Home
News

యూట్యూబ్‌ లైక్‌ కొడితే చాలన్నారు.. ఏకంగా రూ.77 లక్షలు దోచుకున్నారు!

సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌ జాబ్స్‌, పార్ట్‌టైం జాబ్స్‌ పేరుతో అనేక మందిని మోసం చేస్తున్నారు. ఫలితంగా లక్షల్లో డబ్బును కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ 56 ఏళ్ల వ్యక్తి ఏకంగా 77 లక్షల రూపాయలను కోల్పోయాడు.

యూట్యూబ్‌ లైక్‌ల ద్వారా నగదు సంపాదించవచ్చు అని చెప్పి సైబర్ నేరగాళ్లు సదరు వ్యక్తిని మోసం చేశారు. నాగ్‌పూర్‌కు ( Nagpur cyber crime) చెందిన రాజు అనే వ్యక్తిని టెలిగ్రాం ద్వారా తొలుత సంప్రదించారు. తన వద్ద ఒక ఉద్యోగ అవకాశం ఉందని, సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించారు. నచ్చిన యూట్యూ్బ్‌ ఛానల్‌ స్క్రీన్‌ షాట్‌లు పంపాలని కోరారు.

man loses RS77 lakh in online scam

అయితే ప్రారంభంలో అంతా మంచిగానే అనిపించింది. తనకు ఎటువంటి ఇబ్బంది రాదని భావించారు. తొలుత తాను చేసిన పనికి డబ్బులు కూడా వస్తుండడంతో సైబర్‌ నేరగాళ్లపై ( online scam in nagpur) ఎటువంటి అనుమానం రాలేదు. దాంతో తన బ్యాంకు ఖాతా వివరాలను వారితో పంచుకున్నాడు.

దాంతో సైబర్ నేరగాళ్లు ఇదే అదనుగా భావించి, రాజు బ్యాంక్ ఖాతా నుంచి అనధికార లావాదేవీలు నిర్వహించారు. దీంతో రాజు ఖాతా నుంచి భారీగా డబ్బును కొల్లగొట్టారు. ఏకంగా రూ.77 లక్షల రూపాయలు దోచుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు, ఓ బుకీని అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో మరో కోణం బయటపడింది.

ఇటీవల జరిగిన భారత్‌ పాక్‌ ప్రపంచ కప్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ పాల్పడినట్లు సదరు బుకీ అంగీకరించాడు.
పార్ట్‌ టైం ఉద్యోగాలు, సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ వచ్చిన ఆఫర్ల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. వారు ఎంత మభ్యపెట్టినా, మరియు ఎంత ఆశపెట్టినా.. ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోకూడదు. అపరిచిత వ్యక్తులతో సున్నితమైన సమాచారం పంచుకోకూడదు.

ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లను అరెస్ట్‌ చేసేందుకు మరియు న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఇలాంటి ఘటనలు సైబర్‌ నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆశచూపి సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నారు. దీంతో అమాయకులు బలైపోతున్నారు. లక్షల్లో నగదు పోగొట్టుకున్నాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కేసుల్లో నగదు రికవరీ అవుతున్న సందర్భాలు ఉన్నా.. మరికొన్ని ఘటనల్లో నగదు కోసం బాధితులు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Cyber crime man loses RS77 lakh after he shared screenshots of youtube
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X