The Things Conference India' ను మొట్టమొదటి సారి ఇండియా లో నిర్వస్తున్న CyberEye అనే స్టార్ట్అప్

  -> ఈ టెక్నాలజీతో త్వరలోనే స్మార్ట్ నగరంగా మారగలిగే భాగ్యనగరం
  -> మొట్టమొదటి సారిగా 'The Things Conference'ను భారత దేశానికి తీసుకొచ్చిన ఐఐటియన్లు
  -> భారత దేశంలో థింగ్స్ నెట్‌వర్క్‌కి ముఖచిత్రంగా మారనున్న CyberEye
  -> స్టార్టప్‌ కంపెనీలకు పూర్తి సహాయాన్ని అందించే iB Hubs అనే స్టార్టప్ ఇంక్యుబేటర్, CyberEye కు సహకారాన్ని అందిస్తోంది.

  భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న 'The Things Conference' విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 9, 10 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు, పారిశ్రామికవేత్తలు 'ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్' మరియు 'లోరావ్యాన్‌' టెక్నాలజీలు అందించే అపార అవకాశాల గురించి చర్చించారు. ఈ టెక్నాలజీలు స్మార్ట్ నగరాలను ప్రభావవంతమైన మార్గంలో, వ్యయ, ప్రయాసలు తగ్గిస్తూ నిర్మించడానికి సహకరిస్తాయి. స్మార్ట్ అండ్‌ సెక్యూర్ వరల్డ్ ను నిర్మించడమే ఆశయంగా పనిచేస్తున్న సాంకేతిక సంస్థ CyberEye నేతృత్వంలో ఐబీ హబ్స్ మద్దతుతో ఈ ఈవెంట్‌ జరుగుతోంది.

  'The Things Conference India' ను ఇండియా లో నిర్వస్తున్న CyberEye

   

  ఆసియాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ రమణన్‌ రామనాథన్‌, ఫౌండేషన్‌ ఫర్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ అధ్యక్షురాలు, కరుణ గోపాల్‌, తదితరులతో పాటు ఇండియాను స్మార్ట్ దేశంగా మార్చే దిశగా కృషి చేస్తున్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్ మరియు లోరావ్యాన్‌ గ్లోబల్‌ లీడర్స్, థింగ్స్ ఇండస్ట్రీస్‌ సీఈఓ మరియు కో-ఫౌండర్‌ వియాంక్ గీజ్మెన్ , ది థింగ్స్ నెట్‌వర్క్‌ సీటీవో అండ్‌ కో-ఫౌండర్‌ యోహాన్ స్టాకింగ్‌, సాఫ్ట్వేర్ ఇంజనీర్ - మల్టీ టెక్‌ సిస్టమ్స్ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసాద్‌ కందికొండ తదితరులు భారత సాంకేతిక వ్యవస్థతో సమన్వయాలను ఈ సదస్సులో అన్వేషించారు.

  ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లోరావ్యాన్‌ సామర్ధ్యాన్ని గుర్తించి ఈ సాంకేతికతను అమలు చేస్తున్నాయి. ఇదే సాంకేతికతను మన దేశంలో అమలు చేస్తే అపారమైన మార్పులు తీసుకురావచ్చు. స్మార్ట్ నగరాల నిర్మాణంలో ఖర్చును మరింతగా తగ్గించవచ్చు. లోరావ్యాన్‌ సాంకేతికతతో మరింత వేగంగా స్మార్ట్ ఇండియాను చూడవచ్చు " అని CyberEye సీఈఓ రామ్‌ గణేష్ వ్యాఖ్యానించారు.

  స్మార్ట్ నగరాలు భారత జనాభాలో మూడింట ఒకవంతు ప్రజలను ప్రభావితం చేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానంలో గణనీయమైన మెరుగుదల వస్తుంది. ఘన వ్యర్ధాలు మరియు ఇంధన నిర్వహణ, సమర్థవంతమైన పట్టణ, ప్రజా రవాణా వంటి అవస్థాపన అంశాలు కూడా ప్రభావితం అవుతాయి . ఈ సాంకేతికత ఒక బలమైన, స్థిరమైన ఈ-గవర్నెన్స్ ను అందించ గలుగుతుంది.

  'The Things Conference' ద్వారా, సమస్యలను చర్చించి, పరిష్కారాలను కనుగొనడానికి ఒక వేదికను ఏర్పాటు చేసాము. భారతదేశంలో ఈ సాంకేతికతకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నాము. దేశవ్యాప్తంగా టెక్‌ కమ్యూనిటీలను తయారు చేయడం ద్వారా, భారతావనిని స్మార్ట్ అండ్‌ సెక్యూర్‌గా మార్చడంపై దృష్టిని సారించాము. ఈ సదస్సుకు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మాకు మద్దతిస్తూ, వెన్నంటే నిలిచి నడిపిస్తున్న ఐబీ హబ్స్ కు కృతజ్ఞతలు. వారి సహకారం లేకుండా 'The Things Conference' ఇండియా' సాధ్యమయ్యేది కాదు' అని రామ్‌ గణేష్ అన్నారు.

   

  శ్రీ రవి శంకర్ ప్రసాద్ గారు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు లా అండ్ జస్టిస్ మినిష్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థింగ్స్ కాన్ఫరెన్స్ కు వీడియో ద్వారా తమ శుభాకాంక్షలను తెలియజేశారు.

  ఇదే సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ప్రసంగిస్తూ, "అధునాతన టెక్నాలజీలలో మార్గనిర్దేశకులుగా ఎదిగే దిశగా కృషి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మన రాష్ట్రం నుండి కనీసం 20 ఐఓటీ ఆవిష్కరణలు వచ్చాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కు అద్భుతమైన పరిణామాలను తీసుకురాగల సామర్థ్యముంది. ఈ టెక్నాలజీ ద్వారా ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆవశ్యకతను తెలియజేయడం సులభమవుతుంది'' అన్నారు.

  ది థింగ్స్ నెట్‌వర్క్‌ వ్యవస్థాపక సీఈఓ వియాంక్ గీజ్మెన్ మాట్లాడుతూ,
  ఇక్కడికి వచ్చి, సదస్సులో భాగస్వామ్యం కావడం మాకెంతో సంతోషదాయకం. భారతదేశంలో గల సాంకేతిక సామర్థ్యాలని మేము గమనించాము. లోరావ్యాన్‌ సాంకేతికత విస్తరణకు ఇండియా సువర్ణావకాశాన్ని అందిస్తుంది. దేశంలోని సాంకేతిక నిపుణుల శక్తి సామర్ధ్యాలపై మాకు నమ్మకం ఉంది. సైబర్‌ఐ వంటి సంస్థల కృషితో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను భారతదేశం తొందరగా అలవరచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. భారతదేశంలో ప్రొఫెషనల్ సేవలను అందించేందుకు సైబర్ఐ తో కలసి పనిచేయడానికి సంతోషిస్తున్నాము' అన్నారు.

  ఈ సదస్సు తొలిసారిగా జరుగుతున్నా అధ్భుతమైన స్పందన వచ్చింది. కొత్తతరం సాంకేతికతను పరిచయం చేసేందుకు సైబర్‌ ఐ చేస్తున్న కృషి ముదావహం. స్టార్టప్‌ కంపెనీలు ఎటువంటి విప్లవాత్మక మార్పులను చూపిస్తాయనడానికి CyberEye ఒక నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్‌ కంపెనీలకు మద్దతిస్తాం. దీని ద్వారా దేశాన్ని ముందుకు నడిపించడంలో సహకరిస్తాం' అని ఐబీ హబ్స్ సీఈఓ కావ్య వ్యాఖ్యానించారు.

  ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఐఓటీ డెవలపర్లు, కార్పొరేట్‌ సంస్థలు, ఔత్సాహికులు తదితర సుమారు 300 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ టెక్నాలజీల ద్వారా అందివచ్చే అపారమైన అవకాశాలను చర్చించడానికి మరియు స్మార్ట్ అనువర్తనాలను రూపొందించడంలో సవాళ్లను అధిగమించడానికి వీరు చర్చలు సాగించారు.

  English summary
  CyberEye brings ‘The Things Conference’ for the first time to India!.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more