సెల్ రీచార్జ్ ఏజెంట్లు.. జర భద్రం?

Posted By: Staff

సెల్ రీచార్జ్ ఏజెంట్లు.. జర భద్రం?

సైబర్ నేరగాళ్ళు తన అక్రమార్జనలో భాగంగా కొత్తపంథాను ఎంచుకున్నారు. సెల్ ఫోన్ రిఛార్జ్ ఏజెంట్లను టార్గెట్ చేస్తూ వారిని మోసగించి లక్షల సంఖ్యలో నగదును దోచుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. సెల్ ఫోన్ వినియోగదారుల సౌకర్యార్ధం సెల్యూలార్ కంపెనీలు తమ ఏజెంట్లకు ఈ-లోడు ద్వారా టాక్ టైమ్ పంపుతున్నాయి. టాక్ టైమ్ మొత్తం పంపిన సాయంత్రానికి వ్యాపారులు ఆ కంపెనీ ఏజెంటుకు సొమ్ము చెల్లించాలి. రిఛార్జ్ కూపన్లు కొనుక్కొని అందులోని నెంబర్లును ఫోన్‌లో ఫీడ్ చేసి రిఛార్జ్ చేసుకునే ఓపిక, అవగాహన లేనివారి ఈ-లోడు ద్వారా మొబైల్ ఫోన్లు రిఛార్జ్ చేసుకుంటున్నారు. అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వ్యాపారుల మీద కన్నెశారు.

ఇంటర్నెట్ ద్వారా ఆయా కంపెనీకుల సంబంధించిన పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నవారి నెంబర్లు సేకరించారు. వారికి ఫోన్ చేసి ఏదో ఒక కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మిస్తున్నారు. తమ కంపెనీ వ్యాపారాభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి గుర్తింపుగా మూడువేల నుంచి ఐదువేల దాకా ఉచితంగా టాక్‌టైమ్ ఈ-లోడు ద్వారా పంపుతున్నట్లు చెప్పి వారిని మాయలో పడేస్తున్నారు. ఈ మొత్తం ఫోన్‌లో జమ కావడానికి తాము చెప్పిన నెంబర్లకు ఫోన్ చేసి తాము చెప్పినంత మొత్తం ఈ-లోడు అయ్యేలా చేయాలని సూచిస్తూ వ్యాపారుల వద్ద వున్నరిఛార్జి మొత్తాన్ని లాగేస్తున్నారు.

ఐదు నిమిషాల్లో మీకు అదనపు టాక్ టైమ్ జమ అయినట్లు మెసేజ్ వస్తుందని నమ్మిస్తున్నారు. తాము మాట్లాడిన నెంబర్లకు ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే ఎత్తేవారు ఉండరు. అప్పటికి గాని తాము మోసపోయామనే విషయాన్ని వ్యాపారులు గుర్తించలేక పోతున్నారు. రాష్ట్ర పరిధిలోని నెంబర్‌కు ఈ-లోడు ద్వారా మొత్తం రీఛార్జి అయివుంటే తాము మళ్ళీ వెనక్కు తెప్పించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల నెంబర్లకు రిఛార్జ్ అయితే తామేమీ చేయలేమని కంపెనీల అధికారులు సమాధానం ఇస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot