Home
News

D2h యూజర్లకు బంపర్ ఆఫర్!!! ఉచితంగా యాడ్-ఆన్ ప్యాక్‌లు

ఇండియాలోని అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన వీడియోకాన్ D2h తన వినియోగదారులకు కొన్ని ప్రత్యేకమైన మరియు ఉత్తమమైన SD మరియు HD ఛానెల్ ప్యాక్‌లను అందిస్తుంది. ఈ డిటిహెచ్ ఆపరేటర్ మిలియన్ల మంది భారతీయ ఇళ్లకు తన సేవలను అందిస్తుంది. D2h యొక్క కస్టమర్లు ప్రయోజనం పొందే ఒక విషయం ఏమిటంటే వారికి అందించే విస్తృతమైన ప్లాన్లు. ఇవే కాకుండా కస్టమర్‌లు తమ సొంత ఛానెల్ ప్యాక్‌లను సృష్టించుకొనే సౌలభ్యాన్ని కూడా పొందుతారు. ఒకవేళ కస్టమర్ ప్రస్తుత DTH ప్లాన్‌తో సంతృప్తి చెందకపోతే కనుక వారు అదనపు ఖర్చుతో యాడ్-ఆన్ ప్లాన్‌ను కూడా అదనంగా ఎంచుకోవచ్చు. దీనితో వారు తమకు నచ్చిన ఛానెల్‌లను పొందవచ్చు. D2h ఆపరేటర్ ప్రస్తుతం యాడ్-ఆన్ ప్యాక్‌లను ఉచితంగా అందిస్తోంది. దాని గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

D2h-యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉచితంగా

D2h-యాడ్-ఆన్ ప్యాక్‌లు ఉచితంగా

D2h ప్రస్తుతం తన వినియోగదారులకు అదనపు ఖర్చులు ఏమీ లేకుండా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తోంది. అన్ని ప్లాన్లు ఉచితంగా రావడం లేదు కానీ కస్టమర్ ఎంచుకోవడానికి ఉచిత ప్లాన్లు చాలానే ఉన్నాయి. D2h యొక్క వెబ్‌సైట్‌లో యాడ్-ఆన్ ప్యాక్‌లను ‘యాడ్-ఆన్స్- SD/ HD' మరియు ‘BST యాడ్-ఆన్‌లు' అనే రెండు వర్గాలుగా విభజించారు. ఈ రెండు వర్గాల కింద గల ప్లాన్లు ఉచితంగా లభిస్తాయి.

D2h BST రెస్ట్ ఆఫ్ ఇండియా ప్యాక్ పూర్తి వివరాలు

D2h BST రెస్ట్ ఆఫ్ ఇండియా ప్యాక్ పూర్తి వివరాలు

DTH ఆపరేటర్ ఉచితంగా అందిస్తున్న BST యాడ్-ఆన్‌ల క్రింద ఉన్న అతి పెద్ద యాడ్-ఆన్ ప్యాక్లలో ఒకటి "BST రెస్ట్ ఆఫ్ ఇండియా" ప్లాన్.  ఈ ప్లాన్‌ మొత్తంగా 93 ఛానెల్‌లను అందిస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఈ మొత్తం ఛానెల్‌లను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. కాకపోతే ఈ ప్యాక్ ఎటువంటి HD ఛానెల్‌లను అందించదు.

D2h యాడ్-ఆన్స్- SD/ HD ప్యాక్ పూర్తి వివరాలు  

D2h యాడ్-ఆన్స్- SD/ HD ప్యాక్ పూర్తి వివరాలు  

DTH ఆపరేటర్ ఉచితంగా అందిస్తున్న BST యాడ్-ఆన్‌ల క్రింద ఉచితంగా అందిస్తున్న రెండవ ప్లాన్ యాడ్-ఆన్స్- SD/ HD. ఈ కేటగిరీ విభాగంలో డిటిహెచ్ ఆపరేటర్ మొత్తంగా 90 ఛానెల్‌లను ఉచితంగా అందిస్తుంది. వీటిలో కూడా ఎటువంటి HD ఛానెల్‌లు లేకపోవడం గమనార్హం.

D2h యాడ్-ఆన్- మ్యూజిక్ ఛానెల్‌లు

D2h యాడ్-ఆన్- మ్యూజిక్ ఛానెల్‌లు

మీరు సంగీత ప్రేమికులైతే కనుక D2h నుండి లభించే మ్యూజిక్ యాడ్-ఆన్ ప్యాక్‌లను ఎంచుకోవడం ఉత్తమం. ఇందులో ‘BST MUSIC' ప్యాక్‌ల కోసం వెళ్లడం అన్నిటికంటే ఉత్మమం. ఆపరేటర్ ప్రస్తుతం ఈ ప్యాక్‌ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇందులో 39 మ్యూజిక్ ఛానెల్‌లను కలిగి ఉండడం మరొక గొప్ప విషయం. న్యూస్ ఛానెళ్లు కూడా యాడ్-ఆన్ ప్యాక్‌లలో ఉచితంగా ఇవ్వబడుతున్నాయి.

Best Mobiles in India

English summary
D2h Bumper Offer: Multiple Add-on Packs Charges Removed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X