DALL-E 3కి చెక్ పెట్టిన డీప్‌సీక్.. జానస్ ప్రో 7B వచ్చేసింది..
DeepSeek Janus Pro 7B: చైనాకు చెందిన డీప్‌సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సంస్థ తాజాగా 'జానస్ ప్రో 7B' అనే సరికొత్త ఇమేజ్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఇది ఓపెన్ సోర్స్ మోడల్, అంటే ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. రీజనింగ్ మీద ఫోకస్ చేసిన 'డీప్‌సీక్-R1' మోడల్‌ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే, ఇప్పుడు ఈ ఇమేజ్ మోడల్‌తో డీప్‌సీక్ దుమ్ము రేపుతోంది.
ఈ జానస్ ప్రో 7B మోడల్, ఓపెన్ఏఐ కంపెనీకి చెందిన డాల్-E 3 మోడల్‌ను కూడా మించిపోయిందని డీప్‌సీక్ ఘంటాపథంగా చెబుతోంది. ఇది మామూలు విషయం కాదు. డాల్-E 3 అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలు సైతం పోటీ పడటానికి ఆలోచించే ఇమేజ్ జనరేషన్ టెక్నాలజీ.

అలాంటి టెక్నాలజీనే డీప్‌సీక్ అధిగమించిందని చెప్పడం నిజంగా సంచలనమే. డీప్‌సీక్ తన మునుపటి మోడల్స్‌లాగే, ఈ జానస్ ప్రో 7B ని కూడా ఓపెన్ సోర్స్‌గా విడుదల చేసింది. పైగా, ఇది MIT లైసెన్స్‌తో వస్తోంది. అంటే పరిశోధకులు, వ్యాపారాలు ఎవరైనా దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు.
ఇప్పటికే గిట్‌హబ్, హగ్గింగ్ ఫేస్‌లలో ఈ మోడల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. కాకపోతే, డీప్‌సీక్ ఇంకా దీనికి API (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) ని మాత్రం రిలీజ్ చేయలేదు. డిలీట్ చేశాక డెవలపర్లకు చాలా ప్రయోజనం ఉంటుంది. దీని కోసం డెవలపర్లు చాలా వెయిట్ చేస్తున్నారు.
* జానస్ ప్రో 7B ఎలా పనిచేస్తుందో తెలుసా
ఈ జానస్ ప్రో 7B మిగతా వాటితో పోలిస్తే చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది, పైగా ఇమేజ్ క్వాలిటీ కూడా అదిరిపోతుంది. విజువల్ ఎన్‌కోడింగ్‌ను రెండు వేర్వేరు మార్గాలుగా విభజిస్తూ, యూనిఫైడ్ ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్‌ను వాడటం దీని ప్రత్యేకత.
ఇమేజ్‌లను అర్థం చేసుకోవడానికి SigLIP-L విజన్ ఎన్‌కోడర్‌ను, ఇమేజ్‌లను జనరేట్ చేయడానికి 16 డౌన్ శాంపుల్ రేట్ ఉన్న టోకనైజర్‌ను ఉపయోగిస్తుంది. టెక్నికల్‌గా కొంచెం కష్టంగా అనిపించినా, సింపుల్‌గా చెప్పాలంటే ఇది చాలా తెలివైన టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ఇది చాలామందికి సహాయపడుతుంది.
* పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బెంచ్‌మార్క్ స్కోర్లు ఏంటి..
డీప్‌సీక్ కంపెనీ ఈ జానస్ ప్రో 7B మోడల్‌ను చాలా బెంచ్‌మార్క్‌లలో పరీక్షించింది. వాటిలో ముఖ్యమైనవి రెండు అందులో మొదటిదైన జెన్ఇవల్ (GenEval) టెస్ట్ లో 80% స్కోరు సాధించింది. రెండోది అయిన DPG-Bench లో 84.2% స్కోరు చేసింది. ఈ టెస్టుల్లో జానస్ ప్రో 7B, డాల్-E 3, స్టేబుల్ డిఫ్యూజన్ కంటే కూడా మెరుగ్గా పనిచేసిందని డీప్‌సీక్ చెబుతోంది.
అయితే, స్వతంత్ర సంస్థలు, నిపుణులు దీన్ని టెస్ట్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే చైనా కొన్ని గణాంకాలు ఎక్కువ చేసి లేదా అతి చేసి చెప్పినా సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికప్పుడే ఈ స్కోర్లను నమ్మలేము. అలాగే రాబోయే రోజుల్లో దీని రియల్-వరల్డ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
* పెర్‌ప్లెక్సిటీలో డీప్‌సీక్-R1 కూడా వచ్చేసింది..
పెర్‌ప్లెక్సిటీ అనే AI సెర్చ్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు డీప్‌సీక్-R1 మోడల్‌కు కూడా సపోర్ట్ చేస్తోంది. ఇంతకుముందు వీళ్లు ఓపెన్ఏఐ o1 AI మోడల్‌కు మాత్రమే సపోర్ట్ చేసేవారు. పెర్‌ప్లెక్సిటీ CEO అరవింద్ శ్రీనివాస్, డీప్‌సీక్-R1 మోడల్‌ను "ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రీజనింగ్ మోడల్" అని పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రస్తుతానికి యూజర్లు లిమిటెడ్ ఔట్‌పుట్‌లను మాత్రమే జనరేట్ చేయగలరు, కానీ పెర్‌ప్లెక్సిటీ ఈ లిమిట్‌ను పెంచడానికి ప్లాన్ చేస్తోంది. డేటా చైనాకు వెళ్తుందనే ఆందోళనలు ఉండటంతో, డీప్‌సీక్-R1 ని అమెరికాలోనే హోస్ట్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
* డీప్‌సీక్ ఎదుగుదలపై ఓపెన్ AI సీఈఓ
డీప్‌సీక్ కంపెనీ ఇంత వేగంగా ఎదగడంపై ఓపెన్ AI CEO సామ్ ఆల్ట్‌మన్ ఎట్టకేలకు స్పందించారు. R1 మోడల్ చాలా "ఇంప్రెసివ్"గా ఉందని, అది కూడా తక్కువ ధరలో తయారు చేయడం గొప్ప విషయమని అన్నారు. డీప్‌సీక్ R1 మోడల్‌ను కేవలం 6 మిలియన్ డాలర్ల కంటే తక్కువ ఖర్చుతోనే తయారు చేసిందని చెబుతోంది.
కానీ ఓపెన్ఏఐ o1 API మాత్రం చాలా ఖరీదైనది. డీప్‌సీక్ తమకు గట్టి పోటీదారు అని ఆల్ట్‌మన్ అంగీకరించారు, కానీ తాము త్వరలోనే మరింత మెరుగైన మోడళ్లను విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంటే మున్ముందు AI టెక్నాలజీలో పోటీ మరింత రసవత్తరంగా ఉండబోతోంది.


Click it and Unblock the Notifications








