనని అనుమానించాడు. అమెజాన్‌ను సంప్రదిస్తే అలాంటిదేమీ లేదన్నారు. అలెక్సా ఎందుకలా అనుచిత పదాలు వాడుతోందో తమకూ అర్థం కావడం లేదన్నారు. అలెక్సా ఖాతా వివరాలు ఇస్తే ఏం జరిగిందో పరిశీలించి చెబుతామని చెప్పారు.

పొరపాటుకు పరిహారం
జరిగిన పొరపాటుకు పరిహారంగా అమెజాన్ మైఖేల్‌కు 5 పౌండ్ల నగదు, ఏడాది అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితంగా ఇచ్చింది.‘ఇంటికొచ్చాకా రోజూలాగే అలెక్సాను ఏదైనా సంగీతం వినిపించమని అడిగాను. ‘తప్పకుండా. మీ పాటల జాబితా ఇది......(అని ఓ బూతు పదం వాడింది). తర్వాత క్షమించండి ఏదో పొరపాటు జరిగింది' అని అలెక్సా చెప్పే సరికి షాక్ తిన్నా. అలెక్సా అలా మాట్లాడటం నమ్మలేకపోయానని సౌత్‌వేల్స్‌కు చెందిన మైఖేల్ అన్నాడు. అమెజాన్ సాంకేతిక నిపుణులు కూడా ఇలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోయారని తెలిపాడు.


Click it and Unblock the Notifications








