డేటా ప్రొటెక్షన్ చట్టం అంటే ఏమిటి..?? ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది...

|

వాట్సాప్ మాత్రమే కాకుండా చాలా కంపెనీలు వినియోగదారుల డేటాను సేకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చాలా నివేదికలు తెలిపాయి. సెలెబ్రటీల యొక్క డేటా కూడా లీక్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాట్సాప్ ప్రైవసీ విధానంను అప్ డేట్ చేయమని తెలుపడంతో చాలా మంది ప్రత్యాన్మాయ యాప్ లను కూడా చూసారు. అయితే ఇటువంటి సమస్యలకు చెక్ చెప్పడం కోసం కొత్తగా డేటా ప్రొటెక్షన్ చట్టంను అమలులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు తమ వద్ద ఉన్న వ్యక్తిగత డేటాపై ఆధారపడతాయి మరియు మరికొన్ని విషయాలపై ఆ డేటాను ప్రకటనదారులకు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతాయి.

పార్లమెంటు సెలెక్ట్ కమిటీ

పార్లమెంటు సెలెక్ట్ కమిటీ ఇంకా డేటా ప్రొటెక్షన్ లాపై పనిచేస్తోందని ఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ట్వీట్ చేశారు. ఈ చట్టం వినియోగదారుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల యొక్క డేటాను సేకరించేవారు లేదా ప్రాసెసర్‌లలో ఏదైనా పాలసీని ఉల్లంఘిస్తే జరిమానా విధించమని మార్గనిర్దేశం చేస్తుంది.

 

OnePlus Nord CE 5G ఫోన్ జూన్ 10న రానున్నది!! ఫీచర్స్ లీక్ అయ్యాయి...OnePlus Nord CE 5G ఫోన్ జూన్ 10న రానున్నది!! ఫీచర్స్ లీక్ అయ్యాయి...

వ్యక్తిగత డేటా

వినియోగదారులు తమ యొక్క వ్యక్తిగత డేటాను అనేక సోషల్ మీడియా యాప్ లలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు వినియోగదారుల యొక్క డేటాను భద్రపరచడానికి సంబంధించి ఎటువంటి నియమాలు లేదా విధానాలు అందుబాటులోలేవు. డేటా ప్రొటెక్షన్ చట్టంపై పార్లమెంటు కమిటీ తన నివేదికను ఖరారు చేసిన తర్వాత భారతీయ వినియోగదారుల వ్యక్తిగత డేటా అంతా సురక్షితంగా మరియు నిర్దిష్ట మార్గదర్శకాలలో స్టోర్ అయ్యి ఉండేలా ప్రభుత్వం నిర్ధారిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

కొత్త Income Tax వెబ్సైటు లాంచ్ అయింది ! కొత్తగా వచ్చిన ఫీచర్లు చూడండి.కొత్త Income Tax వెబ్సైటు లాంచ్ అయింది ! కొత్తగా వచ్చిన ఫీచర్లు చూడండి.

డేటా ప్రొటెక్షన్ చట్టం పరిధిలో ఉన్న ప్రాంతాలు

డేటా ప్రొటెక్షన్ చట్టం పరిధిలో ఉన్న ప్రాంతాలు

PTI యొక్క నివేదిక ప్రకారం డేటా ప్రొటెక్షన్ చట్టం అనేది కంపెనీ / సంస్థకు డేటాను అందించడంలో వినియోగదారు యొక్క సమ్మతి, యాప్/ వెబ్‌సైట్ వినియోగదారు నుండి ఎటువంటి డేటాను తీసుకోగలదు, డేటాను ప్రాసెస్ చేసే విధానాలు, వ్యక్తిగత హక్కులు , మంజూరు చేయగల మినహాయింపులు వంటి మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది.

వాట్సాప్

ఈ ఏడాది జనవరిలో వాట్సాప్ కొత్త గోప్యతా విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత భారత ప్రభుత్వం కొత్త డేటా రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఈ సోషల్ మీడియా అప్లికేషన్ యొక్క కొత్త గోప్యతా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం వినియోగదారుల యొక్క వ్యక్తిగత డేటాను సేకరించి ఫేస్‌బుక్‌లో షేర్ చేయడమే.

డేటా ప్రొటెక్షన్ చట్టం

ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్ చట్టం అందుబాటులో లేనందున ప్రభుత్వం మరియు న్యాయస్థానాలు ఈ విషయంలో ఎటువంటి దిశను కలిగి లేవు. యూరప్‌లో నివసిస్తున్న వాట్సాప్ వినియోగదారులకు ఈ గోప్యతా విధానాన్ని అమలు చేయలేక పోయింది. ఎందుకంటే అక్కడ వినియోగదారుల డేటాను పరిరక్షించే విధానం అందుబాటులో ఉంది. అయితే ఈ విధానానికి సంబంధించి భారతదేశంలో ఎటువంటి విధానం లేనందున వాట్సాప్ భారతీయుల డేటాను సేకరించే గోప్యతా విధానాన్ని అమలు చేయగలదు.

చాలా కంపెనీలు

వాట్సాప్ మాత్రమే కాకుండా చాలా కంపెనీలు వినియోగదారుల డేటాను సేకరించడానికి ప్రయత్నిస్తున్నందున కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం యొక్క అవసరం అధికంగా ఉంది. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ఉచిత ప్లాట్‌ఫారమ్‌లు తమ వద్ద ఉన్న వ్యక్తిగత డేటాపై ఆధారపడడమే కాకుండా మరికొన్ని విషయాలపై ఆ డేటాను ప్రకటనదారులకు అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతాయి. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాట్సాప్ తన గోప్యతా విధానాన్ని ఉపసంహరించుకోవలసి వస్తుంది. డేటా ప్రొటెక్షన్ చట్టంను ప్రభుత్వం ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో అన్న స్పష్టమైన సమాచారం లేదు.

Best Mobiles in India

English summary
Data Protection Law is Coming Very Soon!! IT Minister Giving Explanations

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X