అలా వీడియో కాల్ చేసి.. రూ.207 కోట్లు కొట్టేశారు.. వారం రోజుల వరకు ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ (Deepfake) కారణంగా ఇటీవల కాలంలో అనేక సమస్యలు వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీ ఆధారంగా అనేక మందిని మోసం చేస్తున్నారు. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు మాదిరిగా వీడియో కాల్స్ చేసి వారిని మోసం చేసిన అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఓ సంస్థనే మోసం చేశాడు. ఏకంగా రూ.207 కోట్లను దోచుకున్నారు.
హాంకాంగ్ ఆధారిత MNCలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అధునాతన డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి భారత కరెన్సీ ప్రకారం రూ.207 కోట్లు తన ఖాతాలను ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు (MNC lost RS207 crore deepfake video call). అసలు స్కామ్ ఎలా జరిగిందంటే?.

హాంకాంగ్ ఆధారిత సంస్థలోని ఫైనాన్స్ విభాగం ఉద్యోగికి.. సంస్థ యూకే విభాగం చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా (CFO) చెప్పుకున్న వ్యక్తి నుంచి మెసెజ్ వచ్చింది. అందుకు అనుగుణంగా సదరు ఉద్యోగి.. CFO సహా మిగిలిన సిబ్బందితో ఓ వీడియో కాల్ ఏర్పాటుచేశాడు. ఈ వీడియో కాల్‌లో సదరు ఉద్యోగికి హాంకాంగ్‌కు చెందిన బ్యాంక్ అకౌంట్లకు భారత కరెన్సీ ప్రకారం రూ.207 కోట్లను బదిలీ చేయమని ఆదేశాలు వచ్చాయి.
మొత్తం 15 లావీదేవీల్లో ఈ మొత్తాన్ని బదిలీ చేశారు. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజుల వరకు ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. అనంతరం సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులకు అనుమానం రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన హాంకాంగ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంస్థ, ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వీడియో, ఆడియో ఆధారంగా డీప్‌ఫేక్‌ను రూపొందించారని పోలీసులు గుర్తించారు. అయితే వీడియో కాల్‌లో పాల్గొన్న ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారని తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగంపై మరింత ఆందోళన పెంచుతున్నాయి. ఇటీవలే భారత్‌కు చెందిన అనేక మంది ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ జాబితాలో రష్మిక మందాన్న, ఆలియా భట్, కత్రినా కైఫ్ వంటి వారున్నారు. అక్షయ్ కుమారు, సచిన్ వంటి వారు బాధితులుగా ఉన్నారు. అయితే ప్రభుత్వం స్థాయిలో సోషల్ మీడియా సంస్థలకు కీలక నోట్‌ను జారీ చేసింది. తన ప్లాట్‌ఫాంలలో ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోల షేరింగ్‌పై చర్యలు తీసుకోవాలని, మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications