HP ల్యాప్‌టాప్ వాడుతున్నారా..?, మీకు 90 రోజుల పాటు జియో 4జీ ఉచితం

|

తాజా పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ రిటైల్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్న HP తన ల్యాప్‌‍టాప్, డెస్క్‌టాప్ యూజర్లకు 90 రోజుల పాటు అన్ లిమిటెడ్ రిలయన్స్ జియో 4జీ ఆఫర్ చేస్తోంది. ఈ జియో ప్రివ్యూ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు LYF అందిస్తోన్న JioFi డివైస్‌ను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. రూ.2,899 ధర ట్యాగ్‌తో లభ్యమవుతోన్న ఈ JioFi డివైస్‌ను కొనుగోలు చేయటం ద్వారా మొదటి 90 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.

 HP ల్యాప్‌టాప్ వాడుతున్నారా..?, మీకు 90 రోజుల పాటు జియో 4జీ ఉచితం

Read More : టెక్నాలజీ గురించి అరుదైన నిజాలు!

ఈ ఆఫర్‌కు సంబంధించి HP ఇప్పటికే ఓ ఇన్విటేషన్ లెటర్‌తో కూడిన ఓ ప్రత్యేకమైన redemption codeను తమ కస్టమర్‌లకు పంపింది. యూజర్లు ఈ కోడ్‌తో పాటు సంబంధింత ధృవీకరణ పత్రాలను తీసుకుని సమీపంలోని రిలియన్స్ రిటైల్/ రిలయన్స్ డిజిటల్/ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లకు వెళ్లటం ద్వారా LYF JioFi డివైస్‌ను సొంతం చేసుకుని ఆపై ఉచిత 4జీ ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు.

 యూఎస్బీ డాంగిల్స్‌

యూఎస్బీ డాంగిల్స్‌

కమ్యూనికేషన్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో వైర్‌లెస్ ఇంటర్నెట్ డివైస్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యూఎస్బీ డాంగిల్స్‌ను యువత విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. పెన్‌డ్రైవ్ తరాహాలో ఉండే యూఎస్బీ ఇంటర్నెట్ మోడెమ్‌లను ల్యాప్‌టాప్ అలానే డెస్క్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేసుకోవచ్చు. పలు సందర్భాల్లో కనెక్షన్ సమస్యలు కారణంగా ఈ డాంగిల్స్ మోరాయిస్తుంటాయి. ఇలాంటపుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవటం కష్టతరమవుతుంటుంది. యూఎస్బీ డాంగిల్స్‌లో తలెత్తే కనెక్షన్ సమస్యలను పరిష్కరించేందుకు పలు చిట్కాలు...

టిప్ 1

టిప్ 1

డేటా కార్డ్ సిమ్ కార్డ్ స్లాట్‌లో సిమ్ కార్డ్‌ను సరిగ్గా ఇన్‌‌సర్ట్ చేసారో లేదో చెక్ చేసుకోండి.

టిప్ 2

టిప్ 2

మీ సిస్టంకు యూఎస్బీ డాంగిల్‌ను ప్లగ్ చేసిన తరువాత కనెక్షన్ రికగ్నైజ్ కానట్లయితే సిస్టం నుంచి డాంగిల్ సాఫ్ట్‌వేర్‌ను తొలగించి మరోసారి ఇన్‌స్టాల్ చేసి చూడండి.

టిప్ 3

టిప్ 3

మీ సిస్టం యూఎస్బీ పోర్ట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి.

టిప్ 4

టిప్ 4

డేటా కార్డ్ కనెక్షన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అవుతున్నట్లయితే సదరు యూఎస్బీ మోడెమ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగినై డేటా కార్డ్ సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి.

టిప్ 5

టిప్ 5

డాంగిల్ ఇంటర్నె‌ట్‌కు కనెక్ట్‌ కాని పక్షంలో డేటా కార్డ్ సిగ్నల్‌ను చెక్ చేయండి.

టిప్ 6

టిప్ 6

డేటా కార్డ్‌లోని కనెక్షన్ సాఫ్ట్‌వేర్ దెబ్బతిన్న పక్షంలో మోడెమ్ పనితీరు దెబ్బతినే అవకాశముంది.

టిప్ 7

టిప్ 7

డేటా కార్డ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన తరువాత కొన్ని సందర్భాల్లో బ్రౌజర్‌లో ఓపెన్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో మీ బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్‌లైన్ మోడ్‌ను డిసేబుల్ చేసినట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

టిప్ 8

టిప్ 8

డేటా కార్డ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాని పక్షంలో డాంగిల్ ఇంటర్‌ఫేస్‌ను పరీక్షించండి.

Best Mobiles in India

English summary
DEAL Alert: Get FREE Unlimited Jio 4G Offer on Purchase of HP Laptops. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X