ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.. అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే..!
మీరు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారా.. మీ ఫోన్‌లో ఈ యాప్‌లు ఉన్నాయా.. అయితే మీరు డేంజర్‌జోన్‌లో ఉన్నట్టే. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులనే టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు కొన్ని యాప్‌ల ద్వారా మొబైల్ నుంచి సున్నితమైన డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం. మీ ఫోన్‌లోనూ ఇటువంటి యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి.
సైబర్ నేరస్థులు స్మార్ట్‌ఫోన్ డేటాను యాక్సెస్ చేసుకోనేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్లు MalwareFox నివేదిక స్పష్టం చేస్తోంది. గూగుల్ ప్లేస్టోర్‌లోని ప్రమాదకర యాప్‌లను వినియోగించి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రాం కావడంతో.. మాల్‌వేర్ ప్రోగ్రాం అయిన ట్రోజన్, యాడ్వేర్, స్పైవేర్, కీలాగ్గర్ లాంటివి వినియోగించి వారి యాజర్ల డేటాను యాక్సెస్ చేసేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌లకు కొన్ని హానికరమైన కోడింగ్ చేసి, కొత్త వెర్షన్, కొత్త పేర్లతో ప్రవేశపెడుతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి యాప్‌లు మన ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఉండే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోవాలంటే ఈ క్రింది 19 యాప్‌లను తొలగించాల్సి ఉంటుంది.
హార్లీ ట్రోజన్ కలిగి ఉన్న యాప్‌లు : ఫ్రీ గేమ్‌హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్సర్ రికార్డ్, సేమ్ లాంచర్ అండ్ లైవ్ వాల్‌పేపర్, అమెజింగ్ వాల్‌పేపర్, కూల్ ఎమోజీ అండ్ స్టిక్కర్.
జోకర్ స్పైవేర్ కలిగి ఉన్న యాప్‌లు : సింపిల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసెంజర్, ప్రీమియం SMS, బ్లడ్ ప్రెజర్ చెక్కర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కూలర్ మెసేజ్.
Autolycos మాల్వేర్ కలిగి ఉన్న యాప్‌లు : వ్లాగ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటివ్ 3D లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, Gif ఎమోజీ కీబోర్డ్, ఇన్‌స్టంట్ హార్ట్‌రేట్ ఎనీటైం, డెలికేట్ మెసేంజర్.
పైన పేర్కొన్న 19 యాప్‌లు మీ ఫోన్‌లో ఉంటే వెంటనే తొలగించడం వల్ల సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కకుండా ఉంటారు. దాంతోపాటు ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసినప్పుడు, దానికి సంబంధించిన సంబందించిన కామెంట్స్‌ను చదివినా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మరియు స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ మరియు యాంటీ మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
దాంతోపాటు ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాలనుకున్నప్పుడు ఓసారి రేటింగ్‌ను చూడడం కూడా మంచిది. మరియు థర్డ్ పార్టీ యాప్‌లు కాకుండా నేరుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నప్పుడు డెవలపర్ ఎవరో చెక్ చేయడం వల్ల మాల్‌వేర్ బారిన పడకుండా ఉంటాం.
యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అనవసరమైన పర్మిషన్లు అడుగుతోందంటే., ఉదాహరణకు ఏదైనా ఫోటో ఎడిటింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే దానికి సంబందించిన పర్మిషన్లే కాకుండా ఫోన్, SMS పరిషన్లు కూడా అడుగుతోందంటే ఆ యాప్‌పై కొంచెం అనుమానం వ్యక్తం చేయాల్సిందే. మరోసారి ఆ యాప్ వివరాలు చెక్ చేసుకోవడం మంచిది. వీటితో పాటు ఫోన్‌కు వచ్చినా ప్రతి లింక్‌ను ఓపెన్ చేయకపోవడం వల్ల సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉంటాం.


Click it and Unblock the Notifications








