మన డేటా మన దగ్గరే ఉండాలి, దేశీ కంపెనీలకు పెను ముప్పు

By Gizbot Bureau
|

దేశంలో ఈ కామర్స్ కంపెనీలు మరో ఏకమయ్యాయి. మన డేటా మన దగ్గరే ఉండాలి కాని విదేశాల్లో ఉండటం ఏంటి అనే అంశాన్ని లేవనెత్తుతున్నాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌తో సమావేశమైన ఈ కామర్స్ అధినేతలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశీ యూజర్ల డేటా... మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాలని, ఇతర దేశాల్లో దీన్ని భద్రపర్చడం శ్రేయస్కరం కాదని ఈ–కామర్స్‌ కంపెనీలు అభిప్రాయపడ్డాయి.

మన డేటా మన దగ్గరే ఉండాలి, దేశీ కంపెనీలకు పెను ముప్పు

 

ఈ–కామర్స్‌లో విదేశీ పత్య్రక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌తో సమావేశమైన వివిధ డిజిటల్‌ కామర్స్‌ కంపెనీల ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశారు.

సమాన అవకాశాలు ఎక్కడ ?

సమాన అవకాశాలు ఎక్కడ ?

ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ దేశీ వినియోగదారుల డేటాను దేశ ప్రయోజనాలకు తోడ్పడేలా ఉపయోగించాలని ఈ సమావేశంలో తెలిపారు. మరోవైపు, దేశీ ఈకామర్స్‌ కంపెనీలకు, విదేశీ ఈ కామర్స్‌ సంస్థలకు నిబంధనలు వేర్వేరుగా ఉండటం వల్ల కంపెనీలు సమాన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయని మరో డిజిటల్‌ కామర్స్‌ కంపెనీ ప్రతినిధి తెలిపారు.

దేశీ కంపెనీలకు ముప్పు

దేశీ కంపెనీలకు ముప్పు

విదేశీ సంస్థల నుంచి దేశీ కంపెనీలకు పొంచి ఉన్న ముప్పు, అందరికీ సమాన అవకాశాల కల్పన, వివక్షపూరిత విధానాలు మొదలైన అంశాలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. తదుపరి మరింత వివరాలేమైనా ఇవ్వదల్చుకుంటే వచ్చే వారం తెలియజేయాలంటూ మంత్రి ఈ-కామర్స్‌ సంస్థల వర్గాలకు సూచించారు. జాతీయ ఈ-కామర్స్‌ విధానాన్ని ఖరారు చేసే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలతో మంత్రి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎఫ్‌డీఐ కొత్త పాలసీ విధానం
 

ఎఫ్‌డీఐ కొత్త పాలసీ విధానం

దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కొత్త పాలసీ విధానం అమల్లోకి రావడంతో రానున్న రోజుల్లో ఆన్ లైన్ మార్కెట్ కు భారీ దెబ్బ తగలనుంది. దీంతో దేశంలో సగానికిపైగా స్మార్ట్ ఫోన్ సేల్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. వచ్చే మూడేళ్లలో అమెజాన్ లో నష్టాలు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. 2018లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు జోరుగా సాగడంతో భారత్ ఆన్ లైన్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో 36 శాతానికి చేరింది.

 నిబంధనలు సరైనవే

నిబంధనలు సరైనవే

ఇదిలా ఉంటే విదేశీ పెట్టుబడులు గల ఈ- కామర్స్‌ కంపెనీల విషయమై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. ఈ-కామర్స్‌ సంస్థలు కారు చౌక రేట్లతో స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్‌ 2019 స్టార్టప్స్‌ సదస్సులో మోహన్ దాస్ పాయ్ చెప్పారు. ఈ-కామర్స్‌ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, అవి కొంత సముచితమేనన్నారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లు ఉన్న ఈ-కామర్స్‌ కంపెనీలు తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ-కామర్స్ నిబంధనలు 2019 ఫిబ్రవరి నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్‌ ఇండియా ప్లాట్‌ఫాంపై నాలుగు లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి.

ఖాతాదారులకు మెరుగైన సేవలు

ఖాతాదారులకు మెరుగైన సేవలు

నిబంధనలు కఠినం చేసినా భారత మార్కెట్‌పై తాము ఆశావహంగానే ఉన్నట్లు అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌ తెలిపింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్‌ ఏషియా రీజనల్‌ సీఈవో డర్క్‌ వాన్‌ డెన్‌ బెర్గీ తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Data of consumers should be used for benefit of local economy: Indian e-commerce players

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more