Home
News

WhatsApp గ్రూప్ చాట్ కారణంగా డ్రగ్స్ కోణంలో NCB విచారణకు దీపికా పదుకునే

ప్రముఖ బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత బాలీవుడ్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాదకద్రవ్యాలు(డ్రగ్స్) వినియోగించారు అనే కోణంలో చాలా మంది NCB వర్గాలు విచారిస్తున్నాయి. ముంబైకి చెందిన NCB కి దొరికిన మరొక గొప్ప అస్త్రం "వాట్సాప్ గ్రూప్" ఇందులో డ్రగ్స్ కు సంబంధించి చర్చలు జరిపినట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్ కోణానికి సంబంధించి బాలీవుడ్‌ నటులు దీపిక, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్‌లను విచారణకు సహకరించమని ఇప్పటికే నోటీసులను పంపారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ గ్రూపు అడ్మిన్ గా దీపికా పదుకునే

వాట్సాప్ గ్రూపు అడ్మిన్ గా దీపికా పదుకునే

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత  డ్రగ్స్ కోణంలో నటి రియా చక్రవర్తిని విచారిస్తున్నప్పుడు అనుమానాస్పదంగా ఉన్న వాట్సాప్ గ్రూపును పరిగణలోకి తీసుకున్నప్పుడు అది బాలీవుడ్ నటుడు స్వయంగా నిర్వహిస్తున్నట్లు ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. జయ సాహా చాట్ గ్రూపులో "అడ్మిన్" గా కూడా ఉన్నారు. ఇందులో బాలీవుడ్‌ నటులు ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో మాదకద్రవ్యాల గురించి చర్చించినట్లు ఉన్నాయి.  

డ్రగ్స్ కోణంలో NCB విచారణ

డ్రగ్స్ కోణంలో NCB విచారణ

ఈ డ్రగ్స్ కోణంలో గురువారం ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టను ముంబైలోని ఎన్‌సిబి కార్యాలయంలో విచారించారు. KWAN టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలో పనిచేస్తున్న కరిష్మా ప్రకాష్‌ను కూడా ఈ వారంలో విచారించనున్నారు. ఈ విషయంలో ప్రశ్నించేందుకు క్వాన్ సీఈఓ ధ్రువ్ చిట్గోపేకర్ మరియు సినీ నిర్మాత మధు మంతేనా కూడా ఎన్‌సీబీ ముందు హాజరయ్యారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శ్రుతి మోడిని కూడా ఈ కేసులో ఎన్‌సిబి గతంలో ప్రశ్నించింది.

NCB దర్యాప్తులో బాలీవుడ్ నటులు

NCB దర్యాప్తులో బాలీవుడ్ నటులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ID) నుండి అధికారిక సమాచార మార్పిడి అందుకున్న తరువాత NCB దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో మాదకద్రవ్యాల వినియోగం, సేకరణ, వినియోగం మరియు రవాణాకు సంబంధించిన వివిధ చాట్‌లు ఉన్నాయి. రియా చక్రవర్తితో ప్రారంభమైన విచారణ ఈ నెల ప్రారంభంలో ఆమె సోదరుడు షోయిక్ అరెస్టు చేయడం జరిగింది. డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు కలిగి ఉండటం వంటి విషయాల దృష్ట్యా ఇప్పుడు అనేక మంది సినీ మరియు టీవీ నటులను విచారణకు విలవడం అనేది ఎక్కువ అవుతున్నది.

Best Mobiles in India

English summary
Deepika Padukone For NCB Probe into Drugs Scandal due to WhatsApp Group Chat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X