కొత్త జాబ్స్ వెతకడంలో బిజి అయిన విప్రో బిజినెస్ హెడ్స్

Posted By: Super

కొత్త జాబ్స్ వెతకడంలో బిజి అయిన విప్రో బిజినెస్ హెడ్స్

బెంగళూరు: విప్రో ప్రస్తుతం సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌తో సతమతమవుతుంది. పోయిన క్వార్టర్‌‌లోనే సిఈవోని మార్చినటువంటి విప్రో కంపెనీలో ఇప్పుడు దాదాపు 15 నుండి 20 సంవత్సరాల ఎక్సీపీరియన్స్ కలిగినటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ విప్రోని వదిలిపోవడానికి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రిక్యూట్‌మెంట్ ఏజన్సీస్ వద్ద డజన్ల కొద్ది విప్రో కంపెనీకి చెందినటువంటి బిజినెస్ హెడ్స్ రెజ్యుమోలు కొత్త జాబ్స్ కోసం వెతుకడంలో బిజిగా ఉన్నాయని వెల్లడైంది.

పోయిన నెలలో నగరంలోని ఓ రిక్యూట్‌మెంట్ ఫార్మ్ 8 నుండి 10 సంవత్సరాలు ఎక్సీపిరియన్స్ కలిగినటువంటి విప్రో ఎంప్లాయిస్ యొక్క జాబ్ అప్లికేషన్స్ దాదాపు 52 వరకు తన వద్దకు వచ్చాయని వెల్లడించారు. ఇంకొక రిక్యూట్‌మెంట్ ఫార్మ్‌కి కూడా సేమ్ ఇదే విధంగా 8 నుండి 15 సంవత్సరాల ఎక్సీపీరియన్స్ కలిగినటువంటి ఎంప్లాయిస్ జాబ్ అప్లికేషన్స్ 18 వరకు వచ్చాయని వెల్లడించారు. దీంతో పాటు విప్రో సీనియర్ ప్రోపెషనల్స్ వద్దనుండి ఆరు కాల్స్ కూడా వచ్చాయని రిక్యూట్‌మెంట్ ఫార్మ్ వారు వెల్లడించారు.

గత కొన్ని వారాలుగా చూసుకున్నట్లైతే దాదాపు నలబై మంది వరకు వర్టికల్/బిజినెస్ యూనిట్ హెడ్స్, జనరల్ మేనేజర్ లాంటి వారు కంపెనీ నుండి బయటకు వెళ్శారని సమాచారం. దాదాపు వంద కంపెనీల నుండి ఐదు వందల మందిదాగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయస్ బయటకు వెళ్శి వేరే ఉద్యోగాలు చూసుకున్నట్లు సాప్ట్‌వేర్ పార్మ్‌లు వెల్లడించాయి. ఈ విషయంలో విప్రో కంపెనీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్‌ని కలవగా ఇదంతా నిజమేనని విన్నవించారు.

దీంతో విప్రో కొత్త సిఈవో టికె కురియన్ కలగజేసుకోని కంపెనీలో ఉన్నటువంటి డెలివరీ హెడ్స్, వర్టికల్ హెడ్స్, బిజినెస్ హెడ్స్ అందరితో ఇంటర్నల్ రివ్యూలు నిర్వహించి వారి యొక్క రోల్స్ , ఫెర్పామెన్స్ గురించి తెలుసుకున్నారు.‌ దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే కంపెనీ ప్రస్తుతం పెర్పామెన్స్ ఒత్తిడిలో ఉందని తెలిసిపోతుంది. దీంతో విప్రో కొత్తగా డైరెక్ట్ మెయిల్ కమ్యూనికేషన్ లింక్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా సిఈవో కురియన్‌కి ఎంప్లాయిస్‌కి మద్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుందని ఇలా చేశామన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot