Home
News

1లక్ష రూపాయల Sony టీవీ ఆర్డర్ చేస్తే! తక్కువ విలువైన థామ్సన్ టీవీ వచ్చింది!

By Maheswara

ప్రముఖ ఆన్ లైన్ రిటైలర్లు అయినా ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లు పండగ ఆఫర్లతో సేల్ లు కొనసాగిస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ ఆఫర్లతో చాలా మంది వినియోగదారులు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అందరి లాగే ఇటీవల ఓ వ్యక్తి ఫ్లిప్కార్ట్ సేల్ లో సోనీ టీవీని ఆర్డర్ చేసి మోసానికి బలయ్యాడు.ఇంతకు ఏమి జరిగింది? వివరాలు తెలుసుకోండి.

ఈ వినియోగదారుడు Flipkart నుండి 1 లక్ష రూపాయలు విలువైన సోనీ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసాడు, కానీ దానికి బదులుగా మరొక బ్రాండ్ నుండి తక్కువ ధర కలిగిన టీవీ ని డెలివరీ పొందాడు. ట్విట్టర్ 'X' వినియోగదారు @thetrueindian తన కథనాన్ని పంచుకోవడంతో ఈ సంఘటన వైరల్ అయింది. సంస్థ యొక్క ఇన్‌స్టాలేషన్ వర్కర్ తన వద్దకు వచ్చే వరకు మోసం గురించి తనకు తెలియదని వెల్లడించాడు.

Customer Ordered Sony Smart Tv Worth Of Rs.1Lakh From Flipkart And Received Thomson Tv In Sony Box. Details

ఇన్‌స్టాలేషన్ వర్కర్ బాక్స్‌ను తెరిచాడు, బయట సోనీ టీవీ బాక్స్‌లో థామ్సన్ టీవీని చూసి షాక్ కు గురయ్యారు. ఈ సుదీర్ఘమైన థ్రెడ్‌లో, వినియోగదారుడు మొత్తం పరీక్షను వివరించాడు, పరిస్థితికి స్పందించమని ఫ్లిప్‌కార్ట్‌ను కోరాడు.

వినియోగదారుడు ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ తో ప్రారంభమైంది, ఈ పోస్ట్ లో అతను ఇలా పేర్కొన్నాడు. "నేను అక్టోబర్‌ 7న @Flipkart నుండి Sony టీవీని కొనుగోలు చేసాను, 10వ తేదీన డెలివరీ చేసారు మరియు సోనీ ఇన్‌స్టాలేషన్ వ్యక్తి 11వ తేదీన వచ్చారు, అతను స్వయంగా టీవీని అన్‌బాక్స్ చేసాడు. లోపల చూసి మేము షాక్ కు గురయ్యాము. లోపల స్టాండ్, రిమోట్ వంటి ఉపకరణాలు ఏమీ లేకుండా సోనీ బాక్స్ లోపల థామ్సన్ టీవీని డెలివరీ చేసారు.

ఈ సంఘటనను ఫ్లిప్కార్ట్ కు ఫొటోలతో సహా ఫిర్యాదు చేసాడు. వినియోగదారుడు తన నిరాశను వ్యక్తం చేస్తూ, "ఫ్లిప్కార్ట్ వారు నా రిటర్న్ అభ్యర్థనను ఇంకా ప్రాసెస్ చేయలేదు. ముందుగా వారు నాకు 24వ అక్టోబరు రిజల్యూషన్ తేదీని ఇచ్చారు కానీ 20వ తేదీన వారు దానిని పరిష్కరించినట్లు చూపారు, కానీ తర్వాత ఈ తేదీని నవంబర్ 1వ తేదీకి పొడిగించారు. ఈరోజు కి కూడా వారు (సమస్య పరిష్కరించబడినట్లు) నాకు చూపుతున్నారు కానీ నా రిటర్న్ అభ్యర్థన కూడా ప్రాసెస్ చేయబడలేదు." అని పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ త్వరగా వైరల్ అయ్యింది, ప్రజల నుండి స్పందన వచ్చింది. అతను 'ఓపెన్ బాక్స్ డెలివరీ'ని ఎందుకు ఎంచుకోలేదని చాలా మంది ప్రశ్నించగా, "ఇది Delhivery ద్వారా డెలివరీ చేయబడిందని, ఓపెన్ బాక్స్ డెలివరీ అందించబడలేదు" అని వినియోగదారు స్పష్టం చేశారు. అతను అమ్మకదారు యొక్క పేరు కూడా ప్రకటించాడు.

ట్విట్టర్ లో ఈ వైరల్ పోస్ట్‌కు ప్రతిస్పందనగా, ఫ్లిప్‌కార్ట్ క్షమాపణలు చెప్పింది, "రిటర్న్ రిక్వెస్ట్‌తో మీ అనుభవానికి మా క్షమాపణలు. మేము మీ కోసం దీన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాము. దయచేసి మీ ఆర్డర్ వివరాలతో మాకు DMని పంపండి, తద్వారా అవి ఇక్కడ గోప్యంగా ఉంటాయి అని ప్రకటించారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Customer Ordered Sony Smart Tv Worth Of Rs.1Lakh From Flipkart And Received Thomson Tv In Sony Box. Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X