రూపాయికే అన్‌లిమిటెడ్ డేటా, అదిరే ఆఫర్ దిశగా Bsnl..

Written By:

దేశీయ టెలికాం దిగ్గజాలను ఢీకొట్టేందుకు Bsnl శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రూపాయికే అన్ లిమిటెడ్ డేటాను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. రోజుకు కేవలం ఒక్క రూపాయితో అపరిమిత డేటాను అందించేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కెనడాకు చెందిన డేటా విండ్ సంస్థతో ఒప్పందం కుదర్చుకోనుంది. నెలకు రూ. 30 ఖర్చుతో డేటావిండ్ స్మార్ట్ ఫోన్లలో నెలంతా అన్ లిమిటెడ్ డేటాను ఆస్వాదించవచ్చని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ తో డీల్ చివరి దశకు వచ్చిందని, ఫిబ్రవరి నెలాఖరులోగా ఈ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఇదే జరిగితే ముందు ముందు టారిఫ్ పోటీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 186 ప్లాన్

జియో రూ.149ని టార్గెట్ చేస్తూ ఈ ఆఫర్ వచ్చింది. ఇందులో unlimited local/STD and roaming calls మీకు 28 రోజులు పాటు ఉచితంగా లభిస్తాయి. BSNL's website - bsnl.co.in ప్రకారం రోజుకు 1జిబి డేటాతో మీకు లభిస్తుంది.

జియో 149 ప్లాన్లో..

అదే జియో 149 ప్లాన్లో 28 రోజులు పాటు అపరిమిత కాల్స్ తో పాటు రోజుకు 1జిబి డేటా చొప్పున 28 రోజులు పాటు లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి. దీంతో పాటు జియో రూ.153 ప్లాన్లో కూడా ఇవే బెనిపిట్స్ లభిస్తాయి..అయితే ఈ ప్లాన్లో డేటా పరిమితి అయిపోయిన తరువాత స్పీడ్ 64kbpsకి పడిపోతుంది.

రూ. 249 ప్లాన్

దీంతో పాటు Bsnl రూ. 249 ప్లాన్లో కొన్ని మార్పులు చేసింది. BSNL's websiteలో పొందుపరిచిన వివరాల ప్రకారం ఇది బ్రాడ్ బాండ్ యూజర్లకు లభిస్తుంది. unlimited internet ఇందులో ఉంటుంది. 5జిబి వరకు download speed up to 8 Mbps ఉంటుంది. ఆ తరువాత స్పీడ్ 1 Mbpsకి పడిపోతుంది.

మార్చి 31 వరకు అందుబాటులో..

కాగా ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ప్లాన్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే. సేమ్ ప్లాన్ FTTH (fiber-to-the-home)లో కూడా ఉంటుంది. Installation ఛార్జీలు ప్రమోషన్ సమయంలో మాఫీ చేయబడతాయి.

వినియోగదారులు..

కాకుంటే వినియోగదారులు BSNL's ADSL Modemను రూ. 1250 పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుందని ట్విట్టర్లో తెలిపింది. కాగా ఈ మధ్య 43 శాతం నుండి 50 శాతం వరకు డేటాపరిమితిని ప్లాన్లలో పెంచిన విషయం తెలిసిందే. హ్యాపీ ఆఫర్ పేరిట ఇది అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Datawind Plannings To Offer Unlimited Internet At Rs 1 With Bsnl More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot