Home
News

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంత డేంజర్‌ అంటే.. వీడియో కాల్‌ కూడా నమ్మలేం..! ఇదిగో ఉదాహరణ..!!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ రంగంలో వచ్చిన ఓ కీలక మార్పు. దీని కారణంగా సమీప భవిష్యత్‌లో అనేక రంగాలు ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నాయి. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అంత కంటే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని కొందరు నిఫుణులు భావిస్తున్నారు.

ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ దుర్వినియోగం అయితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. AI టెక్నాలజీ ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేశారు. స్నేహితుడిలా వీడియో కాల్‌ చేసి అందినకాడికి దోచుకున్నారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

kerala man cheated by cyber scammers

ఓ సైబర్‌ నేరగాడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఉపయోగించి రాధాకృష్ణ అనే వ్యక్తికి ఫోన్‌ చేశాడు. తనకు అత్యవసరంగా నగదు అవసరం ఉందని కోరాడు. అనంతరం వీడియో కాల్‌ చేసి తాను చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేయాలని కోరాడు. తన స్నేహితుడే అని నమ్మిన వ్యక్తి 40 వేల రూపాయల పంపించాడు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించాడు.

ఇందుకు సంబంధించిన బాధితుడు రాధాకృష్ణ వాట్సాప్‌ మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. "ఓ కొత్త నంబర్‌ నుంచి ఉదయం 6 గంటలకు ఫోన్‌ వచ్చింది. అయితే సాధారణంగా అలాంటి ఫోన్లను నేను పట్టించుకోను. అనంతరం అదే నంబర్‌ వాట్సాప్‌ నుంచి ఓ మెసెజ్‌ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తన మాజీ సహోద్యోగి పేరుతో ఇది అతని కొత్త నంబర్‌ అని చెప్పాడు.

kerala man cheated by cyber scammers

ఆ నంబర్‌ నుంచే వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. మాజీ సహోద్యోగివలే గొంతు ఉండడంతో ఎటువంటి సందేహం రాలేదు. ఆ కాల్‌లో కుటుంబ క్షేమం సహా ఇతర వివరాలు ఆరా తీశాడు. అనంతరం తాను ప్రస్తుతం దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ఉన్నాయని, తన బంధువు ఒకరు ముంబై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, అత్యవసరంగా తనకు 40 వేల రూపాయలు పంపాలని కోరాడు.

తాను కూడా ఇండియా వస్తున్నాయని, సాయంత్రానికి చేరుకుంటానని అనంతరం డబ్బు తిరిగి ఇస్తానని చెప్పారు. ప్రస్తుతం చాలా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని ఒకసారి వీడియో కాల్‌ చేయాలని కోరాను. వెంటనే వీడియో కాల్‌ కూడా చేశాడు. అనంతరం అతను చెప్పిన నంబర్‌కు 40 వేల రూపాయలు బదిలీ చేశాను. అయితే నగదు చేరిందని, మరో 30 వేల రూపాయలు పంపగలవా అంటూ కోరాడు.

అయితే తన బ్యాంక్‌లో అంత నగదు లేదని బదులిచ్చాను. అయితే అనంతరం కొంత సందేహం వచ్చింది. వెంటనే తన వద్ద ఉన్న మాజీ సహోద్యోగి పాత నంబర్‌కు కాల్‌ చేశాను. చాలా సమయం రింగ్‌ అయిన తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు. జరిగిన విషయం అంతా చెప్పాను.

ప్రస్తుతం దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ఉన్నానని, విమానం కోసం ఎదురుచూస్తున్నానని సాయంత్రం తప్పకుండా ఫోన్‌ చేస్తానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించి సైబర్‌ వింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను" అనే రాధాకృష్ణకు చెందిన మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. రాధాకృష్ణ ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రూ.40,000 బ్లాక్‌ చేయాలని కోరుతూ బ్యాంకు అధికారులను సంప్రదించారు.

ఈ ఘటనకు సంబంధించి సైబర్‌ వింగ్‌ ఎస్పీ హరిశంకర్‌ కీలక విషయాలు వెల్లడించారు. రాధాకృష్ణన్‌ అనే వ్యక్తిని తన మాజీ సహోద్యోగి పేరుతో ఓ వ్యక్తి వీడియో కాల్‌ చేసి, డబ్బు కావాలని కోరాడని చెప్పారు. తన మిత్రుడే కదా అని డబ్బు పంపి మోసపోయాడని ఎస్పీ చెప్పారు. బాధితుడు ఫిర్యాదుతో ఆ నగదు మొత్తాన్ని బ్లాక్‌ చేసినట్లు సైబర్‌ వింగ్‌ ఎస్పీ తెలిపారు.

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ హరిశంకర్‌ వెల్లడించారు. తాజా ఘటనలో మోసం చేసేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత వీడియో ఇంటర్‌ఫేస్‌ ద్వారా వీడియో కాల్ చేసి మోసానికి పాల్పడ్డాడని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు బేసిక్‌ AI ఆధారిత వీడియో ఇంటర్‌ఫేస్‌ను వినియోగించారని ఎస్పీ తెలిపారు. ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌ బ్లార్‌గా కనిపిస్తుందని గడ్డం, కళ్లు, పెదవులు కదలికలు కనిపిస్తాయని చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
cyber scammers connected through artificial intelligence based whatsapp video call to cheat keralaman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X