Home
News

Threads యాప్‌కు ఏమైంది.. గట్టి పోటీ ఇస్తుందనుకుంటే..!

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ (X)కు పోటీగా మెటా లాంచ్‌ చేసిన థ్రెడ్స్‌ యాప్‌ను జులై తొలివారంలో విడుదల చేసింది. ప్రారంభంలో భారీగా డౌన్‌లోడ్లు, సైన్‌అప్‌లు నమోదు చేసిన థ్రెడ్స్‌ యాప్‌ అనంతరం డీలా పడింది. జులై 31 తేది నాటికి రోజువారి యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 82 శాతానికి పడిపోయినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం రోజుకు కేవలం 8 మిలియన్‌ల యూజర్లు మాత్రమే థ్రెడ్స్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. గత నెలలో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఇదే అత్యంత తక్కువని నివేదిక తెలిపింది. గతంలో గరిష్ఠంగా 44 మిలియన్ల రోజువారీ యాక్టివ్‌ యూజర్లను కలిగి ఉండేది.

Threads daily active users count is down by 82 percent

థ్రెడ్స్‌ యాప్‌ ప్రారంభంలో స్క్రోలింగ్‌ సమయం 19 నిమిషాలపాటు ఉండేదని, ప్రస్తుతం ఆ సమయం కేవలం 2.9 నిమిషాలకు పడిపోయిందని నివేదిక తెలిపింది. ప్రారంభించిన తొలి రెండు వారాల్లో థ్రెడ్స్‌ యాప్‌ గణనీయంగా యూజర్లను సంపాదించింది. అనంతరం క్రమంగా పడిపోయింది. థ్రెడ్స్‌ ప్లాట్‌ఫాంపై మార్క్‌ జుకర్‌బర్గ్‌ కార్యకలాపాలు కూడా భాగా తగ్గాయి. యాప్‌ ప్రారంభంలో ఉన్నంత యాక్టివ్‌గా ప్రస్తుతం లేరు. గతంలో మాదిరిగా ఆర్గానిక్‌ పోస్టులను షేర్‌ చేయడం లేదు.

ట్విట్టర్‌లో తీసుకొచ్చిన భారీ మార్పులను తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు మెటా థ్రెడ్స్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. తొలివారంలోనే సుమారు 100 మిలియన్‌ల సైన్‌అప్‌లను నమోదు చేసింది. గతంలో వచ్చిన యాప్‌ల కంటే అతి తక్కువ కాలంలో ఆదరణ పొందింది. థ్రెడ్స్‌ యాప్‌ అతి తక్కువ కాలంలోనే ట్విట్టర్‌కు గట్టి పోటీ ఇస్తుందని టెక్‌ నిపుణులు భావించారు. అయితే ప్రస్తుతం రోజువారీ వినియోగదారుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది.

థ్రెడ్స్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉంటే సరిపోతుంది. ఆ వివరాలతోనే థ్రెడ్స్‌ యాప్‌లో సైన్‌అప్‌ అయ్యేందుకు అనుమతి ఇచ్చింది. ఇది కూడా థ్రెడ్స్‌ యాజర్ల సంఖ్య పెరిగేందుకు కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌కు బిలియన్‌కు పైగా యూజర్లు ఉన్నారు.

* ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక కీలక మార్పులు చేసిన ఎలాన్‌ మస్క్‌ ప్రస్తుతం రీబ్రాండ్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2012 నుంచి ఉన్న ట్విట్టర్‌ లోగోను మార్చేశారు. ఆ లోగో స్థానంలో Xను తీసుకొచ్చారు. ఇది వరకు ట్విట్టర్‌ను ఎక్స్‌కార్ప్‌లో విలీనం చేశారు. మరియు కొత్తగా X.com డొమైన్‌ను తీసుకొచ్చారు. X.com టైప్‌ చేస్తే ట్విట్టర్‌లోకి వెళ్లేలా మార్పులు చేశారు.

ట్వీట్టర్‌ను కొనుగోలు చేశాక.. ఒకరకంగా దానిపై ఎలాన్‌ మస్క్‌ ప్రయోగాలు చేశారు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ప్రముఖుల అకౌంట్లకు ఉన్న బ్లూటిక్‌ను తొలగించారు. అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. దాంతోపాటు బ్లూటిక్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాడు. తాజాగా కొన్నిరోజుల క్రితం ట్వీట్లకు పరిమితిని విధించాడు. దీనిపై నెటిజన్ల నుంచి భారీ అసంతృప్తి వ్యక్తం అయింది.

వెరిఫైడ్‌ ఖాతాల కలిగిన వ్యక్తులు రోజుకు పదివేల ట్వీట్లు, వెరిఫైడ్‌ ఖాతా లేకున్నా చాలా కాలం నుంచి ట్వీట్టర్‌ అకౌంట్‌ కలిగి వ్యక్తులు రోజుకు వెయ్యి ట్వీట్లు, కొత్తగా అకౌంట్‌ తెరిచి వెరిఫైడ్‌ అకౌంట్‌ లేకుంటే కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూడగలిగేలా మార్పులు చేశారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
daily active users decreased to 82 percent in twitter rival app threads
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X