Daiwa D50U1WOS 50-inch స్మార్ట్ టీవీ లాంచ్!! ఫీచర్స్ బ్రహ్మాండం.. ధర కూడా తక్కువే

|

స్మార్ట్ టీవీల వినియోగం ప్రస్తుతం రోజురోజుకి అధికమవుతున్నది. ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ టీవీలను మాత్రమే కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. చాలా సంస్థలు తమ యొక్క స్మార్ట్ టీవీలను ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లతో విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు డైవా కంపెనీ తన డైవా D50U1WOS స్మార్ట్ టీవీని నేడు భారతదేశంలో లాంచ్ చేశారు. ఇది LG యొక్క వెబ్‌ఓఎస్ టీవీని రన్ అవుతున్న మొదటి 4K టీవీగా పేర్కొంది.

Daiwa D50U1WOS

Daiwa D50U1WOS కూడా ThinQ AI మరియు మ్యాజిక్ రిమోట్‌తో వస్తుంది. ఇది అనేక LG స్మార్ట్ టీవీలతో కూడి ఉంటుంది. హెచ్‌డిఆర్ 10 సపోర్ట్, MEMC టెక్నాలజీ, డాల్బీ ఆడియో వంటి మరిన్ని ఫీచర్‌లతో పాటు 96 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగిన డైవా కొత్త స్మార్ట్ టివి క్వాడ్-కోర్ ప్రాసెసర్ మరియు మాలి జిపియుతో పనిచేస్తుంది. ఈ టీవీ యొక్క సరికొత్త ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మైక్రోసాఫ్ట్ హెచ్చరిక!! మీ విండోస్ PC సేఫ్ గా ఉండాలంటే ఈ అప్‌డేట్ ను వెంటనే చేయండి...మైక్రోసాఫ్ట్ హెచ్చరిక!! మీ విండోస్ PC సేఫ్ గా ఉండాలంటే ఈ అప్‌డేట్ ను వెంటనే చేయండి...

డైవా D50U1WOS సిరీస్‌లో మొట్టమొదటి స్మార్ట్ టీవీగా విడుదలయ్యే 50-అంగుళాల ఏకైక మోడల్‌ టీవీ యొక్క ధర 43,999 రూపాయలు. ఇది భారతదేశంలోని ప్రముఖ రిటైల్ దుకాణాలు మరియు అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Vi, Jio, Airtel యొక్క ప్లాన్‌లను మించిన ప్రయోజనాలతో బిఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్Vi, Jio, Airtel యొక్క ప్లాన్‌లను మించిన ప్రయోజనాలతో బిఎస్ఎన్ఎల్ రూ.447 ప్లాన్

Daiwa D50U1WOS స్పెసిఫికేషన్స్

Daiwa D50U1WOS స్పెసిఫికేషన్స్

Daiwa D50U1WOS 4K స్మార్ట్ టీవీ అనేది 50-అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇది 3,840x2,160 పిక్సెల్స్ పరిమాణంలో DLED A + గ్రేడ్ ప్యానెల్ మూడు వైపులా స్లిమ్ బెజెల్స్‌తో కలిగి ఉంటుంది. అలాగే దిగువ బాగాన డైవా బ్రాండింగ్‌తో కూడిన స్లిమ్ చిన్ ఉంది. ఈ టీవీ 16: 9 కారక నిష్పత్తి మరియు 1,000,000: 1 కాంట్రాస్ట్ రేషియోతో స్టాండర్డ్ 60HZ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు క్వాంటం లిమినిట్ + టెక్నాలజీతో వస్తుంది.

Daiwa D50U1WOS 4K స్మార్ట్ టీవీ

Daiwa D50U1WOS 4K స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది 1.1GHz వద్ద క్లాక్ చేయబడిన క్వాడ్-కోర్ ARM CA55 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది MALI G31 MP2 GPU తో జత చేయబడి ఉంటుంది. ఇది 1.5GB RAM మరియు 8GB స్టోరేజ్ లతో వస్తుంది. ఇది LG యొక్క వెబ్‌ఓఎస్ టీవీలో రన్ అవ్వడమే కాకుండా థిన్క్యూ AI వాయిస్ ఫీచర్లను కలిగి ఉంది. డైవా D50U1WOS ఈ టీవీ HDR10, HLG మరియు MEMC ఫీచర్‌లకు మద్దతును ఇస్తుంది. ఇది డాల్బీ ఆడియోకు మద్దతిచ్చే 20W బాక్స్ స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, Zee5, సోనీలివ్ మరియు ఇతర OTT సేవలకు ఎల్‌జి థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్ యాప్ నియంత్రణను టీవీ అనుమతిస్తుంది. ఇది యాప్ ను వాయిస్ నియంత్రణ కోసం ఉపయోగిస్తుంది, రిమోట్‌గా ఉపయోగిస్తుంది మరియు పరికరాలను నిర్వహిస్తుంది.

Best Mobiles in India

English summary
Daiwa D50U1WOS 50-inch 4K Smart TV Released in India With LG’s WebOS Support

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X