Home
News

D2h యూజర్లకు గుడ్ న్యూస్!! 2నెలల రీఛార్జ్ మీద ఉచిత ఆఫర్

ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) రంగంలోని సర్వీసు ప్రొవైడర్లలో ఒకటైన D2h ఇప్పుడు తన ప్రజల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుతం D2h టీవీ కనెక్షన్ ను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం విషయానికి వస్తే DTH ఆపరేటర్ వినియోగదారులకు చాలా తక్కువ ధరలోనే సరసమైన ప్లాన్ లను అందించడం.

D2h ఆపరేటర్ ఫ్రీ ఆఫర్స్

D2h ఆపరేటర్ ఫ్రీ ఆఫర్స్

D2h ఆపరేటర్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను మరియు ఆఫర్లను పరిచయం చేస్తూనే ఉంది. కస్టమర్లు పొందే అత్యంత ఆసక్తికరమైన రీఛార్జ్ ఆఫర్లలో ఒకటి దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లు. వినియోగదారులు ఎంచుకోవడానికి 1 నుండి 12 నెలల మధ్య గల వివిధ రకాల ప్లాన్లు ఉన్నాయి. D2h సంస్థ తన దీర్ఘకాలిక ప్లాన్ లతో రీఛార్జ్ చేసే వ్యక్తుల కోసం కొన్ని రోజుల పాటు తన సేవలను ఉచితంగా అందిస్తుంది. ఇప్పుడు ఈ DTH ఆపరేటర్ కొత్తగా 2 నెలలకు రీఛార్జ్ చేసే వ్యక్తుల కోసం కొత్తగా ఒక ఉచిత ఆఫర్ ను తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

D2h యొక్క 2 నెలల రీఛార్జిపై ఉచిత ఆఫర్

D2h యొక్క 2 నెలల రీఛార్జిపై ఉచిత ఆఫర్

D2h ఆపరేటర్ యొక్క వినియోగదారులు 2 నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేసినప్పుడు 4 రోజులపాటు అన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తోంది. ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ 4 రోజుల సర్వీస్ ను డిస్కౌంట్ చేయడానికి బదులుగా మీ 2 నెలల ప్లాన్‌లో చేర్చబడతాయి. 2 నెలల ప్లాన్‌తో రీఛార్జ్ చేసే వ్యక్తులు మొత్తంగా 2 నెలలు + 4 రోజులు డిటిహెచ్ సర్వీసును పొందుతారు. మీ D2h కనెక్షన్‌ను రీఛార్జ్ చేయడానికి D2h వెబ్‌సైట్ లేదా  D2h యాప్ ఇన్ఫినిటీని ఉపయోగించవచ్చు. మీరు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి రీఛార్జ్‌ చేసినప్పుడు అదనంగా మీకు ఉచిత వోచర్లు కూడా లభిస్తాయి.

D2h దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ల ఉచిత ఆఫర్లు

D2h దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ల ఉచిత ఆఫర్లు

D2h వినియోగదారులు దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్‌ మీద పొందే ఉచిత ఆఫర్ ఇది ఒక్కటే కాదు. ఈ ప్లాన్ కాకుండా మరో 3 దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లు వినియోగదారులకు ఉచిత ఆఫర్లను అందిస్తున్నాయి. కాకపోతే ఇవి మూడు కూడా ఒకే రకమైన మరియు స్వభావం యొక్క ప్రయోజనంతో వస్తాయి. మొదటిది 3 నెలల రీఛార్జ్. ఒక కస్టమర్ 3 నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేసినప్పుడు వారు ఉచితంగా 7 రోజులపాటు అదనంగా అన్ని రకాల సేవలను పొందుతారు.

D2h 6నెలలు & 12నెలల లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫర్స్

D2h 6నెలలు & 12నెలల లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫర్స్

D2h వినియోగదారులు 6నెలలు మరియు 12నెలల చెల్లుబాటు కాలానికి కూడా ఒకే సారి రీఛార్జ్ చేయవచ్చు. 6 నెలల లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారుల కోసం డిటిహెచ్ ఆపరేటర్ అదనంగా తన సేవలను 15 రోజులపాటు ఉచితంగా అందిస్తుంది. అలాగే 1 సంవత్సరం చెల్లుబాటు కాలానికి కస్టమర్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకున్నప్పుడు అతను 30 రోజులపాటు అదనంగా అన్ని రకాల సేవలను ఉచితంగా పొందుతారు. కాబట్టి ఒక సంవత్సరం ప్రణాళికతో రీఛార్జ్ చేస్తే కస్టమర్ అదే ఖర్చుతో 13 నెలల సేవలను పొందుతున్నాడు.

D2h సెట్-టాప్ బాక్స్‌లు

D2h సెట్-టాప్ బాక్స్‌లు

D2h ఆపరేటర్ అందిస్తున్న ఆఫర్‌లను ఇష్టపడే వారు కొత్త కనెక్షన్ ను పొందాలనుకుంటే కనుక వారు ఎంచుకోవడానికి కొన్ని రకాల సెట్-టాప్ బాక్స్ (STB)లు అందుబాటులో ఉన్నాయి. ఈ డిటిహెచ్ ఆపరేటర్ మొత్తంగా తన వినియోగదారులకు ఐదు రకాల సెట్-టాప్ బాక్స్‌లను అందిస్తున్నాయి. ఇందులో మొదటిది రూ.1,499 ధర వద్ద లభించే డిజిటల్ STB. రెండవది డిజిటల్ HD STB దీని యొక్క ధర రూ.1,599. మూడవది HD RF STB, దీని ధర 1,799 రూపాయలు. మ్యాజిక్‌స్టిక్‌తో లభించే  HD RF STB, దీని ధర రూ.2,198. చివరిది ఆండ్రాయిడ్ STB- D2h స్ట్రీమ్ దీని యొక్క ధర 2,499 రూపాయలు.

Best Mobiles in India

English summary
D2h Operator Introducing New Free Service on 2 Months Recharge Plan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X