Home
News

ఆన్‌లైన్‌ క్లాస్‌ కోసం వాట్సాప్‌ గ్రూప్‌లో చేరి రూ.64 లక్షలు కోల్పోయాడు.. అసలు ఏం జరిగిందో తెలుసా?

టెక్నాలజీ అభివృద్ధి సైబర్‌ నేరగాళ్లకు (Cyber Crime) వరంలా మారింది. అమాయకులకు వల వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకు ఖాతాలను ఖాళీచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన మరోకటి వెలుగులోకి వచ్చింది.

వాట్సాప్‌ గ్రూప్‌లో చేరిన ఓ యువకుడు ఏకంగా రూ.64 లక్షల కోల్పోయాడు. ఓ యువకుడు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం కొందరి సలహా మేరకు స్టాక్‌ ఎక్స్చేంజీ అనే పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. అయితే అదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు అతన్ని టార్గెట్‌ చేశారు. ఫలితంగా భారీగా మోసపోయాడు.

man lost RS 64 lakh in whatsapp fake trading scam

స్టాక్‌ ఎక్స్చేంజ్‌ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేరి.. : పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. గుర్తుతెలియని ఓ వ్యక్తి సలహాతో బాధితుడు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ అనే పేరున్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేరాడు. తక్కువ పెట్టుబడులతో స్వల్ప కాలంలోనే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని అతన్ని కొంతమంది నమ్మించారు.

ఇవన్నీ నమ్మిన బాధితుడు.. సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగా వివిధ సందర్భాల్లో అనేక బ్యాంకులు సహా పేమెంట్‌ యాప్‌ల ద్వారా ఏకంగా రూ.64 లక్షలను డిపాజిట్‌ చేశాడు. అయితే ఎంత ఎదురుచూసిన అతని పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. దీంతో మోసపోయానని గుర్తించి స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుపై ముమ్మర దర్యా్ప్తు చేపట్టిన పోలీసులు ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

man lost RS 64 lakh in whatsapp fake trading scam

అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. తీరు మారడం లేదు : సైబర్‌ నేరాలపై పోలీసులు ఇతర శాఖల అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చనే ఆశతో ఉన్నదంతా కోల్పోతున్నారు. చివరికి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

వారి వివరాలు తెలుసుకోవాలి : తెలియని ఆన్‌లైన్‌ గ్రూపుల్లో చేరవద్దని, ప్రత్యేకించి ఇలాంటి పెట్టుబడులు పెట్టాలని సూచించే వ్యక్తుల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతోపాటు వ్యక్తిగత పరిచయం లేకుండా ఎవరికి నేరుగా లేదా మెసేజ్‌, కాల్స్‌ ద్వారా బ్యాంకింగ్‌ సంబంధిత వివరాలను షేర్‌ చేయవచ్చని సూచిస్తున్నారు.

దీంతోపాటు వాట్సాప్‌ లేదా ఇతర మెసేజింగ్‌ ప్లాట్‌ఫాంలు, గుర్తుతెలియని ఈమెయిల్‌ ద్వారా వచ్చిన లింక్‌లను క్లిక్‌ చేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి లింక్‌లను క్లిక్‌ చేయడం ద్వారా మీ డిజిటల్‌ పరికరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు లేదా కార్యకలాపాలను గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
man lost RS 64 lakh after joined in stock exchange named WhatsApp group
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X