D2h యూజర్లకు శుభవార్త!! అన్ని STBలపై 5సంవత్సరాల వారంటీ..
డిష్ టీవీ యాజమాన్యంలో పనిచేస్తున్న D2h ఆపరేటర్ ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లో లభించే అన్ని సెట్-టాప్ బాక్స్‌లపై (STB) ఐదేళ్ల వారంటీని అందించడం ప్రారంభించింది. ఇంతకు ముందు భారతదేశంలో STB వారంటీ పరంగా ఉత్తమ డిటిహెచ్ ఆపరేటర్‌గా డిష్ టీవీ మొదటి స్థానంలో ఉంది. డిష్ టీవీ ఇప్పటికి కొన్ని కొత్త పథకాలతో కొనసాగుతూ తన ఎస్‌టిబిలపై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తుండగా డి2హెచ్ ఆపరేటర్‌తన STBలపై ఐదేళ్ల వారంటీని అందిస్తూ పరిశ్రమలో మొదటిదిగా నిలిచింది.

గతంలో టాటా స్కై కూడా తన యొక్క అన్ని ఎస్‌టిబిలపై మూడు సంవత్సరాల వారంటీని అందించింది. కాని కంపెనీ ఈ విధానాన్ని మళ్లీ కేవలం ఒక సంవత్సరానికి సవరించింది. అలాగే ఎయిర్టెల్ డిజిటల్ టివి మరియు సన్ డైరెక్ట్ కూడా కేవలం ఒక సంవత్సరం STB వారంటీని అందిస్తున్నాయి. STB వారంటీ విధానంలో కొత్త సవరణల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

D2h సెట్-టాప్ బాక్స్ వారంటీ ఫ్రీ సర్వీస్
D2h యొక్క వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న క్రొత్త సమాచారం ప్రకారం కొత్త కనెక్షన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి సెట్-టాప్ బాక్స్‌ల మీద ఐదేళ్ల వారంటీని అందిస్తున్నది. D2h ఆపరేటర్‌లో నాలుగు ఎస్‌టిబిలు ఉన్నాయి. ఇందులో ఆండ్రాయిడ్ టివి ఆధారిత D2h స్ట్రీమ్ బాక్స్ ధర రూ.3,999 కాగా, డి 2 హెచ్ డిజిటల్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ రిమోట్ ధర రూ.1,799, డి2హెచ్ డిజిటల్ హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,599 మరియు d2h డిజిటల్ SD సెట్-టాప్ బాక్స్ రూ.1,499 రిటైల్ ధర లభిస్తుంది.

D2h ఇప్పుడు యాంటెన్నాతో సంబంధం లేకుండా STB లను అందిస్తోంది. D2h యొక్క వెబ్‌సైట్‌లో కొత్త కనెక్షన్‌ను బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులు కొన్ని రకాల ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. కస్టమర్ యాంటెన్నాతో ఎంచుకుంటే కనుక వారికి కంపెనీ రిమోట్, ఎస్‌టిబి, యాంటెన్నా, LMP మరియు వైర్ (10 మీటర్లు) పంపిణీ చేస్తుంది. యాంటెన్నా ఎంపిక లేకుండా ఎంచుకున్న వినియోగదారులకు రిమోట్ మరియు STB లను మాత్రమే పంపిణీ చేస్తారు.

D2h యొక్క అన్ని కొత్త కనెక్షన్‌లకు ఎస్‌టిబిలపై ఐదేళ్ల వారంటీతో పాటు ఒక నెలపాటు ఉచిత ఛానల్ ప్యాక్ లభిస్తుంది. SD సెట్-టాప్ బాక్స్ కాకుండా మిగతా మూడు STB లు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF) తో సహా ఒక నెల పాటు HD ఛానల్ ప్యాక్‌తో వస్తాయి. చివరగా, D2h తన కొత్త కనెక్షన్లలో ఇన్స్టాలేషన్ లను ఉచితంగా అందిస్తుంది. D2h అన్ని STB లు అపరిమిత రికార్డింగ్ సదుపాయంతో వస్తాయి.


Click it and Unblock the Notifications








