Home
News

సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన నేవీ మాజీ అధికారి.. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ చూస్తే గాని తెలియలేదు..!

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. ప్రజలను మభ్యపెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులు సహా ఉన్నత స్థానాల్లో పనిచేసిన వ్యక్తులు కూడా మోసగాళ్ల వలకు చిక్కుతున్నారు. రోజురోజుకు కొత్త మార్గాల్లో ప్రజలను టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో లక్షల రూపాయలకు కోల్పోతున్నారు.

ఏకంగా రూ.2.37 లక్షలు కాజేత : పార్ట్‌టైం ఉద్యోగాలు, గిఫ్ట్‌ వోచర్లు, యూట్యూబ్‌ రేటింగ్‌ల పేరిట ఇప్పటి వరకు మోసం చేసిన సైబర్‌ కేటుగాళ్లు.. తాజాగా కొత్త మార్గం ఎంచుకున్నారు. బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని రిటైర్డ్‌ నేవి అధికారిని మోసం చేశారు. సుమారు రూ.2.37 లక్షలు కొల్లగొట్టారు.

cyber crime Retired Navy officer loses rs2.37 lakh

ముంబైకు చెందిన కల్నల్‌ స్థాయి రిటైర్డ్‌ నేవీ అధికారికి సెప్టెంబర్‌ 8న ఓ ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్ కాల్‌లో తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు.. బ్యాంకు లాకర్‌ ఫీజు చెల్లించాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. ఫీజు కింద రూ.6,600 చెల్లించాలని కోరినట్లు తెలిసింది.

అయితే ఆ ఫోన్‌ కాల్‌ వచ్చిన కొన్నిరోజుల తర్వాత రిటైర్డ్ నేవీ అధికారి తన బ్యాంక్‌ స్టేట్‌మెంట్ తనిఖీ చేశారు. అయితే ఆ స్టేట్‌మెంట్‌ చూసి ఒక్కసారిగా షాక్‌గు గురైనట్లు తెలిసింది. సెప్టెంబర్ 8 నుంచి 15 మధ్య కాలంలో తన బ్యాంకు ఖాతా నుంచి 13సార్లు నగదు విత్‌డ్రా చేయబడినట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

రిటైర్డ్‌ నేవి అధికారి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నగదు ఎలా బదిలీ అయిందనే దానిపై స్పష్టత రాలేదు. సైబర్‌ నేరస్తులు ఫోన్ చేసిన సమయంలో సదరు మాజీ అధికారి వారు అడిగిన సున్నితమైన సమాచారం వారికి చేరవేసి ఉండవచ్చు. ఈ సమాచారంతో నేరగాళ్లు సదరు మాజీ నేవీ అధికారి ఖాతా నుంచి నగదు కొల్లగొట్టి ఉండవచ్చు.

సెప్టెంబర్‌ 8న రూ.25,000 చొప్పున రెండు లావాదేవీలు, సెప్టెంబర్ 11న రూ.25వేల చొప్పున మూడుసార్లు, రూ.22వేల చొప్పున ఒకసారి నగదును అక్రమంగా విత్‌డ్రా చేశారు. అనంతరం సెప్టెంబర్‌ 13న రూ.75000, 15వ తేదీన మరో రూ.25000 నగదును తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఇలా మొత్తం రూ.2.37 లక్షల చోరీ చేశారు. అయితే ఈ నగదు విత్‌డ్రా సమయంలో నేవి మాజీ అధికారి ఫోన్‌ నంబర్‌కు ఎటువంటి మెసెజ్ రాలేదని తెలుస్తోంది.

అపరిచితుల నుంచే వచ్చే కాల్స్‌పై ఎప్పుడు స్పందించవచ్చు. బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు పిన్‌ సహా ఇతర ఎటువంటి సున్నితమైన, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. బ్యాంకు సిబ్బంది అటువంటి వివరాలు కావాలని ఎప్పుడు ప్రశ్నించరని తెలుసుకోండి. అవసరం అనుకుంటే బ్యాంక్‌కు వెళ్లి సమాచారం కనుక్కోండి.

అలాగే మీ మెయిల్‌, ఫోన్‌లకు వచ్చిన లింక్ క్లిక్‌ చేయవచ్చు. ఎవరైన మిమ్మల్ని అలా చేయమని కోరినా.. వెంటనే తిరస్కరించండి. అవసరం అయితే బ్యాంకు లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి. అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ వచ్చే కాల్స్‌, మెసేజ్‌లపైనా అప్రమత్తంగా ఉండండి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
cyber crime Retired Navy officer loses rs2.37 lakh in online fraud
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X