DD కిసాన్ ఛానల్‌లో ఇక AI యాంకర్‌లు.. 50 భాషల్లో వార్తలు... రేపటి నుంచే..!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ఒకరకంగా విప్లవాత్మక మార్పులకు కారణం అవుతోంది. మీడియా రంగాన్ని కూడా AI ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే వివిధ ఛానళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ లను (AI News Anchors) అందుబాటులోకి తీసుకొచ్చాయి.
DD కిసాన్ ఆర్టిఫిషియల్ యాంకర్ :
తాజాగా డీడీ కిసాన్ (DD kisan) ఛానల్ కూడా ఏఐ యాంకర్ సేవలను ప్రారంభించనుంది. ఛానల్ తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మే 26వ తేదీన ఏఐ యాంకర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఏఐ క్రిష్ (AI Krish), ఏఐ భూమి (AI Bhoomi) పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ లు పరిచయం చేయనుంది. దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించనుంది.

24/7 సేవలకు ఏఐ యాంకర్ :
న్యూస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో యాంకర్ లను కలిగి ఉన్న తొలి ప్రభుత్వ న్యూస్ ఛానల్‌గా డీడీ కిసాన్ గుర్తింపు పొందనుంది. న్యూ్స్ చదివేందుకు నిరంతరం ఈ AI యాంకర్‌ల సేవలను వినియోగించుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అన్ని రాష్ట్రాల్లోనూ ఏఐ యాంకర్ వార్తలు :
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వినియోగదారుల ఈ ఏఐ యాంకర్ లు చదివే న్యూస్‌లను చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. దేశంలో వ్యవసాయంపై జరిగే పరిశోధనలు మరియు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులు,వాతావరణ సమాచారం, ప్రభుత్వ పథకాలు సహా ఇతర సంబంధిత సమాచారాన్ని ఈ ఏఐ యాంకర్‌ల న్యూస్ బులిటెన్ ద్వారా పొందవచ్చు.
50 భాషల్లో వార్తలు చదవగలరు :
ఈ ఏఐ యాంకర్‌లు AI క్రిష్, AI భూమి.. 50 భాషల్లో వార్తలను చదవగలరని తెలుస్తోంది. ఈ డీడీ కిసాన్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం వివిధ కథనాలు, వార్తలను అందిస్తోంది. ఈ ఛానల్ మే 26, 2015 న ప్రారంభం అయింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం చేరవేసే లక్ష్యంతో ఈ ఛానల్‌ను ప్రారంభించారు.
మరిన్ని ఛానళ్ల ఏఐ యాంకర్‌లు :
ఇప్పటికే అనేక ప్రైవేటు మీడియా ఛానళ్లు ఏఐ యాంకర్ లను కలిగి ఉన్నాయి. ఇండియా టుడే ఏఐ యాంకర్ సనాను 2023లో లాంచ్ చేసింది. అదే విధంగా ఒడిశాకు చెందిన OTV ఏఐ న్యూస్ యాంకర్ లిసాను లాంచ్ చేసింది. ఈ లిసా ఒడియా మరియు ఇంగ్లీష్‌లో వార్తలను అందిస్తుంది. న్యూస్18 ఏఐ కౌర్, పవర్ టీవీ ఏఐ యాంకర్ సౌందర్య ఉన్నారు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








