Home
News

మీ బ్యాంకు అకౌంట్‌కు పొరపాటున నగదు బదిలీ అయిందని ఫోన్‌ చేస్తారు.. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళీ?

భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో దూసుకెళ్తోంది. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు కూడా డిజిటల్ లావాదేవీలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ UPI పేమెంట్‌ యాప్‌లు అందుబాటులోకి రావడం సహా అన్ని స్థాయిలో డిజిటల్ లావాదేవీలను స్వీకరించడం కూడా ఇందుకు కారణం. అయితే UPI యాప్‌లను ఉపయోగించి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త నంబర్‌ల నుంచి మీ బ్యాంకు ఖాతాలకు నగదు జమ అయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచనలు చేశారు. మోసాల తీరును కూడా పోలీసులు వివరించారు. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా.. మీ బ్యాంకు అకౌంట్‌ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ఇప్పటికే కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడున్న నేరగాళ్లు.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకొని అమాయకులను టార్గెట్‌ చేస్తున్నారు.

Cyber Crime police advises UPI Users on New Types of scams

గూగుల్‌ పే తరహా ప్రముఖ యూపీఐ యాప్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. వేరే నంబర్‌కు నగదు బదిలీ పంపాల్సి ఉండగా.. పొరపాటున మీకు వచ్చిందని.. తమకు తిరిగి పంపాలని నేరగాళ్లు కోరుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎటువంటి ధ్రువీకరణ లేకుండా వారు చెప్పిన విధంగా నగదు బదిలీ చేయవద్దని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.

మీ బ్యాంకు ఖాతాకు పొరపాటున నగదు బదిలీ చేశామని.. తాము పంపిన లింక్‌ లేదా తాము చెప్పిన విధంగా నగదు తిరిగి పంపాలని ఎవరైనా కాల్‌ చేస్తే అప్రమత్తం కావాలి. వారు పంపిన లింక్‌ పైన క్లిక్‌ చేస్తే కొన్నిసార్లు మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. వారు పంపిన లింక్‌ ద్వారా మీ బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేసి నగదును దోచుకొనే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ తరహా ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుంటే మీ వ్యక్తిగత వివరాలు, నగదును కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అనుమానం కలిగినా సైబర్‌ క్రైం విభాగాలకు సమాచారం అందించాలని మరియు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

గతంలోనూ ఈ తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయి. పొరపాటున మీ ఖాతాలో డబ్బులు వేశామని, వెంటనే తమ ఖాతాకు తిరిగి పంపాలను కోరతారు. తాము హాస్పిటల్‌ వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని వెంటనే డబ్బులు తాము చెప్పిన బ్యాంకు అకౌంట్‌కు పంపాలని సూచిస్తారు. అదంతా నిజమని నమ్మి నగదు బదిలీ చేస్తే.. నేరగాళ్లకు మీ బ్యాంకు ఖాతా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.

అయితే గతంలో కాస్త భిన్నంగా సైబర్‌ నేరగాలు మోసాలకు పాల్పడ్డారు. బెంగళూరులో గతంలో ఏం జరిగిందంటే..?
గతంలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ ఈ తరహా మోసాల పట్లు ట్వీట్‌ చేశారు. ఆమె పోస్టు ఆధారంగా.. ఓ రోజు ఆఫీస్‌లో ఉన్న సమయంలో ఓ ఫోన్‌ వచ్చింది. మీ నాన్నకు నగదు పంపాల్సి ఉందని చెప్పారు. మీ నంబర్‌కు పంపుతుననట్లు తెలిపారు.

కాల్‌ మాట్లాడుతున్న సమయంలోనే తమ ఖాతాకు నగదు జమ అయినట్లు బ్యాంకు వారు పంపిన ఫార్మాట్‌లో మెసెజ్‌ వచ్చింది. అయితే కాల్‌లో మాట్లాడుతున్న వ్యక్తి.. మీ నాన్నకు రూ.3000 మాత్రమే ఇవ్వాల్సి ఉందని.. పొరపాటున రూ.30000 పంపించామని చెప్పారు. వెంటనే తిరిగి పంపాలని కోరారు. తాను డాక్టర్‌ వద్ద ఉన్నానని తన డబ్బు వెంటనే తిరిగి పంపాలంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అప్పుడే తనకు ఇదంతా స్కామ్‌ అని అర్థమైనట్లు చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Cyber Crime police advises UPI Users on New Types of scams here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X