రూ.3000లకే 4జీ ఫోన్, 12 నెలలు ‘ఫ్రీ ఇంటర్నెట్’తో

Written By:

తక్కువ ధరల్లో టాబ్లెట్ కంప్యూటర్లతో పాటు స్మార్ట్ ఫోన్ లను అందిస్తోన్న ప్రముఖ దేశవాళీ కంపెనీ Datawind రూ.3000లకే 4జీ ఫోన్ ను అందించే ప్రయత్నం చేస్తోంది. 2016లో మార్కెట్లోకి రాబోతున్న ఈ ఫోన్ 4జీ మార్కెట్లో ప్రకంపనలు రేపుతోంది.

మీ ఫోన్‌‌లో 'IMEI' నెంబర్ తెలుసుకోవాలంటే..?

రూ.3000లకే 4జీ ఫోన్, 12 నెలలు ‘ఫ్రీ ఇంటర్నెట్’తో

మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఈ ఫోన్ కొనుగోలు పై ఏడాది పాటు ఉచిత 4జీ ఇంటర్నెట్ ను కంపెనీ ఆఫర్ చేయబోతోంది. ఈ ఫోన్ లాంచ్ కు సంబంధించిన వివరాలను డేటావిండ్ సంస్థ సంస్థల సీఈఓ సునీత్ సింగ్ టులి పీటీఐకు వెల్లడించారు. ఏడాది పాటు ఉచితంగా అందించే ఈ ఇంటర్నెట్ ద్వారా కేవలం బ్రౌజింగ్ చేసుకుని వీలు మాత్రమే ఉంటుంది.

మీరు వెదుకుతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవేనా..?

రూ.3000లకే 4జీ ఫోన్, 12 నెలలు ‘ఫ్రీ ఇంటర్నెట్’తో

డౌన్‌లోడ్స్ , వీడియోస్ వంటివి ఈ ఆఫర్‌లో వర్తించవు. ఈ ఫోన్ లో మీరు ఏ మొబైల్ నెట్ వర్క్ ను యాక్టివేట్ చేసుకున్నా ఫ్రీ ఇంటర్నెట్ వర్తిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కు సంబంధించి ప్రస్తుతాని ఏ విధమైన సమాచారం లేదు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

English summary
Datawind planning to launch 4G handset priced under Rs 3,000
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot