D2h New NCF: 200 SD ఛానెల్‌లు ఇప్పుడు రూ.130లకే

|

డిటిహెచ్ పరిశ్రమలోని డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకరైన డి 2 హెచ్ ఇప్పుడు అత్యంత సరసమైన ధరల వద్ద తన ప్లాన్లను కలిగి ఉండి డిష్ టివి యొక్క యాజమాన్యంలో అందరి మన్ననలను చూరగొంటోంది. ఇంతకుముందు ఇవి అందించిన ఆకర్షణీయమైన ధరల కారణంగా డిష్ టివి మరియు డి 2 హెచ్ రెండూ కూడా చాలా ఎక్కువ మంది వినియోగదారులను తమ దృష్టిని ఆకర్షించాయి.

D2h NCF

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రస్తుతం తీసుకువచ్చిన కొత్త నిబంధనలు పరిశ్రమలో గొప్ప మార్పులను సృష్టించడానికి ప్రయత్నించాయి. దీని కింద పరిశ్రమను నియంత్రించే అంతర్లీన నియమాలు మరియు నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF) వంటి ముఖ్యమైన పారామితులు కూడా మార్చబడ్డాయి.

 

 

Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...Realme 6 స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం... ఆఫర్స్ ఇవే...

కొత్త NCF స్లాబ్‌ ధర

కొత్త NCF స్లాబ్‌ ధర

ఇప్పుడు D2h కొత్త నిబంధనలకు అనుగుణంగా తన కొత్త NCF ధర స్లాబ్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు D2h NCF కోసం దాని ధర స్లాబ్‌లలో కొన్ని రకాల మార్పులను చేసింది. చాలా మంది వినియోగదారులకు ఈ కొత్త మార్పులు అనుకూలంగా ఉన్నాయి అని భావిస్తున్నారు. D2h దాని NCF స్లాబ్‌లలో ఎటువంటి కొత్త మార్పులు చేసిందో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

Airtel Wi-Fi broadband తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్‌లుAirtel Wi-Fi broadband తక్కువ ధరలో అందిస్తున్న ప్లాన్‌లు

 

 

డిష్ టీవీ కొత్త NCF స్లాబ్‌లు

డిష్ టీవీ కొత్త NCF స్లాబ్‌లు

డి 2 హెచ్ కొత్తగా సవరించిన నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు స్లాబ్ ప్రకారం 200 SD ఛానెల్‌లను కోరుకునే చందాదారులు ఛానల్ స్లాట్‌లకు నెలకు రూ.130 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల పన్నులతో కలుపుకొని మొత్తంగా రూ.153.40లు అవుతుంది. అలాగే 200 కంటే ఎక్కువ మరియు 220 కన్నా తక్కువ ఉన్న ఛానెల్‌లకు చందాదారులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రకాల పన్నులతో కలుపుకొని 177 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఆ తరువాత చందాదారులు తమ సభ్యత్వంలో 220 కంటే ఎక్కువ ఛానెళ్లను కలిగి ఉండాలనుకుంటే ఎన్‌సిఎఫ్ పేరిట నెలకు రూ.160 చెల్లించాల్సి ఉంటుంది.

 

 

BSNL STV 247 Plan:30రోజులలో 3GB రోజువారీ డేటాతో టెల్కోలకు సవాల్!!!BSNL STV 247 Plan:30రోజులలో 3GB రోజువారీ డేటాతో టెల్కోలకు సవాల్!!!

D2h యొక్క పాత NCF స్లాబ్‌లు

D2h యొక్క పాత NCF స్లాబ్‌లు

D2h తన చందాదారులకు ఇచ్చిన మునుపటి NCF స్లాబ్‌తో పోల్చినప్పుడు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు చందాదారులు 200 ఛానెల్‌లకు 130 రూపాయలు చెల్లించేవారు. కాని 200 ఛానెల్‌లకు మించిన ఎన్ని ఛానెల్‌లకు అయిన నెలకు రూ.160 చెల్లించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు D2h పూర్తిగా కొత్త స్లాబ్‌ను సృష్టించింది. ఈ కొత్త స్లాబ్ డిష్ టివి తన చందాదారులకు అందిస్తున్న దానితో సమానంగా ఉంటుంది.

 

 

ఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్‌ ఉచితంఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్‌ ఉచితం

ట్రాయ్

ఈ సంవత్సరం ప్రారంభంలో కేబుల్ మరియు ప్రసార పరిశ్రమ నిబంధనలను ట్రాయ్ సవరించింది. అందువలన ఈ డిటిహెచ్ రంగంలో కొత్త ధరల నియమాలను రూపొందించారు. ఈ కొత్త ధర స్లాబ్ మార్పులలో భాగంగా మల్టీ టీవీ కనెక్షన్ విషయంలో కూడా చందాదారులు ప్రతి కనెక్షన్‌కు రూ.50 ఫ్లాట్ NCFను మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.

Best Mobiles in India

English summary
D2h New NCF Slab Offers 200 Channels at Rs 130

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X