సైబ‌ర్ నేరాలతో తీవ్ర న‌ష్టం.. Cyber Security ఎంతో ఆవ‌శ్య‌కం!

|

Cyber Security కి సంబంధించిన బెదిరింపులు జాతీయ భద్రతకు అత్యంత‌ ప్రమాదమని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ రాజేష్ పంత్ గురువారం తెలిపారు. అంతేకాకుండా సైబర్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠంగా నిర్మించుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. డీఎక్స్ సెక్యూర్ స‌మ్మిట్ వేదిక‌గా ఆయ‌న ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. దేశంలో Cyber Security పై అవగాహన కల్పించాలని పంత్ పిలుపునిచ్చారు.

 
సైబ‌ర్ నేరాలతో తీవ్ర న‌ష్టం.. Cyber Security ఎంతో ఆవ‌శ్య‌కం!

ఈ సంద‌ర్భంగా పంత్ మాట్లాడుతూ.. Cyber Securityకి సంబంధించిన బెదిరింపులు జాతీయ భద్రతకు అత్యంత‌ ప్రమాదమ‌న్నారు. అదేవిధంగా సైబర్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠంగా నిర్మించుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌క‌మ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా, గ్రూప్ హెడ్ మరియు డైరెక్టర్ అశుతోష్‌ చద్దా మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ లు కార‌ణంగా ప్ర‌తి యేటా ఆర్థిక‌ వ్యవస్థలకు 6 ట్రిలియన్ డాలర్లు (రూ. 4.6 కోట్ల కోట్లు) కంటే ఎక్కువ న‌ష్టం అవుతుందని తెలిపారు. మరియు ఇది 2025 నాటికి మ‌రింత‌ పెరుగుతుందని ఆయ‌న అంచ‌నా వేశారు. దీన్ని బ‌ట్టి చూస్తే ప్ర‌తి కంపెనీ కూడా స్వ‌యంగా ప‌టిష్ట‌మైన‌ సైబ‌ర్ సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌ను క‌లిగి ఉండాల‌నే విష‌యం మ‌న‌కు అర్థం అవుతోంది అన్నారు.

సైబ‌ర్ నేరాలతో తీవ్ర న‌ష్టం.. Cyber Security ఎంతో ఆవ‌శ్య‌కం!

సెంటర్ ఫర్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (CII ) చైర్మన్ మరియు NIIT వైస్-ఛైర్మెన్ మరియు MD విజయ్ తడానీ మాట్లాడుతూ.. అర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ వ్య‌వ‌స్థ ఈ సైబర్ బెదిరింపులకు చెక్ పెట్టేందుకు ఉత్తమ సాధ‌నంగా ఉపయోగించవచ్చని తెలిపారు. Cyber Security అనేది కేవ‌లం ప్ర‌మాదాల‌కు చెక్ పెట్ట‌డ‌మే కాకుండా, ప‌ని ఉత్పత్తి సామర్ధ్యం పెంచుతుంద‌ని తడాని చెప్పారు. ఇటీవల, నాగ్‌పూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వెబ్‌సైట్ హ్యాక్ చేయబడిన ఘ‌ట‌నే ఓ ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న చెప్పారు. అమెరికా సైతం ఇటీవ‌ల Cyber Security విష‌యంలో ర‌ష్య‌న్‌కు చెందిన బోట్‌నెట్ ను విచ్చిన్నం చేసిన క్ర‌మంలోనే వీరు తాజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ కూడా ఇటీవ‌లె సైబ‌ర్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ప‌లు ప్రైవేటు వీపీఎన్‌ల‌ను వినియోగించ‌వ‌ద్ద‌ని ఉద్యోగుల‌కు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

సైబ‌ర్ నేరాలతో తీవ్ర న‌ష్టం.. Cyber Security ఎంతో ఆవ‌శ్య‌కం!

బోట్‌నెట్ పై అమెరికా చ‌ర్య‌లు:
సైబ‌ర్ దాడుల విష‌యంలో యూఎస్ కీల‌క చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ర‌ష్యాకు చెందిన Botnet పై యునైటెడ్ స్టేట్స్ కీల‌క చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కంప్యూటర్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేసింద‌న్న ఆరోప‌ణ‌ల‌తో రష్యన్ బోట్‌నెట్ యొక్క మౌలిక సదుపాయాలను US విచ్ఛిన్నం చేసిన‌ట్లు స‌మాచారం. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, జర్మనీ, నెదర్లాండ్స్ మరియు UKలోని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ భాగస్వాములతో కలిసి, RSOCKS అని పిలువబడే రష్యన్ బోట్‌నెట్‌ను విచ్చిన్నం చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) పరికరాలను మరియు ఆండ్రాయిడ్ పరికరాలు మరియు సాంప్రదాయ కంప్యూటర్ ప‌రిక‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హ్యాక్ చేసిన కార‌ణంగా యూఎస్‌ ఈ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు యూఎస్ అటార్నీ ర్యాండీ గ్రాస్‌మ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ప‌లు కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

 
సైబ‌ర్ నేరాలతో తీవ్ర న‌ష్టం.. Cyber Security ఎంతో ఆవ‌శ్య‌కం!

భార‌త్‌లోనూ సైబ‌ర్ దాడుల క‌ట్టడికి చ‌ర్య‌లు ముమ్మ‌రం:
దేశంలో సైబ‌ర్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ఠం చేసే దిశ‌గా భార‌త ప్ర‌భుత్వం ఇటీవ‌ల‌ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగులు థ‌ర్డ్ పార్టీ వ‌ర్చువ‌ల్‌ ప్రైవేట్ నెట్‌వ‌ర్క్(VPN) స‌ర్వీసుల‌ను ఉప‌యోగించ‌వ‌ద్దు అంటూ ఆదేశించింది. ఈ మేర‌కు జాతీయ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆదేశాలు జారీ చేసింది. నార్డ్ వీపీఎన్ (Nord VPN), ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ (Express VPN) ఆఫ‌ర్ చేస్తున్న స‌ర్వీసుల‌ను వినియోగించ‌వ‌ద్ద‌ని ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసింది. వాటితో పాటు టార్ స‌హా మ‌రి కొన్ని స‌ర్వీసుల‌పై ఈ కొత్త ఆదేశాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. ప్ర‌భుత్వానికి సంబంధించిన ముఖ్య‌మైన డేటా ఫైల్స్‌ను, అతి ముఖ్య‌మైన అంత‌ర్గత స‌మాచారాన్ని ప్ర‌భుత్వేత‌ర క్లౌడ్ విభాగాలైన గూగుల్ డ్రైవ్‌, డ్రాప్‌బాక్స్‌ల‌లో స్టోర్ చేయ‌వ‌ద్దు అని ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసింది.

Best Mobiles in India

English summary
Cybersecurity Threats Are Biggest Risk to National Security

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X