D2h ఇన్‌యాక్టివ్‌ యూజర్ల కోసం కొత్తగా రెండు ఛానెల్ ప్యాక్‌లను లాంచ్ చేసింది...

|

ఇండియాలోని డైరెక్ట్-టు-హోమ్ (DTH) రంగంలోని ప్రధాన సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన D2h దేశంలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న తన యొక్క వినియోగదారుల కోసం రెండు కొత్త ఛానెల్‌ల ప్యాక్‌లను ప్రారంభించింది. ఈ ఛానెల్ ప్యాక్‌లు ఫిబ్రవరి 28, 2022 నాటికి ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రకటించబడిన కస్టమర్‌లకు నేడు అంటే ఏప్రిల్ 1, 2022 నుండి అందుబాటులోకి వస్తాయి. D2h ఈ ప్యాక్‌లను కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాల్లోని ప్రజలకు అందజేస్తుంది. ఈ ప్యాక్‌ల యొక్క ప్రయోజనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

D2h కస్టమర్‌లు

ఇన్‌యాక్టివ్‌గా ప్రకటించబడిన SES8 కస్టమర్‌లు మరియు D2h కస్టమర్‌లు ఇద్దరికీ అందుబాటులోకి తీసుకొనివచ్చిన ఛానెల్ ప్యాక్ ధరలలో మొదటిది రూ.99 ధర వద్ద మాత్రమే లభిస్తుంది. D2h కస్టమర్‌లు కంపెనీ నుండి 'వాల్యూ కాంబో లైట్' ప్యాక్‌ని పొందడానికి అర్హులు కాగా SES8 సబ్‌స్క్రైబర్‌లు 'వాల్యూ కాంబో లైట్' ఛానెల్ ప్యాక్‌ని పొందుతారు. ఈ ఛానెల్ ప్యాక్‌లు రూ.99 (GSTతో సహా) ధర వద్ద లబిస్తాయి అని గమనించండి.

UPP399 & UPP599

ఈ ఛానెల్ ప్యాక్‌లను పొందేందుకు అర్హత ఉన్న కస్టమర్‌లు కంపెనీ నుండి SMS పొందుతారు లేదా వినియోగదారులు ఆఫర్‌కు అర్హులు కాదా మరియు దాని కోసం రీఛార్జ్ చేయడం ఎలా అని విచారించడానికి D2h యొక్క కస్టమర్ కేర్‌కు కూడా కాల్ చేయవచ్చు. వినియోగదారు కంపెనీ నుండి ఆరు లేదా పన్నెండు నెలల ప్లాన్ (UPP399 & UPP599) తీసుకున్నట్లయితే ప్యాక్ నుండి అప్‌గ్రేడ్ మరియు డౌన్‌గ్రేడ్ అనుమతించబడదని కంపెనీ తెలిపింది. అయితే మల్టీ-రూమ్ సబ్‌స్క్రైబర్‌లకు ఈ ప్యాకేజీలు అందుబాటులో లేవు. వినియోగదారులు ఈ ఛానెల్ ప్యాక్‌లను ఒకటి, ఆరు మరియు పన్నెండు నెలల వాలిడిటీ కాలానికి వరుసగా రూ.99, రూ.399 మరియు రూ. 599 ధరల వద్ద పొందవచ్చు.

DD డిష్‌లో 4 GEC ఛానెల్‌లు ఉచితంగా
 

DD డిష్‌లో 4 GEC ఛానెల్‌లు ఉచితంగా

ఏప్రిల్ 1, 2022 నుండి DD ఫ్రీ డిష్ కస్టమర్‌లు ఇకపై Star Utsav, Sony Pal, Colors Rishtey మరియు Zee Anmol వంటి 4 GEC ఛానెల్‌లను ఉచితంగా పొందలేరు. ఇవన్నీ ఇప్పుడు చెల్లింపు ఛానెల్‌లు మరియు D2h దీని కారణంగా కోల్పోయిన కస్టమర్‌లను తిరిగి పొందడం కోసం DD ఫ్రీ డిష్‌కి బ్యాంకింగ్ చేస్తోంది. ఇన్‌యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లు తమ టీవీలను కొనసాగించడానికి ఇవి చాలా మంచి ఆఫర్‌లు.

రూ.250 లోపు లభించే డిష్ టీవీ ఛానల్ SD ప్యాక్‌లు

రూ.250 లోపు లభించే డిష్ టీవీ ఛానల్ SD ప్యాక్‌లు

ఎక్కువగా ప్యాక్‌లను ఎంచుకునే కస్టమర్‌లు తమ నిర్దిష్ట సర్కిల్ లేదా స్టేట్ కోసం తనిఖీ చేస్తారు. అదే విధంగా వెళితే డిష్ టీవీ దాని అధికారిక వెబ్‌సైట్ నుండి సర్కిల్ కే ప్యాక్‌లను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విభాగంలో మీరు రూ.250 లోపు ధర కలిగిన ప్యాక్‌ల కోసం చూస్తున్నట్లయితే మీకు రాజ్ కా అప్నా ప్యాక్ లభిస్తుంది దీని ధర కేవలం రూ.115 మాత్రమే. ఈ ప్యాక్‌లో 31 SD ఛానెల్‌లు ఉన్నాయి. వీటిలో హిందీ, కిడ్స్, గేమ్స్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ కలయిక ఛానెల్‌లు లభిస్తాయి. రాజస్థాన్ యూజర్లు కూడా రాజ్ కా అప్నా స్పోర్ట్స్ ప్యాక్ ను రూ.158 ధరతో పొందవచ్చు. ఇది 57 SD ఛానెల్‌ల కలయికతో క్రీడా ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకున్నారు. అలాగే UP కా అప్నా ప్యాక్ కూడా రూ.152 తక్కువ ధర వద్ద లభిస్తుంది. ఇందులో 51 SD ఛానెల్‌లు ఉన్నాయి. ఇది UP యొక్క క్రికెట్ ప్రేమికులకు ఉద్దేశించబడింది. దీనితో పాటుగా పంజాబీ స్వాగ్ ప్యాక్ కూడా ఈ కేటగిరీ కింద వస్తుంది. అయితే ఇది రూ.176 ధరతో 67 SD ఛానెల్‌లతో లభిస్తుంది.

రూ.250 ధర లోపు గల డిష్ టీవీ ఛానల్ HD ప్యాక్స్

రూ.250 ధర లోపు గల డిష్ టీవీ ఛానల్ HD ప్యాక్స్

మరోవైపు రూ.250 లోపు ధర వద్ద లభించే కొన్ని HD ప్యాక్‌లు కూడా ఉన్నాయి. ఈ డిష్ టీవీ HD ప్యాక్‌లలో రాజ్ కా అప్నా ప్యాక్ HD అనేది గేమ్స్ ఔత్సాహికుల మీద దృష్టి పెట్టింది. ఇది నెలకు రూ.172 ధర వద్ద లభిస్తుంది. ఇది మొత్తంగా 12 HD ఛానెల్‌లు మరియు 19 SD ఛానెల్‌లను కలిగి ఉంటాయి. ఈ ధర కేటగిరీలోని HD ఛానెల్‌లతో డిష్ టీవీ నుండి గుర్తించదగిన ఇతర ప్యాక్ లో UP కా అప్నా HD ప్యాక్ ఉంది. ఇందులో మొత్తంగా 55 ఛానెల్‌లు ఉంటాయి. వీటిలో 20 HD ఛానెల్‌లు మరియు 35 SD ఛానెల్‌లు ఉన్నాయి. దీని ధర నెలకు రూ.246. వీటితో పాటు మీరు మీ భాష ప్రాధాన్యతల ఆధారంగా ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్యాక్‌లు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, హిందీ, మరాఠీ, బంగ్లా మరియు ఒడియా సహా అన్ని భాషలలో అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
D2h Launches Two New Channel Packs For Inactive Users: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X