Home
News

Windows 10 వినియోగిస్తున్నారా.. లాస్ట్‌ మినిట్‌ వరకు ఎదురుచూడవద్దు.. సైబర్‌ నిపుణుల వార్నింగ్‌..!

ప్రస్తుతం అనేక మంది తమ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లలో విండోస్‌ 10 ను (Windows 10) ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటికే విండోస్‌ 11 (Windows 11) కూడా అందుబాటులోకి వచ్చింది. విండోస్‌ 10 యూజర్లకు ఉచితంగానే విండోస్‌ 11 అందుబాటులో ఉంది. నోటిఫికేషన్‌ల రూపంలో విండోస్‌ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్‌ కోరుతోంది. విండోస్‌ 10 కు ఈ సంవత్సరం అక్టోబర్‌ నుంచి సపోర్టు ను నిలిపివేస్తున్నట్లు గతంలోనే ప్రకటన చేసింది.

విండోస్‌ 10 సిస్టమ్‌లలో భద్రతా సమస్యలకు తలెత్తే అవకాశం ఉందని.. అందువల్ల వీలైనంత వేగంగా విండోస్‌ 11 కు అప్‌గ్రేడ్‌ కావాలని నిపుణులు సూచిస్తున్నారు. అక్టోబర్‌ 2025 వరకు ఎదురుచూడడం మంచిది కాదని చెబుతున్నారు. మరికొన్ని నెలల్లో సపోర్టు నిలిచిపోనున్న కంప్యూటర్లపై హ్యాకర్లు దృష్టిసారించే అవకాశం ఉందని పేర్కొంది.

Cyber experts suggested windows 10 users to update

ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ESET దీనిపై నివేదికలను విడుదల చేసింది. వీలైనంత వేగంగా విండోస్‌ 11 కు అప్‌గ్రేడ్‌ కావాలని ESET కు చెందిన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మీరు వినియోగిస్తున్న కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ విండోస్‌ 11 కు సపోర్టు చేయకపోతే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించారు.

విండోస్‌ 10 కు ప్రస్తుతం అందిస్తున్న సపోర్టు మరో తొమ్మిది నెలల్లో ముగిసిపోనుంది. ఫలితంగా హ్యాంకింగ్‌ సహా ఇతర దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 60 శాతానికి పైగా విండోస్‌ కంప్యూటర్‌ / ల్యాప్‌ట్యాప్‌లు విండోస్‌ 10 పైన పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం విండోస్‌ 7 నుంచి యూజర్లు విండోస్‌ 10 కు అప్‌గ్రేడ్‌ అయ్యారు.

Cyber experts suggested windows 10 users to update

అయితే యూజర్లు విండోస్‌తోపాటు ఇతర ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆపిల్‌ mac తో పాటు Linux OS లను కూడా వినియోగించుకోవచ్చు. అయితే విండోస్‌ 10 యూజర్లకు ముందస్తుగా అప్రమత్తం చేయడంలో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఈ నివేదికను విడుదల చేసినట్లు తెలుస్తోంది.

విండోస్‌ 11 ను మైక్రోసాఫ్ట్‌ 2021 అక్టోబర్‌లో విడుదల చేసింది. విండోస్‌ 11 ను ఇన్‌స్టాల్‌ చేసేందుకు కనీసం 1 GHz స్పీడ్‌ ప్రాసెసర్‌, 64 బిట్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండాలి. కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ కనీసం 4GB ర్యామ్‌, కనీసం 64GB లేదా అంతకంటే ఎక్కువ స్టోరేజీని కలిగి ఉండాలి.

మైక్రోసాఫ్ట్‌ గతంలో చేసిన ప్రకటన ఆధారంగా 2025 అక్టోబర్‌ 14 నుంచి విండోస్‌ 10 ఎటువంటి అప్‌డేట్‌లు పొందలేదు. భద్రత సహా ఫీచర్‌ల కోసం యూజర్లు కచ్చితంగా విండోస్‌ 11 ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇప్పటికీ విండోస్ 7 ను వినియోగిస్తున్న యూజర్లు విండోస్‌ 11 ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని గతంలో మైక్రోసాఫ్ట్‌ వెల్లడింది.

విండోస్‌ 7 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను 2009లో లాంచ్ చేసింది. 2012 సంవత్సరంలో విండోస్‌ 8, 2013 సంవత్సరంలో విండోస్ 8.1 విడుదల చేశారు. విండోస్ 8, 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు పెద్దగా పాపులర్‌ కాలేదు. ప్రస్తుతం అనేక మంది వినియోగిస్తున్న విండోస్‌ 10ను 2015లో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. విండోస్‌ 11 2021లో అందుబాటులోకి వచ్చింది.

Best Mobiles in India

English summary
Cyber experts suggested windows 10 users to update to windows 11 immediately to avoid security risks
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X