శ్యానోజెన్‌ శకం ముగిసింది!

ప్రముఖ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం శ్యానోజెన్‌ అధికారికంగా మూతబడబోతోంది. డిసెంబర్ 31, 2016 నుంచి శ్యానోజెన్‌ షట్‌డౌన్ కాబోతున్నట్లు ఓ బ్లాగ్ స్పాట్‌లో శ్యానోజెన్ అధికారికంగా అనౌన్స్ చేసింది. శ్యానోజెన్ సర్వీసులు షట్‌డౌన్ అయినప్పటికి ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అలానే సోర్స్ కోడ్ డెవలపర్స్‌కు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

శ్యానోజెన్‌ శకం ముగిసింది!

డిసెంబర్ 2014లో లాంచ్ అయిన OnePlus One స్మార్ట్‌ఫోన్‌తో శ్యానోజెన్ మోడ్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఆ తరువాత మైక్రోమాక్స్ సబ్సిడరీ బ్రాండ్ అయిన Micromax Yuతో డీల్ కుదుర్చుకుంది. యూజర్లు స్టాక్ ఆండ్రాయిడ్ కే ఎక్కువ ప్రధాన్యత ఇవ్వటం వల్ల తాము ఆదరన కోల్పోయామని శ్యానోజెన్‌ చెబుతోంది. శ్యానోజెన్‌ మోడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం

శ్యానోజెన్‌మోడ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం. ఆండ్రాయిడ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపకల్పన కాబడిన ఈ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం స్మార్ట్‌ఫోన్‌లు అలానే టాబ్లెట్ పీసీలను సపోర్ట్ చేస్తుంది. గూగుల్ విడుదల చేసే అధికారిక ఆండ్రాయిడ్ రిలీజ్‌లు ఆధారంగా ఈ ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ అభివృద్థి చెందుతుంది. 5 మిలియన్ల యూజర్ బేస్‌తో శ్యానోజెన్‌మోడ్ ఆండ్రాయిడ్ కమ్యూనిటీలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పనితీరును మరింతగా పెంచుతుంది

శ్యానోజెన్‌మోడ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల పనితీరును మరింతగా పెంచుతుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు శ్యానోజెన్‌మోడ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా వేగవంతమైన పనితీరును ఆస్వాదిస్తారు.

కస్టమేజేషన్ ఆప్షన్

కస్టమేజేషన్ ఆప్షన్ శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలో కీలక పాత్ర పోషిస్తోంది. కస్టమేజేషన్ ఆప్షన్‌లకు సంబంధించి శ్యానోజెన్‌మోడ్ ఆండ్రాయిడ్ యూజర్లను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుంది.

అనేక సరికొత్త ఫీచర్లు

రోజువారి కార్యకలాపాలకు ఉపయోగపడే అనేక సరికొత్త ఫీచర్లను శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంది.లాక్‌స్ర్కీన్ షార్ట్ కట్స్, క్విక్ టాగిల్స్, అడ్వాన్సుడ్ పవర్ మెనూ, ర్యామ్ బార్, రీసెంట్ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్, క్విక్‌ లాంచ్ షార్ట్‌కట్స్ వంటి సదుపాయాలు ఆకట్టుకుంటాయి.

చిన్నచిన్న సర్దుబాట్లను చేసుకోవచ్చు

శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలో మీకు అనుగుణంగా చిన్నచిన్న సర్దుబాట్లను చేసుకోవచ్చు. శ్యానోజెన్ మోడ్ ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్‌డేట్‌లను యూజర్లకు చేరువ చేస్తుంది. శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఓఎస్ అనేక ఇన్‌బుల్ట్ అప్లికేషన్‌లతో లభ్యమవుతోంది. ఉన్నతమైన ఆండ్రాయిడ్ అనుభూతులను శ్యానోజెన్ చేరువచేస్తుంది.

అత్యుత్తమ కమ్యూనిటీ

శ్యానోజెన్‌మోడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టంలో తలెత్తే సమస్యలను నిపుణులు బృందం గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తుంది. శ్యానోజెన్ మోడ్ అత్యుత్తమ కమ్యూనిటీని కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cyanogen OS, services to shut down by December 31. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot