నేరాంధ్రప్రదేశ్.. ఏడాదిలో 429 సైబర్ కేసులు నమోదు!

|

ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతికతను ఆధారంగా చేసుకుని దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న సైబర్ నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ యాక్ట్ క్రింద 429 కేసులు నమోదైనట్లు ఎన్ సీఆర్ బి విశ్లేషణలో వెల్లడైంది.

 
నేరాంధ్రప్రదేశ్.. ఏడాదిలో 429 సైబర్ కేసులు నమోదు!

సైబర్ నేరగాళ్లలో ఎక్కువ మంది యువతే!

2012కు గాను దేశాలో సైబర్ నేరం చట్టం క్రింది అరెస్టయిన నిందితుల్లో 18 నుంచి 30 సంవత్సరాల వయసుగల వారు అత్యధికంగా ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) పేర్కొంది. 2012కు గాను సైబర్ నేరం క్రింది దేశవ్యాప్తంగా 1,486 మందిని అదుపులోకి తీసుకోగా వారిలో 908 మంది యువతరానికి చెందిన వారేనని ఎన్‌సీఆర్‌బి స్పష్టం చేసింది.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

హర్యానా టాప్!

గత సంవత్సర కాలంగా హర్యానాలో సైబర్ నేరాల శాతం గణనీయంగా పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బి) చెప్పుకొచ్చింది. హర్యానాలో 2012కు గాను, వివిధ ఐపీఎస్ సెక్షన్ ల క్రింది నమోదైన సైబర్ నేరాల సంఖ్య 116. 2011లో ఈ సంఖ్య 3 మాత్రమే. 2012కు గాను పశ్చిమ బెంగాల్ లో నమోదైన సైబర్ నేరాల సంఖ్య 113, మహారాష్ట్రాలో చోటు చేసుకున్న సైబర్ నేరాల సంఖ్య 90.

మన దేశంలోకి ఇంటర్నెట్ ప్రవేశించి 19 సంవత్సరాలు పూర్తవుతోంది. మారుమూల పల్లెలోకి సైతం ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. ఇంటర్నెట్ వినియోగం ఎంత పెరిగిందో అందే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఉదయం లేచింది మొదలు రాతిరి నిద్దరోయే వరకు కంప్యూటర్ తోనే పనులు. ప్రస్తుత రోజులో ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులు సాగవు. ఇలాంటి నిత్యావసర ఇంటర్నెట్ వ్యవస్థను సైబర్ జాడ్యం పట్టి పీడిస్తోంది. సాంకేతికతను అవపోసన పట్టిన పలువురు నిపుణులు తమ విజ్ఞానాన్ని చెడు మార్గాలను వినియోగిస్తూ ఆన్‌లైన్ దాడులకు తెగబడుతున్నారు. సైబర్ నేరాలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికి నేరాల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X