సైబర్ క్రైమ్ నుంచి రక్షించే ఇన్సూరెన్స్ పాలసీలు ఇవే..!

|

సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతికతను ఆధారంగా చేసుకుని దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సైబర్ నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 డిసెంబర్ లెక్కల ప్రకారం 12,187 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2015లో ఈ లెక్క 11,331 మాత్రమే. అంటే ఏడాదిలో 6.3 శాతం నేరాలు పెరిగాయి. రోజూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతూనే ఉంటారు. అయితే ఇలాంటి సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అయితే నష్టపోకుండా ఉండేందుకు కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు వచ్చాయి. ఒకటి హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో నుంచి ఇ@సెక్యూర్ కాగా, మరొకటి బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి సైబర్ సేఫ్.

 

రిలయన్స్ జియో దీపావళి ధమాకా :100% క్యాష్ బ్యాక్,ఫ్రీ JioFi

సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటీ?

సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటీ?

సైబర్ దాడి ఎవరిపైనైనా జరగొచ్చు. ఎప్పుడైనా జరగొచ్చు. ఎవరూ మినహాయింపు కాదు. ఇలాంటి సైబర్ దాడుల నుంచి కాపాడేదే సైబర్ ఇన్సూరెన్స్. మీ ముఖ్యమైన డేటాను కాపాడుకోవడమే కాకుండా, దానివల్ల జరిగే నష్టాలను సైబర్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

సైబర్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు?

సైబర్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవచ్చు?

సైబర్ ఇన్సూరెన్స్ ఎవరైనా తీసుకోవచ్చు. అయితే మీ పాలసీ కవరేజ్ ఎంత అన్నది మీ దగ్గరున్న డేటా, దాని ప్రాముఖ్యతను బట్టి మీరే నిర్ణయించుకోవాలి. బీమా కంపెనీ కస్టమర్ గత చరిత్రను, ఆన్‌లైన్ హిస్టరీని చూస్తుంది. గతంలో మీరు చేసిన తప్పిదాల వల్ల డేటా కోల్పోతే ఇన్సూరెన్స్‌లో కవర్ కాదు. అందుకే పాలసీ ఇచ్చే ముందే చెక్‌లిస్ట్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ.

సైబర్ ఇన్సూరెన్స్‌లో  కవర్ అయ్యేవి ఏంటి?
 

సైబర్ ఇన్సూరెన్స్‌లో కవర్ అయ్యేవి ఏంటి?

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఇ@సెక్యూర్ పాలసీలో పాలసీదారుడి బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డులపై అనధికార లావాదేవీలు కవర్ అవుతాయి. అంతేకాదు పాలసీదారుడి కీలకమైన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో బహిర్గతపర్చి ప్రతిష్టకు భంగం కలిగించినా ఇన్సూరెన్స్ లభిస్తుంది. అంతే కాదు కోర్టు ఖర్చుల్నీ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. బజాజ్ అలియాంజ్ ఇన్డివిజ్యువల్ సైబర్ సేఫ్ పాలసీలో సోషల్ మీడియా, థర్డ్ పార్టీ డేటా చోరీ, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం లాంటి 10 అంశాలు కవర్ అవుతాయి. కుటుంబం మొత్తానికి కలిపి ఈ పాలసీలు తీసుకోవచ్చు.

సైబర్ ఇన్సూరెన్స్‌లో కవర్ కానివి  ఏంటి?

సైబర్ ఇన్సూరెన్స్‌లో కవర్ కానివి ఏంటి?

మోసపూరితంగా వ్యవహరించినా, శారీరకంగా గాయపడ్డా, ఆస్తుల విధ్వంసం జరిగినా, దుర్భాషలాడినా, అనధికారికంగా డేటా సేకరించినా, అనైతికంగా, అశ్లీలంగా వ్యవహరించినా పాలసీ వర్తించదు. ప్రభుత్వ ఆదేశాల వల్ల జరిగిన నష్టానికీ ఇన్సూరెన్స్ రాదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Cyber crime rising. Here is how an insurance cover can protect you.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X