క్యూరియాసిటీ రోవర్ చక్రాలను చూస్తారా...

Posted By:

ఈ ఫోటోగ్యాలరీలో మీరు చూస్తున్న చక్రాలు అరుణ గ్రహం పై అడుగుపెట్టిన క్యూరియాసిటీ రోవర్ వి.   ఈ చిత్రాలను రోవర్ లోని మార్స్ హ్యాండ్ లెన్స్ ఇమేజర్ (మహ్లీ)కెమెరా చిత్రీకరించింది. సోమవారం వీటిని నాసా విడుదల చేసింది. అంగారకుడి పై విజయవంతంగా అడుగపెట్టిన క్యూరియాసిటీ రోవర్ తన పరిసర ప్రాంతాలకు సంబంధించిన అనేక ఫోటోలను నాసా (NASA)కు పంపింది. కారు పరిమాణంలో ఉండే ఈ సాంకేతిక యంత్రం తాజాగా తనకు ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని తన కెమెరాలలో బంధించింది.

ఈ ప్రాంతానికి సంబంధించి తన శక్తివంతమైన కెమెరాలతో క్యూరియాసిటీ రోవర్ పంపిన 130 చిత్రాలు పర్వాతాలు, పొగ మంచుతో కూడికుని ఉన్న పర్యావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ ప్రాంతం అమెరికాలోని మొజావే ఎడారిని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.అంగారకుడి పై అన్వేషణ సాగించే క్రమంలో అక్కడ అడుగుపెట్టిన క్యూరియాసిటీ రోవర్ మరో ఘనతను  సాధించింది.

తొలిసారిగా భూమి నుంచి రికార్డు చేసి పంపిన మానవ స్వరాన్ని అందుకొని తిరిగి మళ్లీ భూమికి పంపింది. అలాగే మౌంటేన్ షార్ప్ పర్వతానికి సంబంధించిన తొలి సవివర రంగుల ఫోటోలను నాసాకు పంపింది. తనలో అమర్చిన మాస్ట్ కెమెరా (100మిల్లీ మీటర్ల టెలిఫోటో లెన్స్, 34 మిల్లీ మీటర్ల వైగ్ యాంగిల్ లెన్స్)  సాయంతో  అంగారకుని ఉపరితలం పై ఉన్న ఎగుడుదిగుడు ప్రాంతాలతో పాటు  షార్ప్ పర్వత దిగువనున్న లోయ భాగాలను ‘రోవర్’ చిత్రీకరించింది. అయితే ఆ పర్వతం వద్దకు రోవర్ చేరడానికి  ఏడాది సమయం పడుతుందని  శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot