హల్‌చల్ చేస్తున్న డేంజరస్ యాప్స్, గూగుల్ పరేషాన్

By Gizbot Bureau
|

టెక్ దిగ్గజం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నప్పటీకీ దానికి కొన్ని సమస్యలు తప్పడం లేదు. ముఖ్యంగా గూగుల ప్లే స్టోర్ లో ఫేక్ యాప్స్ అనేది పెద్ద సమస్యగా పరిణమించాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి వస్తూనే ఉన్నాయి. హానికరమైన యాప్స్‌ను తొలగించేందుకు గూగుల్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డేంజరస్‌ యాప్స్‌ హల్‌ చల్‌ చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన ప్రకారం గూగుల్‌ ప్లే స్టోర్‌లో వీటి సంఖ్య పెరుగుతూనే ఉందని తెలుస్తోంది. వీటి నిరోధానికి ఎంత కృషి చేస్తున్నప్పటికీ, మరిన్ని యాప్స్‌ రంగంలోకి దిగుతున్నాయని ఈఎస్‌ఈటీ భద్రతా పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో తన విశ్లేషణలో బహిర్గతం చేశాడు.

172 హానికరమైన యాప్స్
 

172 హానికరమైన యాప్స్

ప్రమాదకరమైన ఈ గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్‌ ప్లే స్టోర్‌లో వేగంగా పెరుగుతున్నాయని లుకాస్ స్టెఫాంకో నివేదించారు. ఈ యాప్స్‌లోని మాలావేర్‌ లక్షలాది వినియోగదారులను చేరిందని ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఈ క్రమంలో దాదాపు 172 హానికరమైన యాప్స్ ను గుర్తించినట్టు తెలిపారు.

335 మిలియన్లకు పైగా వినియోగదార్లు

335 మిలియన్లకు పైగా వినియోగదార్లు

ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే వీటిని 335 మిలియన్లకు పైగా వినియోగదార్లు ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టు చెప్పారు. ఇటువంటి యాప్స్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేకుండా చేయాలని గూగుల్ ప్లే స్టోర్ చర్యలు తీసుకుంటున్నా ఇవి మాత్రం వస్తూను ఉన్నాయని ఆయన తెలిపారు.

మరింత అప్రమత్తంగా

మరింత అప్రమత్తంగా

ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడం, యాప్ ఇన్ స్టాల్ చేసుకునే ముందు దాని మూలాలు తెలుసుకోవడం వంటివి తప్పనిసరిగా గుర్తించాలని తెలిపారు. దీంతో పాటు వెబ్‌లో బ్రౌజ్ చేసేటప్పుడు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టెఫాంకో హెచ్చరిస్తున్నారు.

తొలగించడమే పనిగా పెట్టుకున్న గూగుల్
 

తొలగించడమే పనిగా పెట్టుకున్న గూగుల్

కాగా ఇప్పటికే ప్లే స్టోర్‌లో ఉన్న ప్రమాద‍కరమైన అప్లికేషన్లను గూగుల్ చాలా సార్లు తొలగించింది. ఈ ఏడాది జనవరిలో ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ ద్వారా డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని వాటిని తొలగించివేసింది. గూగుల్‌ ఇలా హానికారక యాప్‌లను తొలగించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబరులో 13, డిసెంబరులో మరో 22 ఫేక్‌ యాప్‌లను తొలగించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Dangerous apps on Play Store reach 300 million users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X